-->

శృంగారకాంక్ష ? స్త్రీలకు ఉండదా? ఇది సృష్టి లక్షణమేనా? || Romantic desire? Don't women have it? Is this a characteristic of creation?

Also Read



 శృంగారకాంక్ష, లేదా లైంగిక కోరిక, మనుషులందరికీ సహజమైనది. స్త్రీలకు కూడా శృంగారకాంక్ష ఉంటుంది. ఇది సృష్టి లక్షణంలో భాగమే. స్త్రీలకు లైంగిక కోరిక ఉండదని అనుకుంటే అది ఒక అపోహ మాత్రమే.

స్త్రీల శృంగారకాంక్షకు కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండవచ్చు మరియు అవి వ్యక్తులవారి జీవితానుభవాలు, సంబంధాలు, శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై ఆధారపడి వుంటాయి. స్త్రీలు తమ శృంగారకాంక్షలను వివిధ రూపాల్లో అనుభవించవచ్చు, వ్యక్తపరచవచ్చు.

మనసికమైన మరియు శారీరకమైన అనుభవాలు, హార్మోన్ల ప్రభావం, సంబంధాల గుణాత్మకత మరియు వ్యక్తిగత అభిరుచులు అన్నీ శృంగారకాంక్షను ప్రభావితం చేస్తాయి.

స్త్రీల శృంగారకాంక్ష గురించి విపులంగా మాట్లాడటం, అర్థం చేసుకోవటం సాంప్రదాయాలు, సంస్కృతి, సమాజం మరియు వ్యక్తిగత స్వేచ్ఛలపైనా ఆధారపడి ఉంటుంది.

సృష్టి లక్షణం పరంగా, ఇది అన్ని జీవులకు సహజమైనదని చెప్పవచ్చు. మనిషికి, లైంగిక కోరికలు సంతానోత్పత్తి మరియు సంతృప్తికి సంబంధించిన ప్రక్రియలు అని గుర్తించాలి.


ఇది ఇద్దరికి సమానమైన ఆనందాన్ని కలిగించే ఒక క్రీడా. ఈ కాంక్ష పురుషునికి ఉంటుంది స్త్రీకి ఉంటుంది. అసలు ఈ కాంక్ష పుట్టేదే స్త్రీ లో అన్నది వాత్స్యాయనుడి ఆలోచన.

అరవై నాలుగు కళలు స్త్రీ కలిగి ఉంటుంది. ఈ కళలు అన్ని పురుషుడి లో కామాన్ని రేకెత్తించటానికే అని వాత్స్యాయనుడు తను రాసిన కామ శాస్రం లో రాశాడు. ఇంకా స్త్రీలను నాలుగు జాతులుగా విభజించి ఏ జాతి స్త్రీ ఏ సమియము లో ఆ కాంక్ష పుడుతుందో కూడా ఆ గ్రంథము లో రాశారు. బహుశా స్త్రీల శరీరము, ప్రకృతి అంటే గ్రహాలు నక్షత్రాలు వంటి వాటి వలన ఈ కాంక్ష కు ప్రేరేపించ బడుతుంది అని భావిస్తున్నాను.వీటికి ఆధారం కొన్ని ఆడ పక్షులు జత కట్టే బుద్ది కలిగినప్పుడు ఒక రకమైన శబ్దము చేస్తుందట. ఆ శబ్దానికి మగ పక్షి లో ఆ కోరిక పుట్టి ఆడ పక్షిని చేరుతుంది. అంతెందుకు గేదలు పెంచుకునే వారికి ఇది విదితమే , ఆడ గేదా ఎదకు వస్తే అరుస్తుంది.జన్మ స్థానము నుండి తీగలుగా ద్రవాలు స్రవించ బడుతుంటాయట. (ఇవన్ని నేను విన్నదే).

ప్రశ్నించిన వ్యక్తి బహుశా తన ఇంటావిడ వెంట తను కోరిక తో పడటమే కానీ , ఆమె ఎప్పుడు ఆ కోరిక తో తన వెంట పడటం జరిగి ఉండక పోవచ్చు. ఒక రకమైన అసహనం తో ప్రశ్న వేసినట్లు నాకు అనిపించింది. ఒక వేళ నా అభిప్రాయం తప్పు అయితే క్షమించండి.

కానీ మన దేశంలో ఈ విషయం పైన ఆడవాళ్లు చాలా నియమ నిబంధనలు పెట్టుకొని , పైకి చెప్పుకోవడానికి కూడా సాహసం చేయలేని పరిస్థితి లో వున్నారు.అందుకే అసలు స్త్రీలకు ఈ కోరిక ఉంటుందా అనే అనుమానం వస్తుంది.ఎందుకంటే సంప్రదాయం కట్టుబాట్లు అంటూ వారు బయట పడరు. కానీ భాగస్వామి అర్ధము చేసుకోవాలి… వాత్స్యాయనుడు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించాడు. స్వేచ్ఛగా దంపతులు మనసు విప్పి మాట్లాడు కోవటం అవసరమని.

ఇక సృష్టి అనే పదం వాడారు కాబట్టి దాని గురించి కూడా ఒక మాట అనుకుందాం. దేవునితో అత్మైక్యత పొందితే కలిగే ఆనందం తరువాత చెప్పుకోదగ్గ రెండవ ఆనందం ఈ క్రీడా. ఇద్దరిలో ఈ ఆనందాన్ని సృష్టి ఏర్పాటు చేసింది కాబట్టే ఈ రోజు నిరాటంకంగా అన్ని జీవరశుల లోను నూతన సృష్టి కొనసాగుతూ ఉంది. ఇందులో ఏ సుఖం లేకుండా కేవలము పిల్లల కోసమే కలవాలి అంటే ఎందరు సుముఖత చూపిస్తారు.. పిల్లల కోసము మాత్రమే కలిసే వారు కూడా ఉన్నారు, అలాంటి వారు నూటికో కోటికో ఒక్కరు వుంటారేమో…

ఇక శారీరక ఆరోగ్యం పైన , పుట్టి పెరిగిన పరిస్థితులు , శరీర రీతి ని బట్టి , ఈ కోరికలు హెచ్చుతగ్గులు ఉంటాయి. కొందరికి కొన్ని పరిస్థితుల వలన పూర్తిగా ఉండకుండా కూడా ఉంటాయి. అలాంటి వారిని నెమ్మదిగా ఆ పరిస్థితుల లోనుండి బయటకు తీసుకోరావాలి. బలవంతము కూడదు.

చివరగా ఒకరినొకరు అర్ధము చేసుకొని ముందుకు సాగాలి.వాత్స్యాయనుడి కామశాస్త్రం చదవండి. అది బూతు పుస్తకం కాదు ఇలాంటి ఎన్నో అనుమానాలు నివృత్తి చేసుకోవటానికి ఉత్తమమైన గ్రంథము. ప్రపంచానికే తలమాణికమైన ఏకైక గ్రంథము మన భారతీయుడి గ్రంథము.

ఇలాంటి విషయాలు తెలుసు కోవటం తప్పు లేదనే అభిప్రాయం తో ఈ జవాబు ఇస్తున్నాను మరోలా భావించవద్దండి.

ఒక చిన్న అనుభవం చెపుతాను. బామ్మర్ది వరుసైనా అబ్బాయికి పెళ్లై ఒక నెల అయివుంటుంది. కొత్త దంపతులను మా ఇంటికి భోజనానికి పిలిచాము. రెండు మూడు రోజులు మాతో వున్నారు . ఒక ఏకాంత సమియములో నాతో ఆ అబ్బాయి ఏడ్చాడు , తన భాగస్వామి తన దగ్గరికి రావటం లేదని, తనకు తను ఇష్టం లేదని ఏవేవో చెప్పుకున్నాడు. అప్పుడు ఇవన్నీ చెప్పాను. ..ఇది జరిగి ఇరవై సంవత్సరాలకు పైగా అయివుంటుంది. ఇప్పుడు వారి పిల్లలకు పెళ్లి ఈడూ వచ్చింది. హాయిగా వున్నారు. అందుకే నేను ఈ సమాధానము రాశాను.

ఎవరినైనా నొప్పించి ఉంటే మన్నించండి.

Close