-->

గ్రంథాలు - రచయితలు | List of Famous Books & Authors for General Awareness Section

Also Read


  • కాతంత్య వ్యాకరణం - రచయిత శర్వవర్మ. తన రాజు కుంతల శాతకర్ణి ఆరు నెలల్లో సంస్కృతం నేర్చుకోవడం కోసం ఈ పుస్తకాన్ని రచించాడు.
  • బృహత్కథ - ఈ గ్రంథాన్ని గుణాఢ్యుడు పైశాచీ భాషలో రచించాడు. విష్ణుశర్మ పంచతంత్రాన్ని రచించడానికి ఇది ఆధారమైంది.
  • గాథాసప్తశతి - దీన్ని శాతవాహన చక్రవర్తి హాలుడు సంకలనం చేశాడు. ఇందులో 700 శృంగార పద్యాలు అప్పటి సమాజాన్ని వివరించాయి. ఈ గ్రంథంలో 40కు పైగా తెలుగు పదాలు కనిపిస్తాయి. ఉదాహరణ: అందం, అత్త, పొట్ట, అద్దం, పిల్లి మొదలైనవి. హాలుడి గాథాసప్తశతి సంకలనంలో సహాయపడిన స్త్రీ కవులు - అనులక్ష్మి, అనువలబ్దం, మాధవి.
  • లీలావతి పరిణయం - దీని రచయిత కుతూహాలుడు. సింహళ రాకుమార్తె లీలావతి వివాహం ఆధారంగా హాలుడు ఈ గ్రంథాన్ని రచించాడు.
  • కామసూత్రం- ఈ శృంగార గ్రంథాన్ని వాత్సాయనుడు రాశాడు. దీనిద్వారా శాతవాహనుల కాలంనాటి సామాజిక, ఆర్థిక పరిస్థితుల గురించి తెలుసుకోవచ్చు.
  • కథాసరిత్సాగరం - దీని రచయిత సోమదేవుడు. బృహత్కథ ఆధారంగా దీన్ని రాశారు. శాతవాహనుల కాలంనాటి పాలన విశేషాలు, ప్రజల స్థితిగతులను ఇందులో తెలుసుకోవచ్చు. ఈ గ్రంథం ప్రకారం శాతవాహన యువరాజు చేతిలో ఆచార్య నాగార్జునుడు మరణించాడు.
  • ప్రజ్ఞాపారమితశాస్త్రం, మాధ్యమిక కారిక, సుహృల్లేఖ, శూన్యసప్తశతి, ద్వాదశనియమం, రసరత్నాకరం, రసరంజని, దశభూమి, ఆరోగ్యమంజరి తదితర గ్రంథాలను ఆచార్య నాగార్జునుడు రచించాడు. ఈయన యజ్ఞశ్రీ శాతకర్ణికి సమకాలీనుడు.
  • బృహత్కథామంజరి - దీన్ని క్షేమేంద్రుడు రచించాడు.
  • కువలయమాల - దీని రచయిత ఉద్యోతనుడు. ఈ గ్రంథం ప్రకారం శ్రీలంక, నేపాల్, టిబెట్ల నుంచి విద్యార్థులు విద్యార్జన కోసం నాగార్జునకొండ విశ్వవిద్యాలయానికి వచ్చారు.
  • ఆదిపురాణం, విక్రమార్జున విజయం- ఈ గ్రంథాల రచయిత పంపకవి. ఇతన్ని కన్నడ సాహిత్యంలో ఆదికవిగా పరిగణిస్తారు.
  • కవిజనాశ్రయం - ఇది ఛందో గ్రంథం. దీని రచయిత మల్లియరేచన. ఇది తెలుగులో మొదటి లక్షణ గ్రంథం.
  • యశస్థిలక చంపూకావ్యం, నీతివాక్యామృత, యుక్తి చింతామణి, యశోధర మహారాజు చరిత్ర - ఈ గ్రంథాల రచయిత సోమదేవసూరి.
  • నీతిశాస్త్రముక్తావళి, సుమతీ శతకం - వీటి రచయిత బద్దెన.
  • బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర - ఈ గ్రంథాల రచయిత పాల్కురికి సోమనాథుడు. ఈ గ్రంథాలు కాకతీయుల కాలం నాటి మతస్థితిగతులను, శైవమత ఉజ్వల దశను తెలియజేస్తాయి.
  • శివయోగం - కొలను గణపతిదేవుడు (ఇందులూరి నాయకుల చరిత్రను తెలుపుతుంది)
  • క్రీడాభిరామం - రచయిత వినుకొండ వల్లభరాయుడు. కాకతీయుల కాలంనాటి ప్రజల జీవన పరిస్థితిని తెలియజేస్తుంది.
  • ఆంధ్రమహాభారతం, నిర్వచనోత్తర రామాయణం తిక్కన సోమయాజి.
  • ప్రతాపచరిత్ర - ఏకామ్రనాథుడు
  • సిద్ధేశ్వర చరిత్ర- కాసే సర్వప్ప - 
  • నీతిసారం- కాకతి రుద్రదేవుడు (రాజ్య నిర్వహణ వివరాలు తెలియజేస్తుంది) - 
  • నృత్య రత్నావళి - రచయిత కాకతీయ గణపతిదేవుని గజసాహిణి జాయప సేనాని. నాటి నృత్యరీతులను తెలియజేస్తుంది.
  • ప్రతాపరుద్ర యశోభూషణం- రచయిత విద్యానాథుడు. కాకతీయుల కాలంనాటి కేంద్రప్రభుత్వ స్వభావం, సైనిక వ్యవస్థ గురించి తెలుపుతుంది.
  • ·        రంగనాథ రామాయణం - గోన బుద్ధారెడ్డి

    ·        భాస్కర రామాయణం- భాస్కరాచార్యుడు (తెలుగులో మొదటి చంపూ గ్రంథం)

    ·        మార్కండేయ పురాణం - మారన

    ·        సకల నీతిసారం- మడికి సింగనాచార్యుడు

    ·        పురుషార్థసారం- శివదేవయ్య

    ·        ప్రేమాభిరామం- త్రిపురాంతకుడు

    ·        పండితారాధ్య చరిత్ర, వృషాధిప శతకం, రుద్రభాషణం -పాల్కుర్కి సోమనాథుడు

    ·        దశకుమార చరిత్ర- దండి

    ·        కేయూరబాహు చరిత్ర- మాచన

    ·        కుమార సంభవం- నన్నెచోడుడు

    ·        దాశరధి శతకం, రామదాసు కీర్తనలు భక్తరామదాసు (కంచర్ల గోపన్న)

    ·        శివతత్వసారం, శ్రీగిరి శతకం- మల్లికార్జున పండితుడు

    ·        మువ్వగోపాల పదాలు – క్షేత్రయ్

    ·        యయాతి చరిత్ర - పొన్నెగంటి తెలగనార్యుడు. దీన్ని సర్దార్ అమీనాఖానకు అంకితం ఇచ్చాడు.

    ·        తపతీ సంవరణోపాఖ్యానం - అద్దంకి గంగాధర కవి. దీన్ని ఇబ్రహీం కుతబ్ షాహికి అంకితమిచ్చాడు.

    ·        రాజనీతి రత్నాకరం- కృష్ణయామాత్యుడు

    ·        దశరథ రాజనందన చరిత్ర - మాగంటి సింగనాచార్యుడు

    ·        సుగ్రీవ విజయం, నిరంకుశోపాఖ్యానంకందుకూరి రుద్రకవి

    ·        వజ్రాభ్యుదయం- వెల్లుట్ల నారాయణ కవి

    ·        వైజయంతి విలాసం- సారంగు తమ్మయ్య

    ·        శుకసప్తతి- దీని రచయిత పాలవేకిరి కదిరీపతి. ఈ గ్రంథంలో తెలంగాణ ప్రజల ఆహార, వేషభాషలను, ఇండ్లను, వారి వివాహ పద్ధతులను, నిత్య కార్యకలాపాలను వర్ణించాడు.

    ·        - కులియత్ అలీ- ఇది కవిత్వాల పుస్తకం. దీని రచయిత మహ్మద్ కులీ కుతుబ్ షా

    ·        - తూతి నామా - దీని రచయిత గవాసి. శుకసప్తతి అనే తెలుగు కావ్యానికి ఇది ఉర్దూ అనువాదం

    ·        - ఫూల్ బన్ - ఈ గ్రంథ రచయిత ఇబ్నే నిషాతి.

    ·        - లైలా మజ్ను - దీని రచయిత మీర్జా మహ్మద్ అమీన్.

    ·        - పద్మావతి - ఈ గ్రంథ రచయిత గులాం అలీ, పద్మావత్ అనే హిందీ పుస్తకానికి ఇది ఉర్దూ అనువాదం

    ·        -సనబీ నామా కుతుబ్ షాహీ - దీని రచయిత

    ·        - తెసల్నిమా - ఈ గ్రంథ రచయిత ఫిరోజ్

    ·     - రిసాల మికర్దాయ - కుతుబ్ షాహీల కాలంనాటి తూనికలు, కొలతలను వివరించే గ్రంథం. రచయిత మీర్ మహ్మద్ మోమిన్

    ·        - మిజాముల్ తబాయి కుతుబ్ షాహీ- ఇది ఒక వైద్యశాస్త్ర గ్రంథం. దీని రచయిత అకిమ్ తకియుద్దీన్

    ·        - తారీఖ్-ఇ- కుతుబ్ షాహి - ఈ గ్రంథ రచయిత కుర్షు

    ·   - నేచురల్ హిస్టరీ- దీని రచయిత ప్లీని, తూర్పు దేశాల చరిత్ర, సామాజిక, ఆర్థిక, భౌగోళిక పరిస్థితులను తెలియజేస్తుంది.

    ·        - పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ- దీని రచయిత ఒక అజ్ఞాత నావికుడు. ఈ గ్రంథం భారత్-రోమ్ వాణిజ్య సంబంధాలు, ఓడరేవుల గురించి తెలుపుతుంది.

    ·        - జాగ్రఫీ- టాలమీ. ఈ గ్రంథం శాతవాహనుల కాలంనాటి వాణిజ్య పట్టణాలు, ఓడరేవుల గురించి తెలుపుతుంది.

    ·        - ఇండికా - రచయిత మెగస్తనీస్. ఈ గ్రంథం ఆంధ్రులకు 30 దుర్గాలు, లక్ష కాల్బలం, రెండు వేల అశ్వబలం, 1000 గజదళం ఉన్నాయని తెలుపుతున్నది.

    ·        - కాలకసూరి ప్రబంధం- కాలకసూరి - సమయసారం, మూలాచారం, పంచశక్తీయ, ప్రవచనసార- ఈ గ్రంథాల రచయిత కొండాకుందాచారీ

    ·        - ఆంధ్ర మహాభాగవతం, భోగినీ దండకం, వీరభద్ర విజయం – పోతనామాత్యుడు

    ·        - ఆకునూరు, మాచిరెడ్డిపల్లి దురంతాలు - ఈ గ్రంథ రచయిత దేవులపల్లి వెంకటేశ్వరరావు

    ·        - తెలంగాణ- ఆంధ్రుల కర్తవ్యం- ఈ పుస్తక రచయిత సురవరం ప్రతాపరెడ్డి, గ్రంథాలయ నిర్వహణకు సంబంధించి దీన్ని రాశారు.

    ·        - ఆంధ్రుల సాంఘిక చరిత్ర - దీని రచయిత సురవరం ప్రతాపరెడ్డి

    ·        - తెలంగాణ ప్రజల సాయుధ పోరాట చరిత్రదేవులపల్లి వెంకటేశ్వరరావు

    ·        - తెలంగాణ పోరాట సమతులు- ఆరుట్ల రామచంద్రారెడ్డి

    ·        - వీర తెలంగాణ- విప్లవ పోరాటం- చండ్ర రాజేశ్వరరావు

    ·        - వీర తెలంగాణ నా అనుభవాలు- జ్ఞాపకాలురావినారాయణరెడ్డి

    ·        - తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర- దేవులపల్లి రామానుజరావు

    ·    - దాశరథి కృష్ణమాచార్యులు- అగ్నిధార, రుద్రవీణ, గాలిబ్ గీతాలు, తిమిరంతో సమరం, నవమి, ఆలోచనాలోచనలు, పునర్ణవం, కవితా పుష్పకం

    ·        - వీర తెలంగాణ విప్లవ పోరాటం-గుణపాఠాలు - పుచ్చలపల్లి సుందరయ్య

    ·        - ప్రజల మనిషి, గంగు- వట్టికోట ఆళ్వారుస్వామి

    ·        - తెలంగాణ సాయుధ పోరాటం నా అనుభవాలునల్లా నర్సింహులు

    ·        - మా భూమి- సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కరరావు

    ·        - మరో జలియన్ వాలాబాగ్-పరకాల- రేపాల నరసింహుడు

    ·        - నాజీ నైజం- అయ్యపు వెంకటరమణ

    ·        - అడవి- కేవీ రంగారెడ్డి

    ·        - శరభాంకలింగ శతకం- శరభాంకుడు

    ·        - అంబికా శతకం- తిప్పన్న

    ·        - మహాభారత నాటకం- గంగాధర కవి

    ·        - నీతి భూషణం- అప్పన్న మంత్రి

     

Close