వ్యవసాయ పంచాంగం 2021 | కార్తెల పై సామెతలు | రాశులు వారీగా సామెతలు | సామాన్య శాస్త్రం (Part - 3)
Also Read
కార్తెల పై సామెతలు
1. అశ్వనీ (ఏప్రిల్ - 14)
· అశ్వని కురిస్తే అంతా నష్టం, అప్పులు ఖాయం
· అశ్వని కురిస్తే ఆరు కార్తెలు విడుపు.
· అశ్వని కురిస్తే అడుగు తడవదు.
2. భరణి' (ఏప్రిల్ - 27)
· భరణిలో పుట్టిన ధరణి ఏలును భరణి కురిస్తే ధరణి పండును.
· భరణి ఎండకు బండలు పగులుతాయి.
· భరణిలో చల్లిన నువ్వు చేను కాయకు బరిగెడు గింజలు
· భరణి కార్తెలో చల్లిన కాయకు చిప్పెడు పంట.
3. కృత్తిక (మే-11)
· కృత్తిక పునర్వసులు సత్తువ పంట.
· కార్తె ముందర ఉరిమినా కార్యం ముందర పెదిరినా చెడుతుంది
4. రోహిణి (మ-25)
· రోహిణి ఎండకు రోళ్ళు పగులును
· రోహిణిలో విత్తనం రోళ్ళు నిండనిపంట.
· రోహిణి ఎండకు రోళ్ళ పాయసం ఉడుకును,
5. మృగశిర (జూన్-8)
· మృగశిర కార్తెలో ముంగిళ్ళు చల్లబడును
· మృగశిర కురిస్తే ముసలెద్దు రంకె వేయును.
· మృగశిరకు ముల్లోకాలు చల్లబడును.
· మృగశిర బిందె ఇస్తే ఇరు కార్తెలు ఇంకా ఇస్తాయి.
· మృగశిరలో బెట్టిన పైరు, మీస కట్టున కొడుకు మేలు.
· మృగశిరి వర్షిస్తే మఖ గర్జిస్తుంది.
· మృగశిర కురిస్తే ముంగాలి పండును.
· మృగశిర చిందిస్తే అయిదు కార్తెలు వర్షించును.
6. ఆరుద్ర (జూన్-22)
· ఆరుద్ర కార్తె విత్తనానికి అన్నం పెట్టిన ఇంటికి సేగి లేదు
· ఆరుద్ర కురిస్తే ఆరు కారెలు కురుస్తాయి.
· ఆరుద్ర కరుణిస్తే దారిద్ర్యము లేదు.
· ఆరుద్ర చిందిస్తే అరవై దినాల వరపు.
· ఆరుద్ర మొదటి పాదాన ఎత్తితే ఆరంభాలు చెడు.
· ఆరుద్రతో అదనుసరి.
· ఆరుద్రలో అడ్డెడు చల్లితే పుట్టెడు పండుతాయి.
· ఆరుద్ర వాన ఆదాయాల బాన.
· ఆరుద్ర వానకు ఆముదాలు పండుతాయి.
· ఆరుద్రలో వేసినా, అరటి ఆకులో పెట్టిన అన్నము ఒక్కటే.
· ఆరు కార్తెలు పోతే ఆరుద్ర దిక్కు.
· ఆరుద్రలో వర్షం, అమృతంతో సమానం.
· ఆరుద్ర వాన అరుదు వాన
· ఆరుద్ర ఉరిమితే ఆరు వానలు పడుతాయి
7. పునర్వసు (జులై - 6) :-
· పునర్వసు, పుష్యాలకు పూరీడు గుత్తయినా తడవదు.
8. పుష్యమి (జులై - 20) :-
· పుష్యమి కురిస్తే ఊరపిట్ట గూడ తడవదు.
· పునర్వసు పుష్యమి కార్తెలు వర్షిస్తే పూరీడు పిట్ట అడుగైనా తడవదు
9. ఆశ్లేష (ఆగస్టు - 3) :-
· ఆశ్లేష ఊడ్పు ఆరింతలవుతుంది
· ఆశ్లేష కురిస్తే ఆరోగ్యం.
· ఆశ్లేష వాన అరికాలు తేమ
· ఆశ్లేషలో ముసలెద్దు గూడ రంకె వేయును.
· ఆశ్లేష ముసురు - ఆగి ఆగి తుంపర కురియును.
· ఆశ్లేషలో అడుగున కొక చిగురైనా అడిగినన్ని వడ్లు ఇస్తుంది.
· ఆశ్లేషలో అడ్డెడు చల్లటం - పుట్టెడు ఏరుకోవటం
· ఆశ్లేషలో ఊడ్చిన - అడిగినంతపంట.
· ఆశ్లేష వర్షం - అందరికి లాభం.
· ఆశ్లేష వాన అరికాలు తమ
10. మఖ (ఆగస్టు - 17) :-
· మఖ మానికంత చెట్టయితే - కార్తీకానికి కడవంత గుమ్మడికాయ
· మఖ పుబ్బలు వరుపయితే మీ అన్న సేద్యం, నాసేద్యం మన్నే.
· మఖలో విత్తనాలు చల్లితే మచ్చలు కనపడతాయి.
· మఖలో పుట్టి పుబ్బలో మాడినట్లు.
· మఖలో మానెడు పుబ్బలో పుట్టాడు.
· మఖా పంచకం సదా వంచకం.
· మఖ పుట్బలు వారుపైతే మహత్తరమైన కాటకం.
· మఖ ఉరిమిత మదురుమీద కరయినా పండును.
11. పుబ్బ (ఆగస్టు - 31) :-
· పుబ్బలో చల్లినా, బూడిదలో చల్లినా ఒకటి.
· పుబ్బలో చల్లేది. మబ్బుతో మొరపుట్టుకునేది.
· పుట్బ ఉచ్చిచ్చి కురిసినా గుబ్బిబ్బి చెట్టు కింద నానదు
· పుబ్బ కొరివితే భూతం కెరిచినట్లు
· పుబ్బ రేగినా టూతు రేగినా నిలవదు
· పుబ్బలో చల్లే దాని కంటే దిబ్బలో చల్లేది మేలు
· పుబ్బలో పుట్టిడు చల్లే కంటే ముఖలో మానేడు చల్లటం మేలు
· పుబ్బలో పుట్టెడు చల్లే కంటే ఆశ్లేషలో అడ్డెడు చల్లటం మేలు
· పుబ్బలో పుట్టి మఖలో మాడినట్లు
12. ఉత్తర (సెప్టెంబరు - 13) :-
· ఉత్తర చూసి ఎత్తంగంప - విశాఖ చూసి విడవరా కొంప.
· ఉత్తర ఉరిమీనా, త్రాచు తరిమినా తప్పదు.
· ఉత్తర ఉరిమి తప్పినా, రాజు మాట తప్పినా, చెదపురుగుకు రెక్కలు వచ్చినా కష్టం.
· ఉత్తర పదును ఉలవకు అదును.
· ఉత్తరలో ఊడ్చేకంటే గట్టుమీద కూర్చోని ఏడ్చేది మేలు.
· ఉత్తర హస్తలు వృద్ధికి ప్రమాణం
· ఉత్తర వెళ్ళాక వరి ఉడ్పులు కూడదు
13. హస్త (సెప్టెంబరు - 27) :-
· హస్త ఆదివారం వస్తే చచ్చేటంత వాన హస్త కార్తెలో చల్లితే అక్షింతలకయినా కావు.
· హస్తకు ఆధిపంట - చిత్తకు చివరిపంట.
· హస్తకు ఆరు పాళ్ళు - చిత్తకు మూడు పాళ్ళు.
· హస్తపోయిన ఆరుదినాలకు అడక్కుండా విత్తు.
· హస్తలో అడ్డెడు చల్లేకంటే - చిత్తలో చిట్టడు చల్లేది మలు.
· హస్తలో ఆకు అల్లాడితే - చిత్తులో చినుకు పడదు.
· హస్తలో ఆకు అల్లాడితే చిత్తులో చినుకు పడదు.
· హస్తలో చల్లితే హస్తం లోకి రావు.
· హస్త కార్తెలో వానవస్తే అడుగకనే గొర్రెలు కట్టు.
· హస్త ఆదివారం వచ్చింది చచ్చితిమయ్యా గొల్లబోయల్లారా మీ ఆడవారినగలమ్మి అడ్డ కొట్టాలు
వేయించండి అన్నవట గొర్రెలు.
14. చిత్త (అక్టోబరు - 11 ) :-
· చిత్త కురిస్తే చింతలు కాయును
· చిత్త చినుకు తన చిత్తమున్న చోట పడును.
· చిత్తి ఎండకు బట్టతల పగులును.
· చిత్తలో చల్లితే చిత్తుగా పండును.
· ఉలవలు, చిత్తకు చిరుపొట్ట.
· చిత్త, స్వాతులు కురవకుండా ఉంటే చిగురాకుగూడ మాడిపోవును.
· చిత్త నేలలో దుక్కి - పుటం పెట్టిన పుత్తడి.
· చిత్త చిత్తగించి స్వాతి చల్లజేసి విశాఖ విసరకుంటే అనూరాధలో అడిగినంత పండుతాను అన్నదట వరి.
· చిత్త చిత్తం వచ్చిన చోట కురుస్తుంది.
· చిత్త ఎండకు పిట్ట తల పగులుతుంది.
· చిత్త స్వాతుల సందు చినుకులు చాలా దట్టం.
15. స్వాతి (అక్టోబరు - 27) :-
· స్వాతి కురిస్తే చట్రాయి గూడపండును.
· స్వాతి కురిస్తే చల్లపిడతలోకి రావు జొన్నలు.
· స్వాతి కురిస్తే భీతి కలుగును.
· స్వాతి కురిస్తే మూడు కార్తెలు కురుస్తాయి.
· స్వాతి కొంగ, పంటకాపు (రైతు) నీళ్ళున్నచోటే ఉంటారు.
· స్వాతి కొంగల మీదికి సాళువం పోయినట్లు.
· స్వాతి వానకు సముద్రాలు నిండును.
· స్వాతి వాన ముత్యపు చిప్పకుగాని, నత్తగుల్లకీ,
· స్వాతి సముద్రాన్ని చంకన బెట్టుకొస్తుంది.
· స్వాతీ! నేను జవురుకొస్తాను - విశాఖా నువ్వు విసురుకురా అన్నదట.
16. విశాఖ (నవంబరు - 16) :-
· విశాఖ వర్షం - వ్యాధులకు హర్షం.
· విశాఖ కురిస్తే పంటకూ విషమే.
· విశాఖ వర్షం దున్నలకు మాదిగలకు ఆముదాలకు బలం
· విశాఖ విసురుతుంది
17. అనూరాధ (నవంబరు - 20) :-
· అనూరాధ కార్తెలో అనాథ కర్తయినా ఈనుతుంది
· అనూరాధలో కురిస్తే (తడిస్తే) మనోరోగాలు పోతాయి.
18. జేష్ట్య (డిసెంబరు - 3) :-
· ష్ట చెడకురియును - మూల మురగ కురియును
19. మూల (డిసెంబరు - 16) :-
· మూల కార్తెకు వరి మూలన జేరుతుంది
· మూలముంచుతుంది
· మూల కురిస్తే ముంగారు పాడు
· మూల పున్నమి ముందర మాదిగైనా చల్లడు
· మూల మంటే నిర్మూల మంటాడు
· మూలలో చల్లిన ఉలవలు మూడుకాయలు ఆరు పువ్వులుగా పండును.
· మూల వర్షం ముంచితే జేష్ట వర్షం తెలుస్తుంది.
20. పూర్వాషాడ (డిసెంబరు - 29)
21. ఉత్తరాషాడ (జనవరి - 11)
22.శ్రావణం (జనవరి - 24)
23. ధనిష్ట ( ఫిబ్రవరి - 51)
24.శతభిషం ( ఫిబ్రవరి - 19)
25. పుర్వాబాధ్ర ( మార్చి - 4 )
26. ఉత్తరాబాద్ధ ( మార్చి - 4 )
27. రేవతి ( మార్చి - 31 )
· రేవతి వర్షం రసమయం - రమణీయం
· రేవతి వర్షం అన్ని పంటలకు రేణింపి.
· రేవతి వర్షం సర్వ సస్యములకు రమణీయం
నెలల వారీగా సామెతలు
1. కార్తీక మాసం
· కార్తీక మాసాన కడవలు కడగటానికి కూడా పొద్దుండదు.
· కార్తీక మాసంలో కడపటి వానలు.
· కార్తీక వర్షం కర్ణుని యుద్ధం.
2. మాఘమాసం
· మాఘ మాసపువాన మగడు లేని దాన
· మాఘ మాసపు చలి మంటలో పడ్డాతీరదు.
· మాఘ మాసంలో మాకులు సైతం వణుకుతాయి.
3. మార్గశిరం
· మార్గశిరంలో మహత్తయన చలి
· పుష్య మాసం
· పుష్య మాసంలో పూలు గుచ్చటానికి కూడా పొద్దుండదు
· పుష్య మాసానికి పూసంత వేసంగి,
12 రాశులు
1.మేషం 2.వృషభం 3.మిధునం 4.కర్కాటకం 5.సింహం 6.కన్య 7.తుల 8.వృశ్చికం 9.ధనుస్సు 10.మకరం 11.కుంభం 12.మీనం
రాశులు వారీగా సామెతలు
· సింహం లో చీరి ఊడ్చడము ,కన్యలో కంగా పింగా ఊడ్చడము ఒకటే
· కన్యలో చల్లితే కను గుంటల్లోకి రావు (ఉదుకు తినటానికి కూడా రావు)
· కర్కాటకం కురిస్తే కాటకం బందు (కాడి మోకు కూడా తడవదు)
· కర్కాటకం బిందిస్తే కాటకముండదు
· మిధునంలో పుట్టిన మొక్క మీసకట్టులో పుట్టిన కొడుకూ అక్కరకు వస్తారు
· మీన మేషాలు లెక్క పెట్టినట్లు
3 కాలాలు - 6 ఋతువులు - 12 నెలలు
1). ఎండా కాలం
1. వసంత ఋతువు (మార్చి - మే ) -- చైత్ర(మార్చి 23) ,వైశాఖ (ఏప్రిల్ 25) - చెట్లు చిగిర్చుతాయి
చైత్ర వైశాఖల్లో పెండ్లి కావిళ్ళు,శ్రావణ భాద్ర పదాల్లో దినం కావిళ్ళు
2. గ్రీష్మ ఋతువు (మే - జూలై ) -- జ్యేష్ట (మే 23) ,ఆషాడ (జూస్ 21) --ఎండలు పెరుగుతాయి
· అన్ని పైరులకు ఆపాడం
· ఆషాడ మాసంలో అరిసెలు వండటానికి పొద్దు ఉండదు
· ఆపాడానికి ఆకుపోతలు
· ఆపాడానికి పిపాణాలు బద్దలౌతాయి
.
2). వానా కాలం
3. వర్ష ఋతువు (జూలై -సెప్టెంబర్) - శ్రావణ (జూలై 21) ,బాధ్రపద (ఆగస్టు 20, సెప్టెంబర్ 19) – వర్షాలు కురుస్తాయి
· శ్రావణం లో శనగల గోల భాద్రపదంలో బాధల పోరు
· కరువులో అధిక మాసం (ప్రతి రెండున్నర ఏళ్ళకూ ఒక అధికమాసం వస్తుంది. నందన లో భాద్రపదం అలాంటిదే )
4. శరత్తు ఋతువు (అక్టోబర్ - డిశంబర్ ) -ఆశ్వీయుజ (అక్టోబర్ 18), కార్తీక (నవంబర్ 16) – వెన్నెల బాగా కాస్తుంది.
శరత్కాల వర్షం కృపణుని ఔదార్యం వంటిది.
· కార్తీక మాసాన కడవలు కడగటానికి (కడవ నీళ్ళు తెచ్చే పొద్దు) కూడా పొద్దుండదు.
· కార్తీక మాసంలో కడపటి వానలు.
· కార్తీక వర్షం కర్ణుని యుద్ధం.
· కార్తీకానికి కరుగు మోపుతుంది
· కార్తీక మాసానికి కుదురంత ఉందునా ,మాఘ మాసానికి నా మహిమ చూపిస్తాను
· కార్తీక మాసానికి కాకులు తొక్కుతాయి
· కార్తీక పున్నమికి కలక పంటలు
3). చలికాలం
5. హేమంత (డిశంబర్ - ఫిబ్రవరి) - మార్గశిర డిశంబర్ పుష్య జనవరి 13) -మంచు కురుస్తుంది
· మార్గ శిరంలో మహత్తయన చలి
· మార్గ శిరంలో మామిడి పూత
· మార్గ శిరంలో మాట్లాడటానికి పొద్దు ఉండదు
· పుష్య మాసంలో పూలు,పూసలు గుచ్చటానికి కూడా పొద్దుండదు
· పుష్య మాసానికి పూసంత వేసంగి,
6 .శిశిర ఋతువు (ఫిబ్రవరి - ఏప్రిల్ ) - మాఘ (ఫిబ్రవరి 13) ,ఫాల్గుణ (మార్చి 13) - ఆకులు రాలిపోతాయి
· మాఘ మాసపు వాన మగడు లేని వాన
· మాఘ మాసపు చలి మంటలో పడ్డా తీరదు.
· మాఘ మాసంలో మాకులు సైతం వణుకుతాయి.
· ఫాల్గుణ మాసపు వాన పది పనులకు చెరుపు
4 దిక్కులు
· తూర్పున ఇంద్ర ధనస్సు దూరాన వర్షం
· తూర్పున వరద గూడు వస్తే తుంగ మడిలో, పడమర వస్తే బండ మీద పశువుల్ని కట్టాలి.
· తూర్పున వరద గూడు వస్తే తుంగ గడ్డ కూడా తడవదు.పరమాట వస్తే పల్లాలన్నీ (ఏంట గుంటలన్నీ ) నిండుతాయి
· తూర్పున కొరు ఏస్తే దుక్కిటెద్దు రంకె వేస్తుంది
· తూరుపు తలాపి దున్నపోతు కూడా పెట్టదు
· ఉత్తరాన మబ్బు ఏలితే ఊరకే పోదు
· ఉత్తరపు వాకిలి ఇల్లు ఉరకే ఇచ్చినా వద్దు
· నెల వంకకు దక్షిణపు కొమ్ము హిచ్చయితే ధాన్యపు ధర హెచ్చు .ఉత్తరపు కొమ్ము హిచ్చయితే
ఉప్పు ధర హెచ్చు
· పటమట కొర్రు వేస్తే పాడి ఆవు రంకె వేస్తుంది
· పటమట కొర్రు వేస్తే పందిళ్ళ మీద రాజనాలు పండుతాయి
· పటమట కొర్రు వేస్తే పాడు గుంటలన్నీ నిండుతాయి .తూర్పున వేస్తే తుంగగడ్డ కూడా తడవదు.
· పడమట కుంగిన పొద్దు తూర్పున లేవదా?
· పడమటి వాకిలి పగవాడికి కూడా వద్దు
· పడమట మెరిస్తే పంది కూడా నీళ్ళకు దిగదు
· పడమట పావురాయంత మబ్బు నడిస్తే పాతాళం దాకా వాన
సామాన్య శాస్త్రం
· కార్తె ముందర ఉరిమినా కార్యం ముందర వదిరినా చెడుతుంది.
· గబ్బరీదు కార్తి వర్షాలకు దిబ్బలూ కరుగుతాయి. చంద్ర పరివేషం వర్ష యోగము
· తూర్పున ఇంద్ర ధనస్సు దూరాన వాత వర్షం
· తూర్పున ఇంద్ర ధనస్సు వస్తే తుంగ మడిలో పడమర వస్తే బండ మీద పశువుల్ని కట్టాలి.
· కొబ్బరి చెట్టుకు కుడితి మృత్యువు
· సేద్యానికి పద్దులు పనికిరావు
· దుక్కి కొద్ది పంట. బుద్ధి కొద్దీ సుఖము
· పాటిమీద వ్యవసాయం కూటికైనా రాదు
· చేనుకు గట్టు ఊరికి కట్టు
· వంటికి తిండి పుష్టి, వరికి దుక్కి పుష్టి
· నల్లనేలకు నూవులు, గట్టినేలకు కందులు
· కలుపు తీసిన చేను కన్నుల పండుగ
· ఎరువు చేసే ఉపకారం బంధువులుకూడా చేయరు
· లోతు దుక్కికి ఎక్కువ పంట
· పొరుగూరు దాకిరి, పొరుగూరి వ్యవసాయం, తనను తినేవే గానీ, తాను తినేవి కావు.
· కరువుకు గ్రహణాలు ఎక్కువ
Read More Topics
Post a Comment