-->

గురజాడతో పోలిస్తే శ్రీశ్రీ || Sri Sri compared to Gurjada

Also Read



    గురజాడ లిఖిత సంప్రదాయానికి సంబంధించిన కవి, రచయితే అయినా, మౌఖిక సంప్రదాయంలోని సారళ్యాన్ని భాషా సారళ్యాన్ని సాధించినవాడు శ్రీశ్రీ శబ్ద సంయోజనమూ, సమాసఘటనా, పదచిత్రాలూ, భావ శబలతా దేశి సంప్రదాయానికి సంబంధించినవి కావు. ఒకరకంగా మార్గ సంప్రదాయమార్గంలో నడిచినవి మరో ప్రస్థానంలో శ్రీశ్రీ సారళ్యాన్ని సాధించారు. నిజమే. గురజాడ అడుగుజాడలో నడిచానని శ్రీశ్రీ స్వయంగా చెప్పుకున్నా గురజాడ, గరిమెళ్ల, కవికొండల, చింతా దీక్షితులు వంటి వారి రచనల్లోని మాట్లాడే భాషకు దగ్గరైన శైలి శ్రీశ్రీలో కన్పించదు. అప్రమత్తతను పోగొట్టి చైతన్య స్ఫూర్తినీ, కార్యోత్సాహాన్ని కల్గించే భాషా నిర్మాణాలను ఆయన మహాప్రస్థానంలో వాడుకున్నారు. మలయమారుత సదృశమైన భావకవితా శైలిని వదలి, ఝంఝానిల షడ్జధ్వానం పొగగొట్టపు భూంకార ధ్వనులు ప్రతిధ్వనించే మహోద్వేగ శైలిని శ్రీశ్రీ వాడుకున్నారు. సాహిత్యంలో గురజాడ విప్లవనేతృత్వాన్ని శ్రీశ్రీ నిరూపించారు. గురజాడలోని మేధాశక్తి జీవితంలోని అనేక రంగాల్ని స్పృశించగలిగే, ప్రశ్నించగలిగే వైజ్ఞానిక దృష్టీ, ఆధునిక సంస్కారమూ శ్రీశ్రీలో తక్కువే కానీ శ్రీశ్రీ సాధించిన అభ్యుదయ వాస్తవికత, గురజాడ సాధించిన దానికంటే ఊర్ధ్వచలన స్వభావం కలది శ్రీశ్రీ జీవితసాహిత్యాల విశ్లేషణ, మూల్యాంకనం, శ్రీశ్రీ ప్రయోగశీలత ఆయన రచనల్లోని ప్రాచ్య, పాశ్చాత్య సంప్రదాయ ధోరణులు ఆయన దృష్టిలోని అంతర్జాతీయత, దేశీయత, రాష్ట్రీయత ఆశించిన ఆయన మార్క్సిస్టు సిద్ధాంత పరిజ్ఞానం పరిమితులు సర్రియలిజంతో సహా వివిధ రచనా ధోరణులమీద ఆయనమమకారం భాషా నిర్ధారణులలోని శైలిలోని urbanity వీటిలోని వైరుధ్యాలను మరింత లోతుగా అధ్యయనం చేయవలసి రావచ్చు అందుకే శ్రీశ్రీ గూఢప్రశ్నగా మిగిలారని అనటం పునర్మూల్యాంకనంలో ఈ గూఢ ప్రశ్న ఛేదింపక తప్పదు

Close