-->

చరిత్ర పూర్వ సంస్కృతి - Prehistoric Culture

Also Read



    ఏ దేశ చరిత్ర అయినా లిఖిత పూర్వక ఆధారాలు లభ్యమగుటతో ప్రారంభమౌతుంది. లిఖిత పూర్వక ఆధారాలు లభించని కాలాన్ని చరిత్ర పూర్వ యుగం (PRE HISTORIC PERIOD ) అన్నారు. లిఖితాధారాలు లేనందువల్ల పురావస్తు త్రవ్వకాల్లో బయల్పడిన పరికరాలను బట్టి చరిత్ర పూర్వ యుగాన్ని గూర్చి తెలుసుకొనవచ్చును. పురావస్తు త్రవ్వకాల్లో లభించిన అనేక రకాల వస్తువులు, పరికరాల ద్వారా మానవుని గతాన్ని తెలుసుకొనే శాస్త్రాన్ని 'పురావస్తు శాస్త్రం' అంటారు. పురావస్తు శాస్త్రజ్ఞులు ఈ త్రవ్వకాలు జరిపి వాటి నుండి బయల్పడిన కట్టడాలు, శాసనాలు, నాణేల అధ్యయనంనుండి, పరికరాలను బట్టి ఆదిమ మానువుని చరిత్ర తెలుసుకోగల్గుతారు. భారతదేశంలో మానవుడు మొదట రాతి పరికరాలతో జంతువులను వేటాడి, ఆకలి తీర్చుకొని తరువాత తన జీవన విధానాన్ని మెరుగుపరచుకొనుటకు ఉపయోగించుకొన్నాడు. ఈ పరికరాలను వాడటం వల్లనే మానవుడు జంతు ప్రపంచం నుంచి వేరైనాడు. ప్రాచీన పరికరాలు అన్ని రాతితో చేయబడినందున ఈ యుగాన్ని రాతి యుగం అన్నారు.

    ఆదిమ మానవుడు ఆహార సేకరణకు వేటగాడిగా ఉండి ఆ తర్వాతి కాలంలో ఆహారం ఉత్పత్తి చేసే స్థాయికి ఎదిగాడు. ఈ అభివృద్ధి కొన్ని వందల వేల సంవత్సరాల్లో వివిధ దశలలో జరిగింది. ఈ యుగంలో మానవుడు ఉపయోగించిన పరికరాలనుబట్టి ఈ రాతి యుగాన్ని ప్రాచీన శిలా యుగం, మధ్యశిలా యుగం, నవీన శిలా యుగం, తామ్ర శిలాయుగంగా విభజించారు.

Close