-->

హరప్పా నాగరికత - ప్రాముఖ్యత - Harappan Civilization - Significance

Also Read



    హరప్పా నాగరికత ప్రధాన లక్షణాలను గత పాఠంలో చదువుకున్నారు. భారత సమాజంలోని అనేక ప్రాంతాలకు ఈ సంస్కృతి విస్తరించింది. ఈ నాగరికత క్రీ.పూ. 2,500 నుండి క్రీ.పూ 1750 వరకు పరిఢవిల్లింది. రాజస్థాన్లోని కాళీబంగన్, బెలుచిస్తాన్ ప్రాంతాల్లో ఈ స్థావరాలు బయల్పడ్డాయి.
    ప్రాచీన భారతదేశ ప్రజలపై, జీవితంపై హరప్పా సంస్కృతి చెరగని ముద్ర వేసింది. ఈ నాటికి కూడా మత సంబంధ కార్యక్రమాలలో ఇతర సంప్రదాయాలపై హరప్పా సంస్కృతి ప్రభావాన్ని మనం చూడవచ్చు. ఈ పాఠ్యాంశంలో మనం హరప్పా సంస్కృతి ప్రాముఖ్యత, అది అందించిన సేవలను గురించి చదువుకుంటాం.

1. హరప్పా నాగరికత ప్రాముఖ్యత గురించి వ్యాసం రాయుము?

లేదా
    - హరప్పా మతం హరప్పా నాగరికత అనంతరకాలంలో మత విశ్వాసాలకు, భావాలకు ఎట్లు దోహదంచేసింది? జవాబు హరప్పా నాగరికతను మూల భారతీయ నాగరికత అని పిలుస్తారు. హిందూ సంస్కృతి వారసత్వ లక్షణాలు అనేకం హరప్పా సంస్కృతి నుండి పరంపరగా అంది పుచ్చుకొన్నవేకాకుండా గమనించదగ్గ విషయం త్రిమూర్తులలో ఒకరైన ఈశ్వరుని పూర్వరూపం పశుపతి పేరుతో హరప్పా నాగరికత కాలంలో పూజలందుకొన్నాడు. హిందూ దేవతలకు బంతువు వాహనంగా కలిగే ఉండే సాంప్రదాయ హరప్పా నాగరికత వారసత్వమే.
    హరప్పా ప్రజలు పూజించిన మహిమగల లింగాన్ని హిందువులు శివలింగపూజ రూపంలో కొనసాగించారు. పునరుత్పత్తి మహిమగల దేవతగా భూమిని పూజించడం. అమ్మతల్లిని గ్రామదేవత రూపంలో గ్రామాలలో పూజించడం వంటి హరప్పా సంస్కాృతి సాంప్రదాయాలు హిందూ సమాజంలో కొనసాగుతున్నాయి. హరప్పా నాగరికత కాలంలో రావిచెట్టు కొమ్మల మధ్య ఉన్న దేవుడి చిత్రాన్ని పూజించేవారు. తూనికలకు సంబంధించిన బరువులలో 16 సంఘ్యతో కూడిన భాగాలను ఉపయోగించారు.
    16. అణాలు ఒక రూపాయిగా లెక్కించడం నేటిక వాడుకలో ఉన్నది. హరప్పా ప్రజలు ఉపయోగించిన ఇత్తడి, కంచు పాత్రలనే దావాలయాలలో, ఇళ్ళలో విరివిగా వాడటాన్ని మనం గమనిస్తాము. ధాన్యం నిల్వ చేసుకొనే ప్రక్రియను హిందూసమాజనికి హరప్పా ప్రజలు అందించారు. హరప్పా నాగరికత యొక్క వ్యవసాయ ఆర్ధికవ్యవస్థ నేటి సమాజం ఉనికి మూలాధారంగా ఉండటమన్నది ఆ నాగరికత యొక్క ప్రాధాన్యతను చాటుచున్నది.

3. పశ్చిమాసియా నాగరికతలకంటే హరప్పానాగరికత ఎట్లు భిన్నమైనది? ఇది స్వదేశీయమైనదేనా? 

జవాబు - మెసపటోమియన్లకు సింధూనాగరికతతో క్రీపూ. 2350 నుండి వాణిజ్య సంబంధాలుండేవి. పశ్చిమాసియాలోని నాగరికతలతో సరిపోల్చినపుడు హరప్పా నాగరికతలో ప్రత్యేకతలు స్పష్టంగా కనిపిస్తాయి. సాంకేతికంగా హరప్పా ప్రత్యేక ప్రతిపత్తిగల అభివృద్ధిచెందిన నాగరికత. మెసపటోమియన్లు అడ్డదిడ్డంగా ప్రణాళికారహితంగా పట్టణాలు నిర్మంచుకొన్నారు. హరప్పా ప్రజలు దీర్ఘచతురస్రాకారం లేదా గ్రిడ్ పద్దతిలో ఇళ్ళు నిర్మించుకొన్నారు.
    పశ్చిమాసియా నాగరికతలలో మురుగునీటి పారుదల వ్యవస్ధలేదు. హరప్పా పట్టణాలలో రహదారుల ప్రక్కన మురుగునీటి పారుదల వ్యవస్థ అభివృద్ధి చేశారు. నిర్మాణాలలో కాల్చిన ఇటుకలు వాడటంలో హరప్పా ప్రజలు కనబరచిన నైపుణ్యం పశ్చిమాసియా నిర్మాణాలలో కనబడదు. కుండలు, ముద్రికలు తయారీలో హరప్పా ప్రజలు పశ్చిమాసియా నాగరికత ప్రజలకంటే భిన్నమైన శైలిని ఉపయోగించారు. ఈజిప్టు, మెసపటోమియా ప్రజల లిపికంటే భిన్నమైన బొమ్మలలిపిని హరప్పా ప్రజలు కనుగొన్నారు.
    హరప్పా నాగరికత దాదాపు ఒక మిలియన్ కిలోమీటర్లపైగా విస్తరించి వుంది. ఈజిప్టు, మెసపటోమియా నాగరికతలు రెండింటిని కలిపినా ఇంత విస్తీర్ణం లేదు. హరప్పా నాగరికత మీద గల ప్రపంచ నాగరికతల ప్రభావం దాని ప్రత్యేక ప్రతిపత్తిని భంగపరచలేదు. హరప్పా నాగరికత స్వదేశీయమయిన నాగరికత అని నిర్ధారించవచ్చును.

4. వైదిక సంస్కృతికంటే హరప్పా సంస్కృతి మిన్న రెండు కారణాలు తెలపండి?

    జవాబు - వైదిక సంస్కృతితో పోల్చినట్లయితే హరప్పాసంస్కృతి ఆధునికమైనది. ఋగ్వేద ఆర్యులు గ్రామీణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రాధాన్యతనిచ్చారు. హరప్పా ప్రజలు వ్యవసాయ వ్యాపార ఆర్థిక వ్యవస్థ ప్రాతిపదికగా గల నగరాలలో నివసించేవారు. తొలి వేదకాల ఆర్యులకు ఇతర ప్రాంతాలతో ఎటువంటి సంస్కృతి వ్యాపార సంబంధాలుండేవి కావు. హరప్పా ప్రజలకు సుమేర్, మెసపటోమియా వంటి నాగరికత ప్రజలతో వ్యాపార సంబంధాలుండేవి. కావున హరప్పా సంస్కృతి వైదిక సంస్కృతికంటే గొప్పది అని పేర్కొనవచ్చును.

ఈ క్రింది వాటి జవాబులు వ్రాయుము
ఎ) మెలుహ ఎక్కడ ఉంది? జ. సింధు పరివాహక ప్రాతం
బి) హరప్పా కాలంలో సాధారణంగా ఉపయోగించే తూనిక ఏది? జ. 16 సంఖ్య మరియు దాని గుణింతాలతో కూడుకొన్న తూనిక
సి) హరప్పా ప్రజలకు తెలియని లోహమేది? జ. ఇనుము
డి) హరప్పా సంస్కృతి ఏ సంవత్సరంలో పతనమైనదని సాధారణంగా చెబుతారు? జ. క్రీపూ. 1750

Close