-->

ఏప్రిల్ 2024 కరెంట్ అఫైర్స్. - తెలంగాణ - ఆర్టీసీకి ఐదు జాతీయ అవార్డులు - April 2024 Current Affairs.

Also Read



తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)కి జాతీయస్థాయిలో ఐదు నేషనల్ బస్ ట్రాన్స్పోర్ట్ ఎక్సలెన్స్ అవార్డులు దక్కాయి. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్డు ట్రాన్స్పోర్ట్ అండర్తోకింగ్స్ (ఏఎస్ఆర్డీయూ) ఏటా ఈ అవార్డులు ప్రకటిస్తోంది. 2022-23సంవత్సరానికిగాను రహదారి భద్రతలో, ఇంధన సామర్థ్య నిర్వహణ మొఫిషిల్ విభాగంలో, సిబ్బంది సంక్షేమం, ఉత్పత్తి కేటగిరీలో, సాంకేతికతతో ప్రయాణికులకు మెరుగైన సేవలందించినందుకు ప్రథమ స్థానం సాధించగా, అర్బన్ విభాగంలో ద్వితీయ స్థానంలో నిలిచింది. దిల్లీలో అవార్డులను అందించనున్నట్లు ఏఎస్ఆర్టీయూ ప్రకటించింది. ప్రజారవాణా వ్యవస్థలో టీఎస్ఆర్టీసీ దేశానికే రోల్ మోడల్గా నిలిచిందని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు.

జాతీయ పురస్కారాలు అందుకున్న టీఎస్ఆర్టీసీ

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ.. రహదారి భద్రత, ఇంధన సామర్థ్య నిర్వహణ, సిబ్బంది సంక్షేమం, సాంకేతికత వినియోగం, తదితర కేటగిరిల్లో ఐదు జాతీయ పురస్కారాల్ని సొంత చేసుకుంది. దిల్లీలోని ఇండియా హ్యాబిటాట్ సెంటర్లో జరిగిన నేషనల్ పబ్లిక్ బస్ ట్రాన్స్పోర్ట్ ఎక్స్ లెన్స్ అవార్డులను ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ నేతృత్వంలోని అధికారుల బృందం అందుకుంది. ఈ అవార్డులను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండరేకింగ్స్ (ఏఎస్ఆర్టీయూ) అందించింది. 2022-23 ఏడాదికి గాను ఐదు జాతీయస్థాయి పురస్కారాలు టీఎస్ఆర్టీసీకి దక్కాయి. అవార్డుల ప్రదానోత్సవానికి ఏఎస్ఆర్టీయూ అధ్యక్షుడు, కేంద్ర రోడ్డు రవాణా, రహదారులశాఖ కార్యదర్శి అనురాగ్ జైన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఐదు జాతీయ స్థాయి అవార్డులు దక్కడం సంస్థకు ఎంతో గర్వకారణమని, సంస్థ ఉద్యోగులకు ఈ పురస్కారాలను అంకితం చేస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రకటించారు.

Close