-->

భారత జాతీయోద్యమము (1905-1918) || The Indian National Movement (1905–1918)

Also Read


    జాతీయోద్యమ పురోగతికి తొలి తరానికి చెందిన నాయకులు గట్టి పునాది వేసిరి. ఈ నాయకుల కృషి ఫలములు జాతికి అందించలేకపోయినను తదనంతర కాలపు నాయకులకు సరిఅయిన మార్గంను చూపగలిగిరి.
    క్రీ.శ. 1905 - 1918 సంవత్సరముల మధ్యకాలంలో జాతీయోద్యమం మరింత ముందుకు సాగెను. స్వాతంత్ర్య ఉద్యమములో అన్ని ప్రధాన ధోరణులు ప్రవేశించినవి. ఈ పాఠంను బెంగాల్ విభజన (క్రీ.శ.1905)తో ప్రారంభించెదం. బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమం జాతీయోద్యమానికి నూతన దిశను చూపించినది. ఈ ఉద్యమకాలము నుండి మహిళలు, విద్యార్ధులు జాతీయోద్యమంలో భాగస్వామ్యులు కాగిలిగిరి. ఈ కాలంలో మితవాదుల రాజ్యాంగ ధోరణులు, అతివాదుల ఉద్యమాలు సమాంతరంగా కొనసాగినవి. స్వాతంత్య్రము కొరకు తీవ్రవాదులు చేసిన త్యాగాలను మరువలేం. ఆంగ్లేయుల 'విభజించు పాలించు' విధానం ఫలితముగా హిందూ-ముస్లిం ఐక్యత దెబ్బతిని వేర్పాటు ధోరణులు ప్రారంభమయ్యెను. మింటో మార్లే సంస్కరణలు, మాంటేగ్-ఛేమ్స్ఫర్డ్ రాజ్యాంగ సంస్కరణలు ఈ కాలంలో జరిగాయి. జాతీయోద్యమం తీవ్రస్థాయికి చేరుకొని క్రీ.శ.1918 నాటికి గాంధీ ఆగమనం ద్వారా స్వాతంత్ర్యోద్యమము చివరి దశకు చేరుకొనెను.

Close