-->

భారత జాతీయోద్యమము (1885-1905) ||The Indian National Movement (1885–1905)

Also Read


    
    19వ శతాబ్ది ద్వితీయ భాగంలో భారతీయులలో రాజకీయ చైతన్యం పెంపొందుటకు దోహదపడిన వివిధ అంశాలను గత పాఠంలో అధ్యయనం చేయుట జరిగెను. ఆంగ్ల పాలన నందలి వాస్తవ స్వభావమును అవగాహన చేసుకున్న భారతీయులు తామంతా సంఘటితమై పలు సంస్థలను ఏర్పాటు చేసుకొని ఉద్యమించుటకు సిద్ధమైరి. క్రీ.శ.1857లో తొలిసారిగా ఆంగ్లేయులను ఎదిరించి పోరాడిన భారతీయులు పిమ్మట క్రీ.శ. 1859-60లో నీలిమందు తోటల యజమానులకు వ్యతిరేకంగా పోరాడి తమ సత్తాను చూపిరి. క్రీ.శ.1875లో రైతులకు అశాంతి మహారాష్ట్రనందలి అహమ్మద్ నగర్, పూనాలలో ఉద్యమం రూపుదాల్చెను. రైతులే కాక కొన్ని గిరిజన వర్గాలు, నగరాలలోని ఉన్నత వర్గాలు సైతం తమ నిరసనను తిరుగుబాట్ల రూపంలో వ్యక్తపరిచిరి. విద్యావంతులైన భారతీయ మేధావులు బ్రిటీష్ సామ్రాజ్య వాద విధానాలను, ఆర్ధిక దోపిడీ వ్యతిరేకించిరి. ఆంగ్లేయులు పెంచిన పన్నులను, పత్రికలపై ఆంక్షలను, విద్యా విధానాలను, లోపించిన ఉపాధి సౌకర్యాలను, ఆంగ్లేయ జాత్యాంహకారంను తీవ్రముగా భారతీయులు నిరసించిరి. భారతీయులు ప్రజాస్వామ్యానికి అనర్హులని ఆంగ్లేయులు చేసిన ప్రకటన భారతీయుల తీవ్ర ఆగ్రహానికి కారణమయ్యెను.

    క్రీ.శ.1885లో 72 మంది రాజకీయ ప్రతినిధులతో భారత జాతీయ కాంగ్రెస్ అవతరించెను. జాతీయ స్థాయిలో అవతరించిన తొలి వేదిక కాంగ్రెస్. నూతన జాతీయ చైతన్యానికి రాజకీయ ఆలోచనలకు కాంగ్రెస్ ప్రతీకగా భావించబడెను. 1885 నుండి కాంగ్రెస్ కొద్దికాలంలోనే ఒక సామాన్య వేదిక స్థాయినుండి ఉద్యమ సంస్థగా మారి దేశంలోని భిన్న వర్గాల ప్రజలను, భిన్న సిద్ధాంతాల నాయకులను కలుపుకొనగలిగింది. ఈ కాలంలో భారతదేశం ఒక నూతనజాతిగా రూపాంతరం చెందగలిగెను. విస్తృతపునాదిపై నిర్మించబడిన జాతీయోద్యమం ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద ప్రజా పోరాటంగా ప్రసిద్ధి చెందెను.

Close