-->

భారత స్వాతంత్రోద్యమ పోరాటం 1857 తిరుగుబాటు - Indian Independence Struggle 1857 Rebellion

Also Read


    భారతదేశ చరిత్రలో క్రీ.శ. 1857 సంవత్సరం ఒక విశిష్ట ఘట్టానికి ప్రతీకగా నిలిచింది. భారతదేశంలో ఆంగ్లేయుల పరిపాలనకు మొదటిసారిగా ఒక సంఘటిత సవాలు (formidable challenge) ఎదురైంది. ఉత్తర భారతదేశం మరియు మధ్య భారత ప్రజలు బ్రిటీష్ వారి పరిపాలనకు వ్యతిరేకంగా ఒక మహా తిరుగుబాటును లేవదీసి, దాదాపుగా బ్రిటీష్ వారిని, భారతదేశం నుండి వెళ్లగొట్టుటకు ప్రయత్నం చేశారు. ఈ తిరుగుబాటు రావడానికి ఏ ఒక్క కారణమో జవాబుదారీ కాదు. ఈ తిరుగుబాటు, తూర్పు ఇండియా వర్తక సంఘం (ఈస్టిండియా కంపెనీ) వారి స్వార్థపూరిత మరియు భారతీయులను అణగదొక్కే పాలనా విధానం వలన ఎన్నో బాధలు పడ్డ భారతీయులు సంఘటితమై చేసిన పోరాటం. క్రీ.శ.1857లో జరిగిన సంఘటనలు, తూర్పు ఇండియా వర్తక సంఘం పరిపాలనలో భారత సమాజంలోని దాదాపు ప్రతి వర్గానికి చెందిన ప్రజలు పడ్డ బాధలను ప్రతిబింబిస్తాయి. ఆ విధంగా తూర్పు ఇండియా వర్తక సంఘం వారి ప్రధాన లక్ష్యమైన తక్కువగా పనిచేయడం, ఎక్కువ ఆదాయాన్ని పొందడం అనే దానికి వ్యతిరేకంగా కోపోద్రిక్తులైన భారతీయులు చేసిన పోరాటమే ఈ తిరుగుబాటు.

Close