-->

రష్యాలో తిరుగుబాటు - Revolt in Russia

Also Read



ఉద్రిక్త, నాటకీయ పరిణామాల మధ్య రష్యా దాదాపు అంతర్యుద్ధం అంచుల దాకా వెళ్లింది. అధ్యక్షుడు పుతిన్ పెంచి పోషించిన కిరాయి సేన ‘వాగ్నర్ గ్రూపు' ఆయనపైనేతిరుగుబాటు జెండా ఎగురవేసింది. ఒక్కొక్క నగరాన్నీ దాటుకుంటూ మాస్కోకు 200 కిలోమీటర్ల దూరం దాకా వెళ్లింది. ఈ తిరుగుబాటును సమర్థంగాతిప్పికొట్టేందుకు పుతిన్ సేనలు కూడా అంతే రీతిలో సన్నద్ధమయ్యాయి. భారీగాసైనిక వాహనాలు, బలగాల్ని మోహరించాయి. చివరికి బెలారస్ అధ్యక్షుడు లుకషెంకోమధ్యవర్తిత్వంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. తాము ఉక్రెయిన్ సరిహద్దులోని స్థావరాలకు వెళ్లిపోతున్నామని వాగ్నర్ అధినేత ప్రిగోజిన్ ప్రకటించారు.
మొదట ఏం జరిగిందంటే..

ప్రధానిగా, అధ్యక్షునిగా రెండు దశాబ్దాల పాటు రష్యాను పాలిస్తున్నపుతిన్ కు మొదటిసారిగా విషమ పరీక్ష ఎదురైంది. ఆయన ఆదేశాల ప్రకారమేఉక్రెయిన్పై యుద్ధం చేస్తున్న 'వాగ్నర్ గ్రూపు' పుతినైపైనే తిరుగుబాటుచేసింది. తమ దళాన్ని తీసుకుని మాస్కోకు దక్షిణంగా ఉన్న కీలక నగరంరొస్తోవ్-ఆన్-డాన్లోని రష్యా సైనిక కార్యాలయాన్ని ఆధీనంలోకి తీసుకుంది. సైనిక కార్యాలయంలో తీసుకున్న వీడియోను ప్రిగోజిన్ విడుదల చేశారు. తాముచేస్తున్నది న్యాయం కోసం పోరాటమే తప్పిస్తే తిరుగుబాటు కాదని స్పష్టంచేశారు. మాస్కోలోని సైనిక నాయకత్వాన్ని కూలదోసేందుకు అన్ని చర్యలుతీసుకుంటామని వాగ్నర్ ప్రతినబూనింది. మాస్కోవైపు దూసుకొస్తున్న వాగ్నర్దళాలు వొరొనెజ్ నగరం దాటాయి. వారిని నిలువరించేందుకు రష్యా దాడులకుదిగింది. మార్గమధ్యలో ఉన్న లిప్క్ ప్రాంతవాసులు ఇళ్లకే పరిమితంకావాలని ఆదేశించింది. ఆ నగరంలోని అన్ని సైనిక స్థావరాలను ఆక్రమించామనితెలిపారు. కిరాయి సైన్యానికి అడ్డుకట్ట వేయడానికి రష్యా బలగాలు పలుచోట్లజాతీయ రహదారులను తవ్వేశాయి. రెడ్ స్క్వేర్ వైపు దారుల్ని మూసేశారు. రెండుపురావస్తుశాలల్ని ఖాళీ చేయించారు.
ప్రిగోజిను కొందరు.. పుతినక్కు కొందరు మద్దతు
ప్రిగోజిను 'స్టోమ్ జెడ్' మద్దతు ప్రకటించింది. రష్యన్ జైళ్లలోబలవంతంగా నిర్బంధించిన ఖైదీల సమూహం ఇది. రష్యా రక్షణ శాఖ దీనిని ఏర్పాటుచేసింది. పుతిను రష్యా పార్లమెంటు పూర్తి మద్దతు ప్రకటించింది. క్రిమియాగవర్నర్, లుహాన్క్, దొనెట్స్ నేతలు కూడా అధ్యక్షుడి వెంటే ఉన్నారు. చెచెన్యా నేత, క్రూరుడిగా పేరున్న రంజాన్ కదిరోవ్ ప్రస్తుత తిరుగుబాటుపై ప్రకటన విడుదల చేశారు. ప్రిగోజిన్ చర్యలను ఖండించిన ఆయన రష్యాకు మద్దతుతెలిపారు. రష్యా పరిణామాలను నిశితంగా గమనిస్తోన్న పోలండ్, దేశంలో అత్యంతఅప్రమత్తతను ప్రకటించింది.
చర్చలతో మారిన పరిస్థితి

ప్రిగోజిన్తో బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో చర్చలు జరిపిసంధి ప్రయత్నాలు చేశారు. ఉద్రిక్తతను సడలించడానికి బలగాలను నిలువరించాలని కోరారు. దీనికి తమ నేత అంగీకరించారని 'రష్యా 24' వార్తా ఛానల్ తెలిపింది. వాగ్నర్ దళానికి భద్రతపరమైన హామీలు ఇవ్వడం ద్వారా సంధి కుదిరిందని వెల్లడించింది. ప్రిగోజిన్ కూడా ఈ మేరకు టెలిగ్రాం ద్వారా తన సందేశాన్నివినిపిస్తూ రక్తపాతం లేకుండా చేయడానికి తమ దళాల నిలువరింతకు అంగీకరించినట్లు తెలిపారు. తిరిగి తమతమ స్థానాల్లోకి వెళ్లిపోతున్నామని ప్రకటించారు.

Close