-->

ఐరాస కార్యాలయంలో చరిత్రాత్మక యోగా దినోత్సవం - A historic Yoga Day at the UN office

Also Read



చరిత్రాత్మకతొమ్మిదో యోగా దినోత్సవం అత్యున్నత ఐక్యరాజ్య సమితి వేదికపైవెలుగులీనింది. భారత్ ప్రతిపాదనతో ఏటా జూన్ 21న నిర్వహిస్తున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం ఈసారి ప్రపంచం మొత్తాన్ని ఏకం చేసింది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఐరాస ప్రధాన కార్యాలయంలో నిర్వహించి భారత్ తనఔన్నత్యాన్ని చాటుకుంది. ప్రపంచంలోని అత్యధిక దేశస్థులు పాల్గొన్నకార్యక్రమంగా గిన్నిస్ బుక్లోనూ చోటు సంపాదించింది. యోగావిశ్వవ్యాప్తమని, దానికి కాపీరైట్, పేటెంట్ లాంటివేవీ లేవని ప్రధాని మోదీపేర్కొన్నారు.

గిన్నిస్ రికార్డు

ఐరాసలో మోదీ నేతృత్వం వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంగిన్నిస్ రికార్డులకు ఎక్కింది. అత్యధిక దేశస్థులు పాల్గొన్న కార్యక్రమంగారికార్డు సృష్టించింది. సంబంధించిన ధ్రువపత్రాన్ని గిన్నిస్ ప్రతినిధులుఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్కు అందజేశారు. దాదాపు 180 దేశాల ప్రతినిధులు హాజరైనట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

Close