-->

వలసలతోనే అమెరికా జనాభా పెరుగుదల - America's population growth is due to immigration

Also Read



వలసల్లేకపోతేఅమెరికాలో గత ఏడాది జనాభా తగ్గిపోయి ఉండేదని అమెరికా జన గణన సంస్థ విడుదలచేసిన గణాంకాలు చెబుతున్నాయి. వలసల వల్లే అమెరికాలో శ్వేత జాతీయులు, ఆసియన్ల సంఖ్య పెరిగింది. 2022 మధ్య నాటికి అమెరికా జనాభా 33.32 కోట్లకుచేరుకుంది. 2021తో పోలిస్తే 0.4 శాతం ఎక్కువ. ఇతర దేశాల నుంచి శ్వేతజాతీయులు అమెరికాకు వలసవచ్చి ఉండకపోతే వారి జనాభా 85,000 వరకూ తగ్గిపోయి ఉండేది.

వలసలవల్ల వారి జనాభా 3,88,000 పెరిగింది. హిస్పానిక్ జాతి వారిని కలపకపోతేతెల్లవారి జనాభా 6,68,000 తగ్గిపోయేది. గత ఏడాది నాటికి అమెరికా జనాభాలోశ్వేత జాతీయుల సంఖ్య 26 కోట్ల పైచిలుకు ఉంది. వారిలో 6.33 కోట్ల మంది తాముహిస్పానిక్ జాతివారమని చెబుతారు. 2021తో పోలిస్తే ఇది 1.7 శాతం ఎక్కువ. గతఏడాది అమెరికా జనాభాలో 2.46 కోట్ల మంది ఆసియా సంతతి వారని తేలింది.

భారత్, చైనా తదితర ఆసియా దేశాల నుంచి వలసల వల్ల వీరి సంఖ్య 2.4 శాతం పెరిగింది. మరే ఇతర జాతిలోనూ ఇంతటి వృద్ధి కనిపించలేదు. ప్రధానంగా జననాలు ఎక్కువ కావడంవల్ల నల్లజాతి వారి జనాభా 0.9 శాతం పెరిగింది. అమెరికాలో 5 కోట్ల మందినల్లజాతి వారున్నారని జనగణన తెలిపింది. నిరుడు అమెరికన్ ఇండియన్, అలాస్కాగిరిజనుల జనాభా 72 లక్షలు. ఇది 1.3 శాతం పెరుగుదల. హవాయి పసిఫిక్ ద్వీపవాసుల సంఖ్య 17 లక్షలు. ఇది 2021 కన్నా 1.2 శాతం పెరుగుదల.

Close