-->

లైంగిక అంశాల్లో సమ్మతి వయసును 16కు పెంచిన జపాన్ - Japan has raised the age of consent to 16 for sexual matters

Also Read



అత్యాచారనేరాలకు సంబంధించిన చట్టాలకు జపాన్ కీలక మార్పులు చేసింది. ఇందులో భాగంగాలైంగిక సంబంధిత అంశాల్లో సమ్మతి వయసును 13 ఏళ్ల నుంచి 16 ఏళ్లకు పెంచింది. ఇప్పటి వరకు ఉన్న 13 ఏళ్ల వయసు ప్రపంచంలోనే అతి తక్కువ కావడం గమనార్హం.ఇందుకు సంబంధించిన బిల్లుకు అక్కడి చట్టసభ ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. దీంతోపాటు అత్యాచార కేసుల విచారణ, ఇతరుల లైంగిక చర్యలను వీక్షించడం వంటివాటిపైనా తాజా బిల్లు స్పష్టతనిచ్చింది. లైంగిక చర్యకు సమ్మతి తెలిపే కనీసవయసు ఆయా దేశాల్లో భిన్నంగా ఉంది. బ్రిటన్లో 16 ఏళ్లుగా ఉండగా, ఫ్రాన్స్లో 15 ఏళ్లు, జర్మనీ, చైనా దేశాల్లో 14 ఏళ్లుగా ఉంది. వీరి కంటేతక్కువ వయసు వారితో పరస్పర అంగీకారంతో లైంగిక చర్యకు పాల్పడినా అదిఅత్యాచారం కిందికే వస్తుంది.

లైంగికప్రయోజనాల కోసం 16 ఏళ్ల కంటే తక్కువ వయసున్న వారికి డబ్బు ఆశచూపిబలవంతపెట్టినా, బెదిరింపులకు పాల్పడినా జైలు శిక్ష తప్పదు. అయితే, జపాన్లో ఇప్పటి వరకు ఇందుకు కనీస వయసు 13 ఏళ్లుగా ఉంది. వీటికి సంబంధించిననిబంధనల్లో 1907 నుంచి జపాన్ మార్పులు చేయకపోవడం గమనార్హం. అత్యాచారనేరాలకు సంబంధించి 2017లో పలు చట్టాలకు జపాన్ కొన్ని మార్పులు చేసింది. అయితే, నేర నియంత్రణకు అవి సరిపోవని పేర్కొంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలుమొదలయ్యాయి. ఇదే సమయంలో అత్యాచార కేసుల్లో విచారణ ఎదుర్కొని నిర్దోషులుగా బయటపడిన వందల మంది ర్యాలీలు చేపట్టారు. వీరిని వ్యతిరేకిస్తూ లైంగికదాడులకు గురైన ఎంతో మంది బాధితులు, వారి మద్దతుదారులు రోడ్లపైకి వచ్చినిరసన తెలపడం సంచలనం రేపింది. ఇలా అత్యాచార నేరాలకు సంబంధించిన చట్టాల్లో కీలక మార్పులు తేవాలనే డిమాండ్ ఎక్కువ కావడంతో జపాన్ ప్రభుత్వం కొత్తబిల్లును తీసుకువచ్చింది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాన్ని అక్కడిమానవ హక్కుల సంఘాలు స్వాగతించాయి.

Close