-->

ఆంధ్రాలో వామపక్ష/కమ్యూనిస్టు ఉద్యమం వ్యాప్తి - Spread of leftist/communist movement in Andhra

Also Read



గాంధీ నాయకత్వంలోని జాతీయ కాంగ్రెస్ పార్టీ 1921లో సహాయ నిరాకరణోద్యమాన్ని ప్రారంభించింది. ఈ ఉద్యమం తర్వాత వివిధ రకాల వామపక్ష వర్గాలు భారత జాతీయ కాంగ్రెస్ లోపలా, వెలుపలా ఆవిర్భవించాయి. దేశంలో రైతాంగ, కార్మిక వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తూ, రాజకీయ సంస్థలుగా రూపుదిద్దుకున్నాయి. భారత జాతీయవాదుల్లోని కొందరు గాంధీ అనుసరిస్తున్న సిద్ధాంతాల పట్ల అసంతృప్తి చెందారు. కాంగ్రెస్ లో జవహర్లాల్నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ నాయకత్వాన నూతన వామపక్ష భావాలు ఆవిర్భవిం చాయి. ఈ ఇద్దరూ దేశ మంతటా పర్యటించి, నూతన సామ్యవాద సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. సామ్రాజ్యవాదాన్ని, పెట్టుబడిదారీ విధానాన్ని, భూస్వామ్య పద్ధతిని దుయ్యబట్టారు. ప్రజలు స్వాతం త్ర్యాన్ని సాధించుకోవాలంటే అది బ్రిటిష్ పార్లమెంట్ నుంచి కాను కగా రాదు అని ప్రకటించారు. విద్యార్థులకు, యువకులకు నెహ్రూ బోస్, ఇద్దరూ ఆరాధ్యదైవాలయ్యారు. వీరి స్ఫూర్తితో, దేశవ్యాప్తంగా యువజన సంఘాలు ఏర్పడ్డాయి. 1928లో 'ప్రప్రథమ అఖిల వంగ విద్యార్థి మహాసభలు' జరిగాయి. దానికి నెహ్రూ అధ్యక్షత వహిం చారు. దీంతో యువభారత జాతీయవాదులు క్రమేణా సోషలిజం వైపు మొగ్గు చూపారు.

1917 రష్యా విప్లవం తర్వాత సోవియట్ యూనియన్ సాధించిన ప్రగతిని చూచి కార్మికులు, రైతులు సామ్యవాద భావాల వైపు మొగ్గు చూపారు. 1920 ప్రాంతంలో సోషలిస్టు, కమ్యూనిస్టు గ్రూపులు ఆవిర్భ వించాయి. 1920లో రష్యాలో జరిగిన అంతర్జాతీయ కమ్యూనిస్టు సద స్సుకు ఎం.ఎన్.రాయ్ హాజరయ్యారు. 'కమ్యూనిస్టు ఇంటర్నేషనల్' నాయకత్వానికి ఎన్నికైన మొట్టమొదటి భారతీయుడు ఇతడే!

1930 ప్రాంతంలో కాంగ్రెస్ సోషలిస్ట్ భావాల పట్ల ఆకర్షితుల య్యేవారి సంఖ్య క్రమంగా పెరిగింది. 1929 నాటి అమెరికా తీవ్ర ఆర్థిక సంక్షోభం క్రమేణా మిగతా దేశాలకూ తాకింది. పెట్టుబడిదారి దేశాలలో తీవ్ర మాంద్యం ఏర్పడింది. ఫలితంగా భారీ ఎత్తున నిరు ద్యోగం చోటు చేసుకుంది. దీంతో ప్రజల దృష్టి మార్క్సిజం, సోష లిజం, ప్రణాళికాబద్ద ఆర్థిక వ్యవస్థల వైపు మళ్లింది. ప్రజలు అధికంగా సోవియట్ రష్యా వైపు మొగ్గు చూపారు. ప్రధానంగా యువకులు, కార్మికులు, రైతులు ప్రధానపాత్ర వహించారు.

1932 నాటికి భారతదేశంలో రైతులు, కార్మికుల పరిస్థితి దిగజా రింది. వ్యవసాయోత్పత్తులు ధరలు సగానికి పడిపోయాయి. ఈ కాలంలో ట్రేడ్ యూనియన్లు హక్కుల కోసం పోరాటం చేయడం మొదలైంది. కార్మిక, రైతు సంఘాలు ఏర్పడ్డాయి. '1936లో ప్రప్రథమ అఖిల భారత కిసాన్' ఏర్పడింది. పి.సి.జోషి నాయకత్వంలో కమ్యూ నిస్టు పార్టీ అభివృద్ధి చెందింది. ఆచార్య నరేంద్ర దేవ్, జయప్రకాశ్ నారాయణల నాయకత్వంలో కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ నిర్మాణానికి ప్రయత్నాలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రాలో వామపక్ష ఉద్య మాల వ్యాప్తి పరిశీలిద్దాం.

ఆంధ్రాలో 'కమ్యూనిస్టు ఉద్యమం' వ్యాప్తి

తెలంగాణాలో పది జిల్లాలు, కోస్తాలో తొమ్మిది జిల్లాలు, రాయలసీ మలో నాలుగు జిల్లాలు మొత్తం 23 జిల్లాలుగా ఆంధ్రప్రదేశ్ ఏర్పా టైంది.

ఆంధ్రాలో ప్రధానంగా రైతాంగ ఆర్థిక వ్యవస్థ ఉంది. కోస్తా జిల్లాలలో అనేక ప్రాజెక్టులు, నీటి పారుదల సౌకర్యాలు ఉండడం వలన అవి ఆర్థికంగా, సాంఘికంగా, రాజకీయంగా మిగతా అన్ని ప్రాంతాల కంటే అభివృద్ధి చెంది ఉన్నాయి. రాయలసీమ జిల్లాలు వ్యవసాయంలో వెనుకబడి, భూస్వామ్య సంబంధాల ఆధిపత్యం అధి కంగా ఉండేది. తెలంగాణ ప్రాంతం, హైదరాబాద్ పూర్వ సంస్థానంలో ఉన్నందున రైత్వారీ గ్రామాలలో భూస్వాముల దోపిడీ, జాగీరుదార్లు, దేశముఖ్ు, పటేల్పట్వారీ వ్యవస్థలో, ఆర్థిక, సాంఘిక, రాజకీయ రంగాల్లో ప్రజలు బాగా వెనుకబడ్డారు.

ఈ నేపథ్యంలో ఆంధ్రాలో 1934 నుంచి కమ్యూనిస్టులు, సోషలి స్టులు, ఎం.ఎన్.రాయ్ అనుచరులు ప్రాధాన్యత సంతరించుకున్నారు. వామపక్షాలుగా అభివృద్ధి చెందాయి. ఆంధ్రాలో కమ్యూనిస్టు పార్టీ అధికారికంగా 1934లో ఏర్పడింది. అదే సంవత్సరంలో ఈ పార్టీని నిషేధించారు. పుచ్చలపల్లి సుందరయ్య ఆంధ్రాలో కమ్యూనిస్టు పార్టీ పితామహుడు. కమ్యూనిస్టులు కాంగ్రెస్ సంస్థలో పనిచేస్తూనే గ్రామా ల్లోని వ్యవసాయ, కార్మికుల, పేద రైతుల హక్కుల కోసం ఆందోళనలు నిర్వహించారు. సామ్రాజ్యవాదులు 1942లో కమ్యూనిస్టు పార్టీపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేశారు. దీంతో బహిరంగంగా కమ్యూనిస్టులు పోరాటాలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీలో అంతర్భాగంగా ఉం టూ, 'కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ 1934లో ఏర్పడింది. 1940లో 'కామ్రేడ్స్ అసోసియేషన్' స్థాపించారు. 1920లో రష్యాలో జరిగిన అంతర్జాతీయ కమ్యూనిస్టు సదస్సుకు ఎం.ఎన్.రాయ్ హాజరయ్యాడు. 'కమ్యూనిస్టు ఇంటర్నేషనల్' నాయకత్వానికి ఎన్నికైన మొట్టమొదటి భారతీయుడు ఎం.ఎన్.రాయ్. తర్వాత ఎం.ఎన్. రాయ్ 'రాడికల్ కమ్యూనిస్టు పార్టీ'ని స్థాపించాడు.

గాంధీజీ శాసనోల్లంఘనోద్యమాన్ని ఆపివేయడం కమ్యూనిస్టులకు (ఎన్.జి.రంగాతో సహా) తీవ్ర ఆగ్రహం కలిగించింది. 'కాంగ్రెస్ వడ్డీ వ్యాపారస్థులతోనూ, ఆంగ్లేయులకు అనుకూలమైన పెద్ద వ్యాపారస్తు లతోనూ కూడి ఉందని, అందువల్లే డొమినియన్ స్టేటస్తో తృప్తి పడిందని ఈ ఎన్.జి.రంగా అభిప్రాయం. బ్రిటిష్ వారిపైనా జమీందా ర్లపైనా పోరాటం సాగించాలని రంగా ఆలోచించాడు. దేశంలో రైతు కూలీ ప్రభుత్వం ఏర్పరచాలని సోవియట్ యూనియన్ని ఆద ర్శంగా తీసుకోవాలని పి.వి.శివయ్య ఉపన్యాసాలు చేశాడు. తెనాలిలో జరిగిన రైతుమహాసభలో గౌతులచ్చన్న సంపూర్ణ స్వరాజ్యం అంటే రైతు కూలీ రాజ్యమేనని ఉద్ఘాటించాడు.

‘జాతీయోద్యమంలో వామపక్షాల సాహిత్య స్ఫూర్తి':

1935 నాటికే ఆంధ్రదేశంలో సోవియట్ యూనియన్ గురించి, మార్క్సిజాన్ని గురించి అనేక గ్రంథాలు వెలువడ్డాయి. శ్రీ రంగం శ్రీనివాసరావు (శ్రీ శ్రీ) 1934లో రాసిన 'మహాప్రస్థానం', గేయ సంపుటి ప్రచారంలోకి వచ్చింది. కొంపెల్ల జనార్ధనరావు సంపాదక త్వంలో ‘ఉదయని’ పత్రిక, నవ్యసాహిత్య పరిషత్ వారి ప్రతిభ పత్రిక, వెలువడింది. 1936లో అభ్యుదయ రచయితల 'ఆంధ్రసంఘం' ఏర్ప డింది. క్రొవ్విడి లింగరాజు, మాక్సిం గోర్కీ నవల 'మదరను తెలు గులో 1934లో ప్రచురించాడు. శివశంకరశాస్త్రి ప్రతిభ, విద్వాని విశ్వం తరిమెల నాగిరెడ్డి-సంపాదనకత్వాన 'నవ్య-సాహిత్యమాల' ప్రచుర ణలు అనేక సోషలిస్టు భావాలు ప్రచారం చేశాయి. నార్ల వెంకటేశ్వర రావు రాసిన నేటిరష్యా గ్రంథం బహుళ ప్రజాదరణ పొందింది. ప్రేమ్ చంద్ రాసిన 'గోదాన' 1936లో తెలుగులో వచ్చింది. ముల్క్ రాజ్ ఆనందు నవలలు ‘కూలీ ', 'అన్టచ్బుల్', 'టూలీవ్స్ అండ్ ఎ బడ్' తెలుగులో వచ్చాయి. ఎన్.జి.ఆచార్య సంపాదకత్వంలో 'చిత్రగుప్త', ‘ప్రజాబంధు' పత్రికలు, రంగా ప్రోత్సాహంతో వాహిని వంటి పత్రిక లొచ్చాయి. గద్దె లింగయ్య రచించిన 'విప్లవవీరుల' గ్రంథాన్ని బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది. ఎం.ఎన్.రాయ్ ప్రభావంతో ఆంధ్రాలో త్రిపురనేని గోపీచంద్ రచించిన 'అసమర్థుని జీవితయాత్ర' నవల, జి.వి.కృష్ణారావు కీలుబొమ్మలు వంటి నవలలు ప్రజాదరణ పొందా యి. ఆనాడు ఆవుల గోపాలకృష్ణమూర్తి, కోగంటి రాధాకృష్ణమూర్తి, ఎం.వి. శాస్త్రి, అభయంకరగుప్త, అబ్బూరి రామకృష్ణారావు, కోగంటి సుబ్రమణ్యం వంటి రచయితలు - మార్క్సిజం, భావాలు, వ్యాసాలు నవలలు ద్వారా ప్రచారం చేశారు.

తెలుగు భాషలో కొన్ని పత్రికలు:

1939లో 'ఆంధ్రప్రభ దినపత్రిక ఖాసా సుబ్బారావు సంపాదక త్వంలో వెలువడింది. 1936లో నవశక్తి పత్రిక ఆరంభించబడి, 1939 లో నిషేధించబడింది. 1936లో తాపీధర్మారావు సంపాదకత్వంలో 'జనవాణి' పత్రిక వచ్చింది. ఇవన్నీ ఆంధ్రాలో వామపక్షాల అభి వృద్ధికి, వ్యాప్తికి తోడ్పడ్డాయి.

వామపక్షాలన్నీ కాంగ్రెస్లోనే ఉంటూ, కాంగ్రెసు వశపరుచుకో వాలని ముఖ్యంగా కమ్యూనిస్టుల ధ్యేయం. వామపక్షాల ఆధ్వర్యంలో యువజన ఉద్యమానికి అన్నా ప్రగడ కామేశ్వరరావు నాయకత్వం వహించారు. ఆయన అధ్యక్షతలో 1937లో 'కృష్ణాజిల్లా యువజన మహాసభ జరిగింది. గుంటూరు జిల్లా మంతెనవారి పాలెం, తాళ్లూ రులలో 1938 - 1939 అన్నాప్రగడ కామేశ్వరరావు రాజకీయ పాఠశా లలు నిర్వహించాడు. 1939లో ఎన్.జి.రంగా అధ్యక్షతన 'మద్రాసు ప్రెసిడెన్సీ విద్యార్థుల మహాసభ మద్రాసులో జరిగింది. 1934లో ఆచార్య ఎన్.జి.రంగా 'నిడుబ్రోలు'లో రాజకీయ పాఠశాల నిర్వహిం చాడు. రంగా రాయలసీమలో కూడా అనేక రాజకీయ పాఠశాలలు ద్వారా సామ్యవాద భావాలు ప్రచారం చేశాడు.

Close