-->

మొఘలుల పాలనా సంస్కరణలు - Administrative reforms of the Mughals

Also Read


ఎవరి గురించయినా తెలుసుకోవాలంటే అధికారం అప్పగించి చూడు వారి అసలు రంగు బయటపడుతుంది అంటారు. మధ్య ఆసియా లోని ఫర్గాణా, సమర్ఖండ్ వంటి సాదాసీదా ప్రాంతాలకు నాయ కత్వం వహించిన బాబర్ అతని వారసులు అమేయ సిరిసంపదలు, ప్రకృతి వనరులతో నిండిన విశాల భారతదేశానికి చక్రవర్తులై ఉదా త్తంగా పాలించారు. ఒక్క ఔరంగజేబు కాలాన్ని మినహాయిస్తే మొఘ లుల హయాంలో పాలన సర్వజనామోదంగానే సాగిందని చెప్ప వచ్చు. మొఘలుల్లో మొదటివాడైన బాబర్ పాలనలో కొన్ని మౌలిక మైన మార్పులను ప్రవేశపెట్టాడు. పాదా (చక్రవర్తి) పేరిట పాలన సాగింది. నామమాత్రంగా కూడా మొఘలులు ఖలీఫా ఆధిపత్యాన్ని ఆమోదించలేదు. ఇస్లామిక్ చట్టాలకు సంబంధించి తలెత్తే వివాదా లను సైతం పాదాయే పరిష్కరించేవాడు. చక్రవర్తి భగవంతుడి ప్రతి నిధి అన్న భావన అక్బర్ కాలం నుంచి ప్రారంభమైంది. ఈ కారణం తోనే జరోఖాదర్శన్, తులాదన్ వంటి సంప్రదాయాలకు అక్బర్ తెరలే పాడు. అక్బర్ హయాంలో వకీల్, దివాన్ లేదా వజీర్, మిర్ బక్షి, సదర్ ఉస్ సదర్ అనే నలుగురు మంత్రులుండేవారు. తర్వాత కాలం లో ఖాన్-ఇ-సమన్, ముఖ్య ఖాజీ, ముల్తాసిబ్లకు కూడా మంత్రుల హోదా ఇచ్చారు. కొన్నాళ్లకు వకీల్-దివాన్ లేదా వజీర్ పదవులన్నిం టినీ కలిపి వకీల్ ఇ ముత్లక్ అన్న ఒకేఒక హోదాగా మార్చారు. చక్రవర్తి తర్వాత స్థానమితనిది. రాజ్య ఆదాయ, వ్యయాలు, ఇతర శాఖలపై అజమాయిషీ ఈయన విధులు. మిర ్బక్షి చేతిలో సైన్యం, సదర్ ఉస్ సదర్ నేతృత్వంలో మత, విద్య, ధర్మ సాంస్కృతిక అంశా లుండేవి. రాజ్యంలో న్యాయవిభాగం ముఖ్య ఖాజీ చేతిలో ఉండేది. ప్రజల నైతిక ప్రవర్తన, ఇస్లామిక్ నియమాల సక్రమ అమలు వంటివి ముహసిబ్ విధులు. రాజ ప్రాసాదం, రాజు అతని కుటుంబీకుల అవసరాలను నెరవేర్చేందుకు ఖాన్ ఇ సమన్; గూఢచార విభాగానికి దరోగ ఇ దాక్ చౌకి నేతృత్వం వహించేవాడు.

రాజ్యాన్ని సుబాలుగా విభజించారు. అక్బర్ హయాంలో 15, షాజ హాన్ హయాంలో 19, ఔరంగజేబు పాలనలో 21 సుబాలు ఉన్నాయి. సుబాకు అధిపతిగా సుబేదార్ లేదా సిపాసలార్ ఉండేవాడు. సుబా లను తిరిగి సర్కార్లుగా, పరగణాలుగా విభజించారు. పాలనలో చివరి యూనిట్ గ్రామం. సర్కార్కు అధిపతిగా ఫౌజార్ ఉండేవాడు. సర్కార్లో సర్వం సహా సైనికాధిపతి ఈయన. ఆర్థిక కార్యకలాపాలను పర్యవేక్షించే అమల్ గుజార్ సర్కార్లో మరో ముఖ్య అధికారి. అదే విధంగా పరగణాలు షిక్టార్, అమిల్ అనే అధికారుల నేతృత్వంలో ఉండేవి. పట్వారీ, చౌకిదార్ నేతృత్వంలో గ్రామపాలన సాగేది. చక్రవర్తి తరఫున వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తూ, సైనిక నిర్వ హణ కోసం మున్సబార్లు ఉండేవారు. జీతాలకు బదులుగా వీరికి జాగీర్లను కేటాయించేవారు. ఆ భూముల నుంచి వచ్చే రెవెన్యూలో కొంతభాగాన్ని మున్సబార్లు జీతాలకు బదులుగా తీసుకునేవారు. అయితే కొందరు మున్సబారులకు మాత్రం రాజాస్థానం నేరుగా జీతాలను చెల్లించేది. జాగీర్దార్లందరూ మున్సబారులే గానీ మున్సబ్ దారులంతా జాగీర్దారులు కారు. రాజప్రాసాద నిర్వహణ ఖర్చులు, చక్రవర్తి వ్యక్తిగత వ్యయాల కోసం ఖలీసా భూములను ప్రత్యేకించారు. మున్సబారీ వ్యవస్థను తీర్చిదిద్దడానికి కొన్ని పద్ధతులను అనుసరిం చారు. అశ్వదళం మారిపోకుండా, విధులకు క్రమంతప్పకుండా సైని కులు హాజరయ్యేలా చూసేందుకు- దాగ్ (గుర్రాలపై ముద్ర), చెహ్రా (సైనికులకు క్రమసంఖ్య) విధానాలను ప్రవేశపెట్టారు. మున్సబ్దా రుల జీతం, హోదాలను ప్రతిఫలించే 'జాత్'; అశ్విక దళాల సంఖ్య నిర్వహణ వ్యయాన్ని సూచించే 'సవార్' హోదాలను అక్బర్ ప్రవేశపె ట్టారు. రెవెన్యూ పాలన మరింత కచ్చితంగా జరిగింది. భూ శిస్తు వసూలుకు భిన్న రకాలైన పద్ధతులను అనుసరించారు. బతాయ్ లేదా గల్లా బక్ష్, కాన్ కూట్, నసఖ్ అనే మూడు పద్ధతుల్లో శిస్తు నిర్ణయం జరిగేది. ప్రభుత్వానికి రైతుల నుంచి దఖలు పడుతున్న శిస్తు లెక్కలను పూర్తిగా సమీక్షించి, సంస్కరణలు తీసుకురావడం కోసం రాజా తోడర్ మల్ జబ్తో లేదా బందోబస్త్ విధానాన్ని ప్రవేశపెట్టాడు. ఈ పద్ధతి కింద భూమిని నాలుగు రకాలుగా వర్గీకరించారు. ఏటా సాగవుతున్న భూమిని 'పోలజ్’గా, ఒకటి రెండేళ్లుగా సాగులో లేని భూమిని ‘పరౌటీ’గా, మూడు నాలుగేళ్లుగా సాగుకాని భూమిని 'చచర్'గా, అయిదేళ్లు అంతకంటే ఎక్కువ కాలం నుంచీ బీడుగా పడిఉన్న భూము లను ‘బంజర్’గా వర్గీకరించారు. భూమిని కొలిచేందుకు రాజా తోడర్ మల్ 'ఇలాహి గజ్' అనే శాస్త్రీయ పద్ధతిని ప్రవేశపెట్టాడు. రైతులను కూడా మూడు రకాలుగా వర్గీకరించారు. సొంత ఊర్లో పొలాలు, పరిక రాలు ఉన్న రైతులను కుద్కిస్తాలని, బయటి నుంచి వచ్చి కౌలుకు తీసుకొని భూములను సాగుచేసేవారిని పాహీలని, సొంత ఊళ్లోనే ఉంటూ ఎలాంటి భూములూ, పరికరాలూ లేని వారిని ముజరియమ్ లనీ వర్గీకరించారు.ప్రపంచ అద్భుత నిర్మాణాల్లో ఒకటిగా పేర్కొనదగిన తాజ్మహల్ సైతం షాజహాన్ కాలంలోనిదే. తాజ్మహల్ నిర్మాణాన్ని ఉస్తాద్ ఈసా అనే నిపుణుడు పర్యవేక్షించాడు. తాజ్మహల్కు స్ఫూర్తినిచ్చిన రెండు నిర్మాణాలు ఢిల్లీలో ఉన్నాయి. అవి ఢిల్లీలోని హుమయున్ సమాధి, ఇతిమదుద్దాలా సమాధి.

మొఘలుల సాంస్కృతిక వైభవం గణనీయమైంది. అక్బర్ కాలం లో ఫతేపూర్ సిక్రీ అనే నూతన రాజధాని నగరాన్ని నిర్మించారు. అక్బర్ నేతృత్వంలోనే జోధాభాయ్ మహల్, మిరియం మహల్, సుల్తానా మహల్, బీర్బల్ మహల్ వంటి సుప్రసిద్ధమైన నిర్మాణాలు జరిగాయి. జహంగీర్ కాలంలో చలువరాళ్లతో అత్యద్భుత నిర్మాణ కౌశలంతో ఇతిమదుద్దాలా సమాధిని నిర్మించారు. షాజహాన్ కాలంలో రాజధాని నగరం ఆగ్రా నుంచి ఢిల్లీకి మారింది. ఢిల్లీలోని దివాన్-ఇఆమ్, జామా మసీదు, మోతీ మసీదు షాజహాన్ నిర్మించినవే.

Close