-->

ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామం-1857 - Revolt of 1857 – First War of Independence Against British

Also Read


భారతదేశాన్ని బ్రిటిష్ కబంధ హస్తాలు నుంచి విముక్తం చేయడం కోసం జరిగిన తొలి సంగ్రామంగా 1857 తిరుగుబాటు విశిష్టతను సంతరించుకుంది. నిరంకుశత్వం, దోపిడి అణువణువునా నిండిన వలస పాలకులకు బెదురు పుట్టించి వారి నిష్క్రమణకు నాంది పలికిన ఈ తిరుగుబాటుకు కారణాలనేకం. 1848 నుంచి 1856 వరకు గవర్నర్ జనరల్గా పని చేసిన డల్హౌసి అమలు చేసిన రాజ్య సంక్రమణ విధానం తిరుగుబాటుకు ప్రధాన ప్రేరకంగా మారింది. దత్తత ద్వారా రాజ్యాధికారాన్ని అందుకునే అర్హతను తిరస్కరిస్తూ డల్హౌసి 1848లో సతారా, 1849లో జైపూర్-సంబల్పూర్, 1850లో భగత్, 1852లో ఉదయపూర్, 1853లో జాన్సీ, 1854లో నాగపూర్ సంస్థానాలను ఆక్రమించాడు. పాలన అసమర్థతను కారణంగా చూపి యోధ్య నవాబును తొలగించడంతో పాటు, మొఘల్ చక్రవర్తి రెండో బహ దూర్ షాను కూడా తొలగించాడు. ఈ పరిణామాలు భారతీయ పాల కుల్లో బ్రిటిషర్లపై వ్యతిరేకతను పెంచాయి.
వీటికి తోడు పెరుగుతున్న పన్నుల భారం, ఉపాధి అవకాశాలు తగ్గిపోవడం, పెచ్చుమీరిన అసమానతలు, నేతన్నల బతుకులు దుర్భ రంగా మారిపోవడం వంటి కారణాలన్నీ ఆనాటి సమాజంలో ఆంగ్లే యుల పాలనపై అసంతృప్తిని రాజిల్లచేశాయి. మరోవంక క్రైస్తవ మతా న్ని వాయువేగంతో దేశంలో వ్యాప్తిచేయడం కోసం ఆంగ్లేయులు చేసిన ప్రయత్నాలు భారతీయుల్లో తీవ్ర ఆందోళనను రేకెత్తించాయి. 1833 చార్టర్ యాక్ట్ మిషనరీ స్కూళ్లు విస్తరించడం, క్రైస్తవాన్ని స్వీకరించిన వారికి కూడా ఆస్తిలో హక్కు ఉంటుందని 1850లో ప్రవేశపెట్టిన చట్టం భారతీయ మేధావి వర్గంలో పునరాలోచనకు కారణమైంది. మరో వంక రెండు లక్షలకు పైచిలుకు ఉన్న భారతీయ సేనానుల పట్ల ఆంగ్లే యులు అనుసరిస్తున్న అణచివేత ధోరణి తిరుగుబాటుకు ఆజ్యం పోయడానికి ముఖ్య కారణమైంది. అతి తక్కువ జీతాలు, వర్ణ వివక్ష, అవమానాల వంటివన్నీ దేశీయ సైనికుల్లో ఆగ్రహానికి కారణమయ్యా యి. సైనికులందరూ జుత్తును చిన్నగా కత్తిరించుకోవాలంటూ 1856లో కానింగ్ ప్రవేశపెట్టిన నిబంధన సనాతన సంప్రదాయాలను అనుసరించే సిపాయిల్లో ఆవేశాన్ని రగిల్చింది. ఆవు కొవ్వు, పంది కొవ్వు పూసిన తూటాను ఉపయోగించాల్సిందేనంటూ 1856లో తీసు కున్న నిర్ణయం హిందూ, ముస్లింల మనోభావాలను తీవ్రంగా గాయ పరచింది.

వీరోచిత పోరు...

1857 మార్చి 29న 34వ బెటాలియన్కు చెందిన మంగళ్ పాండే బ్రిటిష్ అధికారిపై తిరగబడి, కాల్పులు జరిపాడు. ఆ పరిణామం తర్వాత ఏప్రిల్ 8న అతడిని బహిరంగంగా ఉరితీశారు. అనంతరం 1857 మే 10న అనేకమంది సిపాయిలు తిరుగుబాటు చేసి ఖైదులో ఉన్న తమ సహచరులను విడిపించుకొని ఢిల్లీ బాట పట్టారు. జనరల్ బఖ్ ఖాన్ ఆధ్వర్యంలో ఢిల్లీ చేరిన భారతీయ సేనానులు మే 11న మొఘల్ పాలకుడైన రెండో బహదూర్ షాను చక్రవర్తిగా ప్రకటిం చారు. వెనువెంటనే తిరుగుబాటు దేశం నలుమూలలకు పాకింది. ఢిల్లీని పునరాక్రమించుకుంటే మినహా తమకు అస్తిత్వం లేదని భావిం చిన బ్రిటిష్ పాలకులు నైవెలిన్, చాంబర్లీన్ల సారథ్యంలో సేనానుల ను పంపారు. సెప్టెంబర్ 20న రెండో బహదూర్ షాను, అతని భార్యను బంధించి వారిని రంగూను తరలించారు. అత్యంత కీలక మైన ఘట్టంగా కాన్పూర్ తిరుగుబాటు చరిత్రలో నిలిచిపోయింది. తాంతియాతోపె, నానాసాహెబ్ నేతృత్వంలో అత్యంత వీరోచితంగా జరిగిన పోరాటాన్ని కాలిన్ కాంప్బెల్, అతని సహచరుడు హావలా క్లు ఎట్టకేలకు అణచివేశారు. అయోధ్య నవాబు వజీద్ అలీషాల తొలగింపును నిరసిస్తూ జరిగిన తిరుగుబాటుకు ఆయన భార్య బేగం బజరత్, మౌల్వి అహ్మదుల్లాలు నాయకత్వం వహించారు. జనరల్ ఫ్రాంక్, కాంప్బెల్, బహదూర్ జంగ్ గూర్ఖా సైన్యం కలిసికట్టుగా నిర్వహించిన దాడిలో అయోధ్య బ్రిటిష్ ఏలుబడిలోకి వెళ్లిపోయింది. జాన్సీకి నేతృత్వం వహిస్తున్న లక్ష్మీబాయి ఉదంతం 1857 తిరుగుబా టులో ఓ స్ఫూర్తిదాయక ఘట్టం. తాంతియాతోపె సహకారంతో లక్ష్మీ బాయి జరిపిన పోరాటాన్ని హ్యూగ్స్ ఆధ్వర్యంలోని బ్రిటిష్ సేనలు ఎదుర్కొన్నాయి. హోరాహోరి పోరులో 1858 జూన్ 18న జరిగిన పోరాటంలో లక్ష్మీబాయి బ్రిటిష్ సైన్యం చేతిలో మృతిచెందింది. 1859 ఏప్రిల్ 19న తాంతియాతోపెను ఉరితీశారు.

కారణాలు..

తిరుగుబాటు జాతీయ రూపాన్ని సంతరించుకోకపోవడం, సంఘటి తంగా జరగకపోవడం, భారతీయ రాజులు-జమిందారులు, బ్రిటిష ర్లకు సహకరించడం వంటి కారణాల వల్ల 1857 తిరుగుబాటు విఫల మైంది. కానీ తిరుగుబాటు కొత్త శకానికి నాంది పలికిందని చెప్ప వచ్చు. కంపెనీ పాలన రద్దయి దాని స్థానంలో బ్రిటిష్ ప్రభుత్వ ప్రత్యక్ష పాలన ప్రారంభమయింది. గవర్నర్ జనరల్ స్థానంలో వైశ్రాయి వచ్చారు. బ్రిటన్లో ప్రభుత్వ కేబినెట్లోని మంత్రిని భారత ప్రభుత్వ రాజ్య కార్యదర్శిగా నియమించారు. 1861 ఇండియన్ కౌన్సిల్ చట్టంతో న్యాయ చట్టం, పోలీస్ చట్టం అమల్లోకి వచ్చాయి. సైనిక వ్యవస్థలోనూ గణనీయమైన మార్పులు వచ్చాయి. ఫిరంగి దశం పూర్తిగా బ్రిటిష్ ఆజమాయిషిలోకి పోయింది

Close