-->

భేతాళ కథలు - మదనరేఖ మహారాజును దర్శించుట - Stories of Bethala - Visiting Madanarekha Maharaja

Also Read



ఆయన మాటలకు చిత్రరేఖ సమ్మతింపలేదు."నీవు నన్ను పరిణయమాడనిచో మరణిస్తాను కాని, జీవించలేను" అని ఖచ్చితముగా విన్నవించింది."కూతురు ఎక్కడ మరణిస్తుందో" అన్న భయంతో తల్లి యగు మదనరేఖ ఆ దేశపు మహారాజునకు విన్న మించుకొని"నా కూతురుకు ప్రాణదానం చేయించు" డని వేడుకొన్నది.

చాలా వెంటనే మహారాజు-విద్యాసాగరుని తన వద్దకు పిలిపించాడు. ఆతని రూపురేఖా విలాసములకు మురిసిపోయాడు."విద్యాసాగరా! నీకు తెలియని ధర్మములు ఉండవనియే తలఁచుచున్నాను. నీకు రాత్రింబవళ్ళు సేవ చేసి నిన్ను రక్షించునది; నీకు మనసిచ్చినది. నీవు కాదన్నచో మరణించ గలదు. కావున ఆమెను భార్యగా స్వీకరించుము”
విద్యాసాగరుడు మహారాజును చూచి"మహారాజా! ఇది నా బ్రాహ్మణత్వమునకు భంగకరమైనది. ఆమెను మీరన్నట్లు స్వీకరించుటకు బ్రాహ్మణ కన్యక కాదుగదా?" అని తిరిగి మహారాజునే ప్రశ్నించాడు.

మహారాజు బాగా ఆలోచించాడు. "విద్యాసాగరా। మంచిది. నీవన్నట్లు బ్రాహ్మణ పుత్రికనే పెండ్లాడుము. తరువాతనే యీ కన్యకను స్వీకరింపుము.” అని చెప్పాడు.

మహారాజు తన పురోహితునకు చెప్పి, ఆయన పుత్రికను, తన పుత్రికను విద్యాసాగరునికిచ్చి వివాహం చేయించాడు. తరువాత, ఆ సమయంలో కోశాధికారియగు వైశ్యుడు సోమగుప్తుడు తన పుత్రికనుగూడ విద్యాసాగరునికి భార్యగా చేశాడు; తరువాత చిత్రరేఖను గూడ విద్యాసాగరుడు భార్యగా స్వీకరించాడు.

Close