-->

భేతాళ కథలు - విద్యా సాగరుని కథ - Stories of Bethala - Story of Vidya Sagar

Also Read



అందువలన నేనొకనాడు ఎవ్వరికీ చెప్పకుండా, విద్య నేర్వాలన్న పట్టుదలతో యిల్లు విడిచి బయలుదేరాను, ఎంతమందినో ఆశ్రయించాను. కానీ, నా కోరిక తీరలేదు. అయిననూ నా పట్టువిడవక బయలుదేరాను. ఒక అడవిలో నొక బ్రహ్మరాక్షసి వలన సకల విద్యలు నేర్చుకొన్నాను. నాకు విద్యలు నేర్పిన ఆబ్రహ్మరాక్షసి శాపవశమున బ్రహరాక్షసి. కానీ, నిజముగా ఆయనొక గంధర్వుడు. శాపముదీరి ఆయన నన్ను దీవించి తనలోకమునకు వెళ్ళిపోయినాడు. నేను ఆయన సెలవుపొంది యింటికి బయలు దేరినాను. మధ్యమార్గమున నిద్రలేమివలన, ఆహార లోపమువలన అలసటతో మీ యింటి అరుగుపై పరున్నాను" అని తెలియ జేసినాడు.

ఆతని వాక్యములకు ఆ తల్లీ కూతుండ్రు మిక్కిలి ఆనందించినారు. చిత్రరేఖ ఆతనికి తన కోరిక వెల్లడిస్తూ"తనను ప్రేమించమని, పెండ్లాడుమని" ప్రార్ధించినది. తల్లి కూడా తన ఆమోదము తెలిపినది.

అందులకు ఆ బ్రాహ్మణ యువకుడు"చిత్రరేఖా ! నేను బ్రాహ్మణ వంశమున జన్మించినవాడను. నీవు వేశ్యాకులమున జన్మించినదానవు. పర పురుష సంపర్క మెరుంగని కన్యకవే అయినా, నా మనస్సు అంగీకరించుట లేదు. బ్రాహ్మణ కన్యకవే అయితే ఆనందంతో స్వీకరించేవాడను. ఇక నీవు నాకు ఎంతయో పరిచర్యగావించి నాకు ఆనందం కలిగించావు. ఇందుకు నేను నీ కెంతయో ఋణపడియున్నాను. ఇందుకు ప్రత్యుపకారం"పెండ్లి మాట" తప్పించి కోరుకొనుము. తప్పక తీర్చి ఋణవిముక్తుడనగుతాను" అని సమాధానము చెప్పాడు.

Credit to (భేతాళుడు విక్రమార్కునికి చెప్పిన కథలు) బూరెల సత్యనారాయణమూర్తి

Close