-->

మీరు కొన్న షేర్లకి లిక్విడిటీ ముఖ్యం - Liquidity is important for the shares you buy - Stock Market

Also Read



‘లిక్విడిటీ’ అంటే ఆయా షేర్లలో తరచూ అమ్మకాలు, కొనుగోలుకు అవకాశం వుండటం మీరు కొన్న షేరికి ఎన్ని ఫండమెంటల్స్ అయినా వుండి వుండవచ్చు. కాని అన్నింటికంటే ఆ షేర్ ఎప్పుడు అమ్మకానికి పెడితే అప్పుడు తేలికగా అమ్ముడుపోవాలి. అంటే ఆ షేర్కి హెచ్చుస్థాయిలో లావాదేవీలు జరగాలి. ఈ 'లిక్విడిటీ'ని ఎలా తెలుసుకోవాలనుకుంటున్నారా? రోజూ పేపర్లలో షేర్ కొటేషన్ (ధర) ప్రక్కనే 18,50 అని సంఖ్య వేస్తారు. అదే రిలయన్స్ షేర్ చూపినట్లయితే దాని ప్రక్కన లక్షల్లో అలాంటి సంఖ్య కన్పిస్తుంది. ఆ సంఖ్య (ధర సంఖ్య కాదు సుమా) ఎంత ఎక్కువ వుంటే ఆ షేర్కి అంత 'లిక్విడిటీ' వుంటుందన్నమాట. అంటే ఆ షేర్లో అంత స్థాయిలో అమ్మకాలు, కొనుగోలు జరిగాయన్నమాట. కాబట్టి మీ షేరుకి అలా హెచ్చు స్థాయిలో లావాదేవీలు వుంటే దానిని మీరు నిర్భయంగా అమ్మవచ్చు, కొనవచ్చు. లిక్విడిటీ లేని షేర్లు మన దగ్గర వున్నా, లేకపోయినా ఒకటే కదా!

ఇక్కడ లిక్విడిటీ అంటే ఎంత స్థాయి అని మీకు సందేహం రావచ్చు. సాధారణంగా ఒక షేర్కి లక్ష లావాదేవీలు జరుగుతుంటే దానికి ఓ మాదిరి లిక్విడిటీ వున్నట్లే సుమా! అలాగే ఒక షేర్కి ఐదు లక్షల లావాదేవీలు వుంటే అది నిశ్చయంగా చక్కటి లిక్విడిటీ వున్నట్లే భావించాలి. ఒకోసారి ఈ లావాదేవీల సంఖ్య మార్కెట్ బూమ్, క్రాష్న బట్టి మారిపోవచ్చు. అలాంటపుడు బూమ్లో కనీసం ఐదు లక్షల లావాదేవీలు. క్రాష్ లో కనీసం లక్ష లావాదేవీలు వున్న షేరుకి అన్ని విధాల లిక్విడిటీ వుంటుంది. 
మరొక ముఖ్య విషయం కూడా ఇక్కడ గమనించాలి. మీరు కొన్న షేర్ బాంబేస్టాక్ ఎక్సేంజ్ (బిఎస్ఇ) మరియు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఇ) రెండింట్లోనూ లిస్ట్ అయి వుంటే షేర్ల లావాదేవీలు హెచ్చు సంఖ్యలో జరిగే ఉంది.

కాబట్టి మీరు షేర్లు కొనాలనుకున్నప్పుడు ఆయా షేర్ లావాదేవీల సంఖ్యని తప్పక పరిశీలనలోకి తీసుకోండి.

Close