-->

భారత రాజ్యాంగ పరిణామ క్రమం - Evolution of the Constitution of India

Also Read



పోటీ పరీక్షలలో భారత రాజకీయ వ్యవస్థ నుంచి ప్రశ్నలు తప్పనిసరిగా అడుగుతున్నారు. ఈ విభాగంపై అభ్యర్థులు సరైన అవగాహన పెంచుకుంటే ఎక్కువ మార్కులు స్కోర్ చేసే వీలుంది. ఈ వారం ప్రస్తుత రాజకీయ వ్యవస్థ, బ్రిటీష్ పాలన ప్రభావం, భారత రాజ్యాంగ రూపకల్పనకు దారి తీసిన పరిస్థితులను అధ్యయనం చేద్దాం.

భారతదేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలను బ్రిటిష్ పాలన విస్తృతంగా ప్రభావితం చేసింది. 17, 18 శతాబ్దాలలో ఈస్టిండియా కంపెనీ దక్షిణాసియాలో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాది వేసింది. 1858 భారత ప్రభుత్వ చట్టం బ్రిటిష్ రాజమకుటానికి భారత ఉపఖండం మీద సార్వభౌమాధికారాన్ని కల్పించింది. కాలానుగు ణంగా కొంత సడలింపు జరిగినప్పటికీ, కేంద్రీకృత పాలనకు ఈ చట్టం నాందిపలికింది.

గవర్నర్ జనరల్-గవర్నర్:

రాజమకుట అధికారాలను భారతదేశ వ్యవహారాల కార్యదర్శి (మంత్రి), 15 మంది సభ్యులతో కూడిన ఇండియా కౌన్సిల్ సలహా మేరకు చేపట్టారు. ఈ కార్యదర్శి తరపున దేశంలో కేంద్రస్థాయిలో గవర్నర్ జనరల్, ప్రాంతీయస్థాయిలో గవర్నరు పాలనా బాధ్యతలు నిర్వహించారు. వీరికి సహాయంగా అధికారులతో కూడిన కార్యనిర్వా హక కౌన్సిల్ ఏర్పాటైంది. ఉన్నత స్థాయి అధికారులంతా ఐరోపావాళ్లే. అప్పట్లో పౌర, రక్షణ, శాసన, కార్యనిర్వాహక విధుల విషయంలో స్పష్టమైన తేడా లేదు. గవర్నర్ జనరల్, తన కార్యనిర్వాహక కౌన్సిల్ సహాయంతో పై విధులన్నింటినీ నిర్వహించేవారు. రాష్ట్ర ప్రభుత్వాలు నామమాత్రమే. భారతదేశ వ్యవహారాల కార్యదర్శి బ్రిటీష్ పార్లమెం టుకు మాత్రమే బాధ్యత వహిస్తారు. భారత ప్రజలకు జవాబుదారి కాదు. పూర్తిగా ఉద్యోగిస్వామ్యం పాలన సాగింది.

1861 భారతీయ కౌన్సిళ్ళ చట్టం:

1861 భారతీయ కౌన్సిళ్ళ చట్టం అనధికార సభ్యులకు (అంటే భారతీయులకు) గవర్నర్ జనరల్ కౌన్సిల్లో ప్రవేశం కల్పించింది. నామినేట్ అయిన భారతీయ సభ్యులకు పరిమితమైన శాసన సంబంధ అధికారాలు ఉండేవి. రాష్ట్రాలలో కూడా అదే మార్పు జరిగింది.

1892 కౌన్సిళ్ళ చట్టం:

1892 కౌన్సిళ్ళ చట్టం, భారత శాసన మండలికి బెంగాల్ వాణిజ్య మండలి, రాష్ట్ర శాసన మండళ్లకు భారతీయులను (అనధికార సభ్యులు) నామినేట్ చేయటానికి అవకాశం కల్పించింది. అలాగే రాష్ట్ర శాసన మండళ్లకు స్థానిక సంస్థలు, విశ్వవిద్యాలయాలు, జిల్లా బోర్డులు భారతీయులను (అనధికార సభ్యులు) నామినేట్ చేస్తాయి. కౌన్సిళ్ళకు బడ్జెట్ను చర్చించే అధికారం కల్పించారు.

1909 భారతీయ కౌన్సిళ్ళ చట్టం:

1909 భారతీయ కౌన్సిళ్ళ చట్టం (మార్లే-మింటో సంస్కరణలు) మొదటిసారిగా శాసనమండళ్లకు ప్రాతినిధ్య స్వభావాన్ని కల్గించింది. రాష్ట్రస్థాయిలో కౌన్సిళ్ళ సభ్యుల సంఖ్యను పెంచడంతోపాటు అనధి కార సభ్యులకు మెజారిటీ కల్పించారు. అనధికార సభ్యులలో కొంద దీని స్థానిక సంస్థలు, ప్రభావ వర్గాలు ఎన్నుకుంటాయి. మొదటి సారిగా ఎన్నిక విధానాన్ని ప్రవేశపెట్టారు. అయితే అల్పసంఖ్యాక వర్గాలకు కొన్ని స్థానాలు రిజర్వు చేయడం ద్వారా మత ప్రాతిపదికన ప్రాతినిధ్యానికి అంకురార్పణ జరిగింది. ఇది భవిష్యత్ లో జరిగిన మతపరంగా భారత ఉపఖండ విభజనకు దారితీసిందని విశ్లేషకుల అభిప్రాయం.

1919 భారత ప్రభుత్వ చట్టం:

మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో భారతీయులు బ్రిటిష్ ప్రభుత్వానికి అందించిన సహకారానికి కృతజ్ఞతగా మరిన్ని అభ్యుదయ అంశాలతో కూడిన 1919 భారత ప్రభుత్వ చట్టాన్ని బ్రిటిష్ పార్లమెంటు ఆమోదిం చింది. ఈ చట్టం మొదటిసారిగా, రాష్ట్రస్థాయిలో పార్లమెంటరీ ప్రజా స్వామ్య ప్రభుత్వఏర్పాటుకు పాక్షికంగా అనుమతించింది. ఈ చట్టం ప్రకారం : ఎ) రాష్ట్రాలలో ద్వంద్వ ప్రభుత్వ ఏర్పాటు - రాష్ట్ర గవర్నరు కొన్ని శాఖలను శాసనమండలి సభ్యులైన మంత్రుల ద్వారా (ట్రాన్స్ ఫర్డ్ శాఖలు) నిర్వహిస్తే, మరికొన్ని శాఖలను కార్యనిర్వాహక సభ్యుల ద్వారా (రిజర్వ్ శాఖలు) నిర్వహిస్తారు. బి) కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన సి) 70 శాతం రాష్ట్ర శాసన మండలి సభ్యులను ఓటర్లద్వారా ప్రత్యక్షంగా ఎన్నుకోవాలి. డి) రాష్ట్రాల మీద కేంద్ర నియంత్రణ సడలింపు ఇ) కేంద్రంలో ద్వంద్వ శాసన సభ ఏర్పాటు. ఎగువ, దిగువ సభలలో ఎన్నికైన సభ్యుల మెజారిటీ. అయితే మత ప్రాతిపదికన కొన్ని స్థానాలు రిజర్వు చేశారు. గవర్నర్ జనరలు కేంద్ర శాసన సభను నియంత్రించి, అవి ఆమోదించిన బిల్లులను తిరస్కరించే అధికారం కల్పించింది.
1919 భారత ప్రభుత్వ చట్టం, భారత ప్రజల ఆకాంక్షలకు అను గుణంగా లేదు. పైగా అశాస్త్రీయమైన ద్వంద్వ ప్రభుత్వం, రాష్ట్రస్థాయి లో లేనిపోని సమస్యలు తెచ్చింది. ఈ చట్ట పనితీరును సమీక్షించటానికి ఏర్పాటైన సైమన్ కమిషన్ (1927-30) దీనిని రద్దు చేయాలని సిఫారసు చేసింది. 1930, 1931, 1932లలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాలు సైమన్ కమిషన్ నివేదికను చర్చించాయి. ఈ సమావేశా లకు బ్రిటిష్, భారత రాజకీయ నాయకులు హాజరయ్యారు.

1935 భారత ప్రభుత్వ చట్టం:

1935 భారత ప్రభుత్వ చట్టం ఆధునిక భారత రాజకీయ చరిత్రలో ఒక ప్రధాన ఘట్టం. దీని ముఖ్యాంశాలు.. ఎ) బ్రిటిష్ పాలిత రాష్ట్రాలు, స్వదేశ సంస్థానాలతో కలిసి అఖిలభారత సమాఖ్య ఏర్పాటు బి) ఫెడరల్ (కేంద్రం) స్థాయిలో ద్వంద్వ ప్రభుత్వ ఏర్పాటు. ఈ రెండు అంశాలు అమలులోకి రాలేదు. సి) రాష్ట్రాలలో ద్వంద్వ పాలన స్థానంలో పూర్తి బాధ్యతాయుత ప్రభుత్వం. డి) కేంద్ర, రాష్ట్రాల మధ్య స్పష్టమైన అధికార విభజనకు ఫెడరల్, ఉమ్మడి రాష్ట్ర జాబితాల ఏర్పాటు. (ఇ) ఆరు బ్రిటిష్ పాలితా రాష్ట్రాల్లో ద్వంద్వ శాసనసభ ఏర్పాటు (ఎఫ్) ఇండియా కౌన్సిల్ రద్దు (జి) కేంద్ర, రాష్ట్ర శాసనసభలకు మరిన్ని అధికారాలు(హెచ్) ఫెడరల్ కోర్టు ఏర్పాటు (ఐ) ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల ఏర్పాటు.
సైమన్ కమిషన్ సిఫార్సుల మేరకు భారతదేశానికి డొమినియన్ ప్రతిపత్తి ఈ చట్టం కింద కల్పించలేదు. అయితే ఈ చట్టంలో అనేక అంశాలు భారత రాజ్యాంగంలో చోటుచేసుకొన్నాయి. ఉదా: బలమైన కేంద్రప్రభుత్వం (అర్ధ సమాఖ్య) పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ, మూడురకాలైన జాబితాల ద్వారా కేంద్ర - రాష్ట్రాల మధ్య అధికార విభజన మొదలైనవి. రెండు సంవత్సరాల తర్వాత 1935 భారత ప్రభుత్వచట్టం అమల్లోకి వచ్చింది.

రెండవ ప్రపంచయుద్ధం:

1999లో రెండవ ప్రపంచయుద్ధం ప్రారంభమైంది. భారతదేశ ప్రజ లను సంప్రదించకుండా ఇండియాను జర్మనీకి శత్రుదేశంగా ప్రకటిం చడం పట్ల నిరసనగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు (రాష్ట్రస్థాయిలో) రాజీనామా చేశాయి.
గాంధీజీ 1942లో 'క్విట్ ఇండియా' ఉద్యమాన్ని ప్రారంభించి ఆంగ్లేయులను భారతదేశం నుంచి నిష్క్రమించమని కోరారు. యుద్ధ సమయంలో భారతదేశ ప్రజల సహకారాన్ని పొందడానికి బ్రిటిష్ ప్రభుత్వం క్రిప్స్ రాయబారం, వీవెల్ పథకం ప్రతిపాదనలు చేసింది. రెండవ ప్రపంచయుద్ధం బ్రిటన్, దాని మిత్రదేశాలకు అనుకూలంగా ముగిసింది.
1945లో బ్రిటన్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రధాని అట్లీ భారతదేశానికి స్వాతంత్య్రమి వ్వడానికి సూత్రప్రాయంగా అంగీకరించారు. అధికార బదిలీకి సంబం ధించిన అంశాలను చర్చించడానికి పెధిక్ లారెన్స్, స్టాఫర్ క్రిప్స్, ఎ.వి.అలెగ్జాండర్ ముగ్గురు కేబినెట్ మంత్రులు 1946లో భారతదేశాన్ని సందర్శించారు.

Close