-->

కేంద్ర మంత్రి మండలి - Union Council of Ministers (భారత కేంద్ర మంత్రిమండలి)

Also Read


భారతదేశ పరిపాలనలో అత్యంత కీలకపాత్రను పోషించే కేంద్ర మంత్రిమండలి వాస్తవిక పాలనాధికారాలను నిర్వహిస్తుంది. రాష్ట్రపతి దేశాధిపతిగా వ్యవహరిస్తారు. ప్రధానమంత్రి... ప్రభుత్వాధిపతిగా పార్లమెంటరీ ప్రభుత్వాన్ని నడిపిస్తారు. దేశపరిపాలనా సమన్వయ కర్తగా కేంద్ర స్థాయిలో, రాష్ట్రాలతో వ్యవహరించడంలో ప్రధానమంత్రి పాత్ర అద్వితీయమైంది. భారతదేశ పరిపాలన మొత్తం రాష్ట్రపతి పేరు మీద నిర్వహిస్తున్నప్పటికీ వాస్తవంలో పరిపాలన నిర్వహించేది మాత్రం ప్రధానమంత్రి అధ్యక్షతన ఉండే కేంద్ర మంత్రిమండలి. లోక్సభలో మెజారిటీ సాధించిన రాజకీయ పక్షానికి చెందిన నాయకు డిని ప్రధానమంత్రిగా రాష్ట్రపతి నియమిస్తారు. ఇందిరాగాంధీ ప్రధా నిగా రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయీకరణ వంటి చారిత్రా త్మక నిర్ణయాలు తీసుకొన్నారు. దేశానికి రెండుసార్లు తాత్కాలిక ప్రధానమంత్రిగా పనిచేసిన ఘనత గుల్జారీలాల్ నందాకే దక్కు తుంది. చిన్న వయసులో ప్రధానమంత్రి పదవిని చేపట్టిన ఘనత రాజీవ్ గాంధీది. తొలి తెలుగు ప్రధానిగా, దక్షిణ భారతదేశం నుంచి మొదటి ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన పి.వి. నరసింహా రావు. మొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ కాగా, పూర్తికాలం పదవిలో కొనసాగిన కాంగ్రేసేతర ప్రధాని అటల్ బీహారీ వాజ్పేయి. మొదటిసారిగా సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహిం చిన కాంగ్రెస్ ప్రధాని మన్మోహన్ సింగ్. 
  • 74(1) అధికరణను అనుసరించి ప్రధానమంత్రి అధ్యక్షతన ఒక మంత్రిమండలి ఉంటుంది. రాష్ట్రపతికి దేశ పరిపాలనలో సల హాలు, సహాయాన్ని అందిస్తుంది. మంత్రిమండలి రాష్ట్రపతికి ఇచ్చిన సలహాలను న్యాయస్థానంలో సవాలు చేయరాదు.
  • 75(1) ప్రకరణ ప్రకారం ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమి స్తారు. అతని సలహా మేరకు ఇతర మంత్రులను నియమిస్తారు.
  • 75(2) అధికరణ ప్రకారం రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంతవరకే మంత్రిమండలి అధికారంలో కొనసాగుతుంది.
  • 75(3) ప్రధానమంత్రి నాయకత్వంలోని మంత్రిమండలి లోక్ సభకు సమష్టి బాధ్యత వహిస్తుంది. కేంద్ర మంత్రులుగా పనిచేసే వారందరూ తప్పనిసరిగా పార్లమెంటు సభ్యులై ఉండాలి.
  • 75(5) ప్రకారం సభ్యుడు కానట్లయితే ఆరు నెలల్లో ఏదో ఒక సభకు ఎన్నిక కావాలి.
  • 78(1) అధికరణ ప్రకారం కేంద్ర మంత్రిమండలి తన నిర్ణయా లను రాష్ట్రపతికి తెలియజేయాల్సి ఉంటుంది.
  • 78(2) ప్రకరణ ప్రకారం రాష్ట్రపతి స్వయంగా సమాచారాన్ని తెలు సుకోవచ్చు. ఒక మంత్రిత్వశాఖకు సంబంధించిన మంత్రి ఏదైనా ఒక అంశంపై ప్రకటన చేసినప్పుడు అది ప్రభుత్వ నిర్ణయమా? కాదా? అనే అంశంపై రాష్ట్రపతి వివరణ కోరవచ్చు.
  • కేంద్ర మంత్రిమండలి సమావేశాలకు ప్రధాని అధ్యక్షత వహి స్తారు. మంత్రిమండలిలో కేబినెట్, రాష్ట్రమంత్రులు, డిప్యూటీ మంత్రులుగా వర్గీకృతమైన మంత్రిమండలికి ప్రధాని అధిపతిగా వ్యవహరిస్తారు. ప్రధానమంత్రి సలహాను అనుసరించి రాష్ట్రపతి మంత్రుల నియామకం, శాఖల కేటాయింపు, తొలగించడం చేస్తారు.
  • ప్రధాని లోక్సభకు నాయకుడిగా వ్యవహరిస్తారు. ప్రధాని సలహా ను అనుసరించి రాష్ట్రపతి లోక్సభను రద్దుచేస్తారు. లోక్సభలో ఏదైనా బిల్లుపై చర్చ జరిగేటప్పుడు ప్రధాని సభా నాయకుడిగా సమాధానం చెప్పి, మిగిలిన మంత్రులతో సమాధానం చెప్పిం చాలి.
  • కేంద్ర మంత్రిమండలి నిర్ణయాలను రాష్ట్రపతికి, రాష్ట్రపతి అభిప్రాయాలను మంత్రిమండలికి తెలపడం ద్వారా వీరి మధ్య ప్రధాని వారధిగా పనిచేస్తారు. విదేశాలతో వ్యవహరించేటప్పుడు ప్రధాని దేశ నాయకుడిగా వ్యవహరిస్తారు.
  • ప్రధానమంత్రి పదవిరీత్యా ప్రణాళికా సంఘానికి, జాతీయాభి వృద్ధి మండలికి, జాతీయ సమైక్యత మండలికి, జాతీయ భద్రత మండలికి, అంతఃరాష్ట్ర కౌన్సిలు, జాతీయ జనాభా నియంత్రణా మండలికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు.
  • వివిధ రాజ్యాంగ సంస్థల అధిపతులను నియమించే సందర్భంలో ప్రధాని సలహాను అనుసరించి రాష్ట్రపతి నియామకాలు చేస్తారు. NHRC చైర్మన్, సభ్యులను నియమించే కమిటీకి నేతృత్వం వహిస్తారు.
  • అంతర్జాతీయంగా అలీన దేశాల కూటమి వంటి సంస్థలకు నాయకత్వం వహించడం విదేశాంగ విధాన నిర్ణయీకరణలో కీలక పాత్ర పోషిస్తారు.

కేంద్ర మంత్రిమండలి

భారతదేశంలో కేంద్ర మంత్రిమండలి పరిపాలనా నిర్వహణలో కీలకపాత్రను పోషిస్తుంది. 75(1) అధికరణ ప్రకారం ప్రధాని సలహాను అనుసరించి రాష్ట్రపతి మంత్రి మండలిని నియమించగా 77(2) అధికరణ ప్రకారం మంత్రులకు పదవీ బాధ్యతలను అంటే శాఖలను కేటాయించేది కూడా రాష్ట్రపతే. 1949లో గోపాలస్వామి అయ్యంగార్ కమిటీ సూచనలను అనుసరించి మంత్రిమండలిని మూడు స్థాయిల్లో అంటే కేబినెట్, స్టేట్, డిప్యూటీ మంత్రులుగా వర్గీకరణ చేశారు. డిప్యూటీ ప్రధానమంత్రి గురించి రాజ్యాంగంలో ఎలాంటి ప్రస్తావన లేదు.

మంత్రిమండలి అధికారాలు, విధులు

  • పార్లమెంటు చేసే శాసనాలకు రూపకల్పన చేయడం, పార్లమెంటు ఆమోదించిన శాసనాలను అమలు చేయాల్సిన బాధ్యత మంత్రి మండలిపై ఉంటుంది.
  • విదేశాల నుంచి దేశ రక్షణ, ఆంతరంగికంగా శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమైన చర్యలను చేపట్టడం అంటే రాష్ట్రాలకు తోడ్పాటును ఇవ్వడం. విదేశీ వ్యవహారాలను నిర్వహించడం కేంద్ర మంత్రిమండలి బాధ్యత.
  • దేశ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఆదాయ, వ్యయాల పట్టిక అయిన బడ్జెట్ రూపకల్పన, ఆర్థిక వనరులను సమకూర్చు కోవాల్సిన బాధ్యత మంత్రిమండలిపై ఉంది.
  • కేంద్ర మంత్రిమండలి లోక్సభకు సమష్టి బాధ్యత వహిస్తుంది. మంత్రిమండలిలోని ఏ సభ్యుడు ప్రవేశపెట్టిన బిల్లు వీగిపోయినా మంత్రిమండలి మొత్తం రాజీనామా చేయాలి. ప్రధాని రాజీనామా చేసినా మంత్రిమండలి రద్దు అవుతుంది.

Close