-->

భారతదేశం - ఇంధన వనరులు - What is India's main source of energy?

Also Read


భారతదేశంలో బొగ్గు నిల్వలు సుమారు 220 బిలియన్ టన్నులు ఉన్నాయి. ఇందులో కోకింగ్ రకం తక్కువగా ఉండటం వల్ల ఆస్ట్రే లియా, చైనాల నుంచి దిగమతి చేసుకుంటున్నాం. నదీ పరివాహక ప్రాంతాల్లో సహజ వాయువు అపారంగా లభిస్తోంది. సహజ వాయువు రంగంలో స్వయం సమృద్ధి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇంధనాలు ప్రధానంగా రెండు రకాలు అవి: 1) శిలాజ ఇంధ నాలు 2) అణు ఇంధనాలు. బొగ్గు, చమురు, సహజ వాయువు శిలాజ ఇంధనాల తరగతికి చెందుతాయి. యురేనియం, థోరియం, ప్లూటోని యం, రేడియం మొదలైనవి అణు ఇంధనాలు. భారతదేశంలో బొగ్గు నిల్వలు సమారుగా 220 బిలియన్ టన్నులు. ఇందులో 200 బిలియన్ టన్నులు బిట్యూమినస్, 20 బిలియన్ టన్నులు లిగ్నైట్ రకానికి చెంది నవి. ఆంధ్రసైట్, పీట్ తరగతికి చెందిన బొగ్గు నిల్వలకు భారత దేశంలో అంతగా ప్రాధాన్యం లేదు.

నాన్ కింగ్ బొగ్గు:

యుగంలో భారతదేశం బొగ్గు నిల్వలు ప్రధానంగా గోండ్వానా యుగానికి చెందినవి. ఇవి సుమారు 200 మిలియన్ సంవత్సరాల క్రితం నదీ హరివాణాలలో ఏర్పడ్డాయి. ఈశాన్య భారతదేశంలోని బొగ్గు క్షేత్రాలు మాత్రం టెరిషరీ (60 మిలియన్ సంవత్సరాల క్రితం) భౌమ్య ఏర్పడ్డాయి. భారతదేశపు బొగ్గు నిల్వలు ప్రధానంగా నాన్ కోకింగ్ రకానికి చెందినవి. కోకింగ్ రకానికి చెందిన నాణ్యమైన బొగ్గును ఉక్కు కర్మాగారాలలోని బ్లాస్ట్ ఫర్నేస్లలో వాడతారు. ఈ కోకింగ్ బొగ్గు నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయి. మన ఉక్కు కర్మా గారాలకు కావలసిన కోకింగ్ బొగ్గును మనదేశం ఆస్ట్రేలియా, చైనా దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది.

రాణిగంజ్ అతిపెద్ద క్షేత్రం:

భారతదేశంలో బొగ్గు క్షేత్రాలు దామోదర్, మహానది, సోన్, గోదా వరి, వార్ధా నదీ హరివాణాలలో కేంద్రీకృతమై ఉన్నాయి. మొత్తం భార తదేశం బొగ్గు ఉత్పత్తిలో 60 శాతం దామోదర్ నదీలోయ బొగ్గు క్షేత్రాల నుంచి వస్తోంది. దామోదర్ లోయ జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో విస్తరించి ఉంది. ఝరియా, రాణిగంజ్, గిర్ధి, బొకారో, పాతకేరా ఈ ప్రాంతంలోని అతి పెద్ద బొగ్గు క్షేత్రాలు. పశ్చిమ బెంగాల్ లో రాణిగంజ్ దేశంలోని ఏకైక అతి పెద్ద బొగ్గు క్షేత్రం. ఝరియా, రాణిగంజ్ లలో నాణ్యమైన కోకింగ్ బొగ్గు లభిస్తుంది.
మహానది-సోన్ నదీ హరివాణాలు మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో విస్తరించి ఉంది. కోర్బా, సిండ్రోలి, టాల్చేర్, ఇ లోయ, బిలాపూర్ ముఖ్యమైన బొగ్గు క్షేత్రాలు. ఒరిస్సాలోని టాల్చే లో దేశంలోకెల్లా అతి పెద్ద ఓపెన్ కాస్ట్ గని ఉంది. గోదావరి-వార్ధాలోయ ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలలో విస్తరించి ఉంది. మహారాష్ట్రలోని కాంత్, చాందా, బలార్షా బొగ్గు క్షేత్రాలు, ఆంధ్రప్రదేశ్ లోని సింగరేణి బొగ్గు క్షేత్రం ఈ లోయలో విస్తరించి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని సింగరేణి బొగ్గు క్షేత్రం ఖమ్మం, ఆదిలా బాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలలో విస్తరించి ఉంది. ఖమ్మం జిల్లా లోని కొత్తగూడెం, ఇల్లందు(సింగరేణి), మణుగూరు, సత్తుపల్లి వరం గల్ లోని భూపాలపల్లి, ఆదిలాబాద్ లోని మందమర్రి, బెల్లంపల్లి, శ్రీరాంపూర్, గోలేటి, కరీంనగర్ లోని గోదావరిఖని ముఖ్యమైన గని కేంద్రాలు. రాష్ట్రంలోని బొగ్గు గనులను నిర్వహిస్తున్న సింగరేణి కాల రీస్ కంపెనీ లిమిటెడ్ (CCL) అతి పెద్ద రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ. దేశంలోని మిగిలిన బొగ్గు గనులను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన కోల్ ఇండియా లిమిటెడ్ (CIL) నిర్వహిస్తోంది.

ఈశాన్యంలో బొగ్గు నిల్వలు:

ఈశాన్య భారతదేశంలో అస్సాం, అరుణాచల్, నాగాలాండ్ లో బొగ్గు నిల్వలు ఉన్నాయి. అస్సాంలోని మాకుమ్, నాగాలాండ్ లోని నజీరా లోయ ప్రధాన బొగ్గు క్షేత్రాలు. ఈశాన్య భారతదేశపు బొగ్గు నిల్వలు టెరిషరీ యుగానికి చెందినవి. వీటి బొగ్గులో గంధకం శాతం ఎక్కువ. అందువల్ల ఈ బొగ్గు పారిశ్రామిక విలువ తక్కువ.
లిగ్నైటు బొగ్గు నిల్వలు తమిళనాడు, రాజస్థాన్, డార్జిలింగ్ లో ఉన్నాయి. తమిళనాడులోని నైవేలీలో ప్రస్తుతం లిగ్నైటు బొగ్గు గనులు న్నాయి. రాజస్థాన్ లోని 'పలనా' లో కూడా విస్తారంగా నిల్వలున్న ప్పటికీ ఇంకా వెలికితీత ప్రారంభం కాలేదు. లిగ్నైటు బొగ్గు మృదువై నది. దీనిని కేవలం విద్యుత్ ఉత్పత్తికి మాత్రమే ఉపయోగిస్తారు. పీట్ బొగ్గు అపరిపక్వమైనది. ఇందులో సేంద్రీయ పదార్ధం చాలా ఎక్కు వగా ఉంటుంది. దీని కెలొరి విలువ చాలా తక్కువ. 'పీట్' తరగతికి చెందిన బొగ్గు నిల్వలు కేరళలోని కొచ్చిన్, అల్లెప్పీలలో విస్తరించి ఉన్నాయి. పీట్ బొగ్గును ప్రస్తుతం వెలికి తీయడం లేదు. ఇన్ సిటుగా సిఫికేషన్ పద్ధతిలో ఈ బొగ్గును వినియోగించటానికి పథకాలు సిద్ధం చేశారు. ఝరియా, రాణిగంజ్ బొగ్గు గనులలో భూగర్భ మంటలు విస్తరిస్తుండడంతో మేలి రకమైన కోకింగ్ బొగ్గు బూడిద పాలవు తుంది. ఈ భూగర్భ మంటలను అదుపులోకి తీసుకురావటానికి రష్యా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. ఈ మంటలు పగుళ్ల ద్వారా ఉపరితలానికి విస్తరించే ప్రమాదం ఉండటంతో భవిష్య త్తులో ఝరియా పట్టణాన్ని ఖాళీ చేయాల్సి రావచ్చు.

అవక్షేప శిలల్లో చమురు:

చమురు-సహజవాయువు నిల్వలు (బొగ్గులాగానే) అవక్షేప శిల లలో మాత్రమే లభిస్తాయి. ఖండ భాగాల్నే కాకుండా సముద్ర భూత లం పైన ఖండతీరపు అంచులో కూడా చమురు సహజవాయువు నిల్వలు లభిస్తాయి. మహారాష్ట్ర తీరంలోని ముంబై హై, బేసిన్ క్షేత్రాలు భారతదేశంలో చమురు, సహజవాయువును ఉత్పత్తి చేసే ముఖ్య ప్రాంతాలు. గుజరాత్ తీరంలోని కంభత్ సింధుశాఖలో గాంధార్, వాస్నా, లూనెజ్ ముఖ్య క్షేత్రాలు. గుజరాత్ ఖండాంతర్భా గంలో మెహసానా, కాలోల్, అంకలేశ్వర్, హజీరా ఇతర చమురుసహజవాయువు క్షేత్రాలు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన కృష్ణా-గోదావరి బేసిన్లో నారిమన్నం ప్రధాన చమురు క్షేత్రం.

ఇ అసోంలో తొలి చమురు క్షేత్రం:

అసోంలోని దిగ్బాయ్ లో దేశంలో మొట్టమొదటగా చమురును కనుగొన్నారు. మొట్టమొదటగా చమురు ఉత్పత్తి, చమురు శుద్ధి కూడా దిగ్బాయ్ లోనే ప్రారంభించారు. అసోంలోని దిగ్బాయ్, రుద్రసాగర్, నహర్ కతియా ప్రధాన చమురు-సహజవాయువు క్షేత్రాలు. ఇటీవలే రాజస్థాన్ లోని జైసల్నేద్ బేసిన్లో చమురు నిల్వలను కనుగొన్నారు. గంగ-సింధు మైదానం, నర్మదా లోయ, అండమాన్-నికోబార్లలో ఉన్న అవక్షేప శిలా ప్రాంతాలలో కూడా చమురు-సహజవాయువు నిల్వలు ఉండవచ్చని శాస్త్రజ్ఞులు విశ్వసిస్తున్నారు. ఈ ప్రాంతాలలో అన్వేషణలు ఇంకా ప్రారంభం కాలేదు. చమురు-సహజ వాయువు నిల్వల అన్వేషణలను వేగిర పరచడానికి ఈ రంగంలో ప్రైవేటు, విదేశీ పెట్టుబడులను ప్రభుత్వం వ్యూహాత్మకంగా అనుమతించింది.

జాడుగుడాలో యురేనియం:

ఇప్పటివరకు నిర్ధారణ అయిన మొత్తం చమురు నిల్వలు 900 మిలియన్ టన్నులు మాత్రమే. ప్రస్తుత దేశీయ వార్షిక చమురు ఉత్పత్తి సుమారు 35 మిలియన్ టన్నులు అంటే ప్రస్తుత వార్షిక ఉత్పత్తి రేటు లో దేశీయ చమురు నిల్వలు రాబోయే 25 సంవత్సరాలలో అడు గంటి పోతాయన్నమాట. చమురు-సహజవాయువు అవసరాలపై మనదేశం ప్రధానంగా దిగుమతుల వాటా 80 శాతానికి పైగానే ఉంది. ముఖ్యంగా పర్షియా సింధుశాఖ నుంచి మనం చమురును దిగుమతి చేసుకుంటున్నాం. దీని కోసం పెద్ద మొత్తాలలో విదేశీ మారక ద్రవ్యాన్ని వినియోగించాల్సి వస్తోంది. ఈ అంశం మనదేశ శక్తి భద్ర తకు పెద్ద అవరోధం. మనదేశంలో యురేనియం నిల్వలు జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్, మేఘాలయాలలో విస్తరించి ఉన్నాయి. జార్ఖండ్ లోని 'జాడుగుడా' ముఖ్యమైన యురేనియం గనుల కేంద్రం. మేఘాలయా లోని 'డొమియోస్టాట్'లో కూడా యురేనియాన్ని వెలికి తీశారు. ఆంధ్ర ప్రదేశ్ లోని నల్గొండ, కడప జిల్లాలలో కూడా యురేనియం తవ్వకా లను ప్రారంభించడానికి UCIL సన్నాహాలు చేస్తుంది. కేరళ తీరం లోని ఇసుకలో 'మోనజైట్' లభిస్తుంది. మోనజైట్ ఇసుక థోరియం, యురేనియం ప్లుటోనియంల మిశ్రమం. ప్రపంచ మోనజైట్ నిల్వలలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. అయితే వీటిని ఇంకా మనం వినియోగించుకోవటం లేదు. తీర ప్రాంత ఇసుకలలోని జిర్కాక్, ఇల్మ కైట్, ర్యుటైల్ లను ఇండియాన్ రేర్ ఎర్డ్స్ లిమిటెడ్ (IRE Ltd) సంస్థ వెలికి తీస్తోంది. ఈ గనులు, వాటి శుద్ధి కేంద్రాలు కేరళలోని క్విలన్, తమిళనాడులోని మనం కురిచ్చి, మహారాష్ట్రలోని రత్నగిరి, ఒరిస్సా లోని చత్రపూర్‌లో ఉన్నాయి.

Close