-->

భారత్ లో వాతావరణ పరిస్థితులు - Weather conditions in India

Also Read

భారత్ లో వాతావరణ పరిస్థితులు

        భారత శీతోష్ణస్థితి ఎంతో వైవిధ్యభరితమైంది. ప్రతి రెండు నెలలకోసారి వాతావరణంలో మార్పులు సంభవిస్తాయి! దేశంలో వాతావరణ పరిస్థితులు.. ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా.. ఒక్కో సమయంలో ఒక్కోరకంగా ఉం టాయి. దక్షిణ హిందూ మహాసముద్రంలో ఏర్పడే రుతు పవన ప్రక్రియ.. దేశ శీతోష్ణస్థితిని విశేషంగా ప్రభావితం చేస్తోంది!!
    ఒక ప్రాంతంలోని సగటు వాతావరణ పరిస్థితులనే శీతోష్ణస్థితిగా వ్యవహరిస్తారు. భారతదేశం శీతోష్ణస్థితి ఎంతో వైవిధ్యభరితంగా ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా భారత్ లో ఏడాదిలో ఆరు రుతువులను గుర్తిస్తారు. అంటే.. ప్రతి రెండు నెలలకు రణ మార్పులు సంభవిస్తాయన్న మాట! స్థూలంగా భారతదేశ శీతోష్ణస్థితిని 'రుతుపవన శీతోష్ణస్థితి' అంటారు. దక్షిణ హిందూ మహా సముద్రంలో ఏర్పడే రుతుపవన ప్రక్రియ.. దేశ శీతోష్ణస్థితిని విశేషంగా ప్రభావితం చేస్తోంది. శాస్త్రీయంగా పరిశీలిస్తే... భారతదేశం ఉష్ణో-ఆర్థ (HotHumid) శీతోష్ణస్థితి మండలం కిందకు వస్తుంది. కానీ సువిశాల భారతదేశంలో వాతావరణ పరిస్థితులు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకం గా, ఒక్కో సమయంలో ఒక్కోరకంగా ఉంటాయి. సువిశాల విస్తీర్ణం, నైసర్గిక స్వరూపం, రుతుపవనాలు, భౌగోళిక ఉనికి వంటి అంశాలు దీనికి కారణం. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు అత్యధిక వర్షపా తాన్ని పొందుతుండగా (ఉదా: చిరపుంజి, మాసిన్రామ్).. మరికొన్ని ప్రాంతాలలో అత్యల్ప వర్షపాతం నమోదవుతోంది (ఉదా: థార్ ఎడా 8). వేసవికాలంలో దక్కన్ పీఠభూమి, పశ్చిమ రాజస్థాన్ ప్రాంతాలు 45°C పైగా గరిష్ట ఉష్ణోగ్రతలను నమోదు చేసుకుంటుండగా.. అదే సమయంలో ఉత్తరాన ఉన్న హిమాలయ పర్వతసానువులలో వాతా వరణం చల్లగా, ఆహ్లాదంగా ఉంటుంది.

మార్చి 15 నుంచి జూన్ 15 వరకూ:

        వాతావరణ శాస్త్రజ్ఞులు భారత శీతోష్ణస్థితి సంవత్సరాన్ని నాలుగు భాగాలుగా విభజించారు. అవి.. 1. రుతుపవన పూర్వ    కాలం(మార్చి 15 నుంచి జూన్ 15 వరకు). 2. నైరుతి రుతుపవన కాలం (జూన్ 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు). B. ఈశాన్య రుతుపవన కాలం (సెప్టెం బర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు). 4. రుతుపవనానంతర కాలం (డిసెంబర్ 15 నుంచి మార్చి 15 వరకు). మార్చి 15 నుంచి జూన్ 15 మధ్యకాలంలో దేశమంతటా ఉష్ణోగ్రత గరిష్టంగా ఉంటుంది. ఇది మండు వేసవికాలం.ఈ సమయంలో సంవహన గాలులు వీస్తాయి. ఈ పవనాలను లూ, ఆంధీ, కాల్ బైశాఖీ, మామిడి జల్లులు వంటి స్థాని క పేర్లతో పిలుస్తారు. ఈ వేడిగాలులకు అప్పుడప్పుడూ చిరుజల్లులు, గాలిదుమ్ము కూడా తోడవుతాయి. ఈ కాలంలో ద్వీపకల్ప పీఠభూ ములు, వాయువ్య భారతదేశం బాగా వేడెక్కటంతో అల్పపీడనం ఏర్పడుతుంది. ఈ అల్పపీడనం తర్వాత నైరుతి రుతు పవనాలు భార త్ లోకి ప్రవేశించటానికి ఉపకరిస్తాయి.

జూన్ 15 నుంచి సెప్టెంబర్ 15:

    జూన్ 15 నుంచి సెప్టెంబర్ 15 మధ్యకాలంలో... అరేబియా సముద్రం, హిందూమహా సముద్రం నుంచి నైరుతి రుతుపవనాలు భారతదేశం లోకి ప్రవేశిస్తాయి. వీటి ప్రభావం వల్ల ఉష్ణోగ్రతలు కాస్త తగ్గి.. దేశ మంతా విస్తారంగా వర్షాలు కురుస్తాయి. వార్షిక వర్షపాతంలో సుమా రు 2/3 వంతు ఈ మూడు నెలల కాలంలోనే సంభవిస్తుంది. భారత ప్రధాన భూభాగంలోకి నైరుతి రుతుపవనాలు మొట్టమొదట జూన్ మొదటివారంలో మలబార్(కేరళ) తీరాన్ని తాకుతాయి. క్రమంగా ఇవి జూలై 15 కల్లా దేశమంతా వ్యాపిస్తాయి. నైరుతి రుతుపవ నాలు రెండు శాఖలుగా(అరేబియా సముద్రం, బంగాళాఖాతం) భారతదేశం లోకి ప్రవేశిస్తాయి. నైరుతి రుతుపవనాలు ఎత్తైన పర్వతాలు, పీఠ భూములను దాటే సమయంలో.. పవనాభిముఖ దిశలో ఉండే ప్రాంతాలలో వర్షపాతం విస్తారంగా కురుస్తుంది. కానీ అదే సమయం లో పవన పరాన్ముఖ దిశలో ఉండే ప్రాంతాలలో అత్యల్ప వర్షపాతం కురవటంతో.. అవి పాక్షిక శుష్కమండలాలుగా రూపొందాయి. ఉదాహరణకు అరేబియా సముద్రం నుంచి ప్రవేశించే నైరుతి రుతు పవనాలను పశ్చిమ కనుమలు అడ్డగిస్తాయి. దీనివల్ల మలబార్, కొంక ణ్ తీరాలలో విస్తారంగా వర్షం కురుస్తుంది. ఇవి అతి ఆర్ధ మండ లాలు. కాని సహ్యాద్రి కొండలకు వెనుక ఉన్న దక్కన్ పీఠభూమికి చెందిన ఉత్తర కర్ణాటక, పశ్చిమ తెలంగాణ, రాయలసీమ, మరాట్వా డా, విదర్భ ప్రాంతాలలో వర్షపాతం చాలా తక్కువ (సుమారుగా 50 సెం.మీ.మాత్రమే). అందువల్ల ఇవి పాక్షిక శుష్కమండలాలుగా రూపొందాయి. ఈ ప్రాంతాలు ఇటీవల ఎడారీకరణ సమస్యను ఎదు ర్కొంటున్నాయి. మన రాష్ట్రంలోని మహబూబ్ నగర్, అనంతపురం జిల్లాలు ప్రధానంగా ఈ మండలం కిందకు వస్తాయి. ఈ మండలంలో వర్షపాత పరిమాణంలో అనిశ్చితి కూడా అధికంగా ఉంది. ఈ మండ లం తరచూ తీవ్ర దుర్భిక్షాన్ని ఎదుర్కొంటోంది.

విస్తారంగా వర్షాలు:

    బంగాళాఖాతం నుంచి ప్రవేశించే నైరుతి రుతుపవనాలు.. తూర్పు, ఈశాన్య భారతదేశం, గంగా మైదానాలలో వర్షాన్నిస్తాయి. ఈ పవనా లను పూర్వంచల్ కొండలు, శివాలిక్ పర్వతాలు అడ్డగిస్తాయి. దాంతో పవనాభిముఖ దిశలోని తెరాయి మండలం, మేఘాలయలోని షిల్లాం గ్ పీఠభూమి, నాగాలాండ్ ప్రాంతాలు విస్తారంగా వర్షాన్ని పొందు తాయి. గారో, ఖాసీ కొండల పవనాభిముఖ దిశలో ఉన్న మాసిన్ రా మ్, చిరపుంజి ప్రపంచంలోనే అత్యధిక వర్షపాతాన్ని నమోదు చేసు కుంటున్నాయి. రాజస్థాన్ లోని ఆరావళి పర్వతాలు నైరుతి రుతుపవ నాలకు సమాంతరంగా ఉండటంతో ఇవి నైరుతి రుతుపవనాలను అడ్డగించలేవు. అదే సమయంలో పశ్చిమ రాజస్థాన్ ప్రాంతంలోని ఊర్థ్వ ట్రోపో ఆవరణంలో ఉన్న చల్లని స్థిర వాయురాశి నైరుతి రుతు పవనాలను పైకి లేవనీయకుండా అదిమిపెడతాయి. ఈ కారణాల వల్ల పశ్చిమ రాజస్థాన్లో వర్షపాతం అత్యల్పంగా ఉండి, శుష్కమండలం ఏర్పడింది. థార్ ఎడారి ఏర్పడటానికి ఇది ఒక ప్రధాన కారణం.

దక్షిణార్ధగోళంలోకి సూర్యుడు:

    సెప్టెంబర్ మధ్య నుంచి సూర్యుడు దక్షిణార్ధగోళంలోకి ప్రవేశిస్తాడు. దాంతో భారత్ లో క్రమంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయి. భారత భూభాగంపై విస్తరించి ఉన్న అల్పపీడనం క్రమంగా క్షీణించి, ఆ స్థానంలో అధిక పీడనం బలపడటం ప్రారంభమవుతుంది. ఈ రకంగా భారత భూభాగం నుంచి నైరుతి రుతుపవనాల తిరోగమనం ప్రారంభమవుతుంది. తిరోగమించే రుతుపవనాలు శుష్కంగా ఉంటా యి. అయితే, ఇవి బంగాళాఖాతంలోకి ప్రవేశించినప్పుడు అక్కడి తేమను పీల్చుకొని, ఆర్థంగా అవుతాయి. ఇదే సమయంలో బంగాళా ఖాతంలో వీస్తున్న ఈశాన్య వ్యాపార పవనాలు.. తిరోగమన రుతుపవ నాలను ఈశాన్య రుతుపవనాలుగా రూపాంతరం చెందిస్తాయి. ఈశా న్య రుతుపవనాలు తమిళనాడు, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో వర్షా న్నిస్తాయి. ఈ సందర్భంగా గమనించాల్సిందేమిటంటే.. తమిళనాడు ప్రాంతంలోకి నైరుతి రుతుపవనాలు రాకుండా.. నీలగిరి, అన్నామలై ఏలకుల కొండలు అడ్డగిస్తాయి. అందువల్ల నైరుతి రుతు పవనకాలం లో తమిళనాడులో వర్షం అంతగా కురవదు.
    ఈశాన్య రుతుపవనాలతో ఈ ప్రాంతం విస్తారంగా వర్షాన్ని పొందుతుంది. డిసెంబర్ 15 కల్లా దేశమంతటా శీతాకాలం ప్రవేశిస్తుం ది. ఈ సమయంలో రాత్రి ఉష్ణోగ్రతలు బాగా క్షీణిస్తాయి. హిమాలయ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు చేరుకుం టాయి. సైబీరియా నుంచి వచ్చే అతిశీతల పవనాలు.. గంగా-సింధు మైదానంలోకి రాకుండా హిమాలయ పర్వతాలు అడ్డుకుంటాయి. లేకపోతే వీటి ప్రభావం వల్ల గంగా-సింధు మైదానంలో ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీ లకు చేరుకొని, నదులు గడ్డకట్టుకొని పోయేవి. రబీ సాగు సాధ్యమ య్యేది కాదు. డిసెంబర్, జనవరి నెలల్లో హిమాలయాల నుంచి వీచే శీతల పవనాలు.. గంగా-సింధు మైదానంలో ఎముకలు కొరికే చలిని కలుగజేస్తాయి. డిసెంబర్-ఫిబ్రవరి కాలం దేశమంతా సాధారణంగా శుష్కంగా ఉంటుంది. కానీ, ఎర్రసముద్రం, మధ్యధరా సముద్రం నుంచి వాయువ్య భారతదేశంలోకి కవోష్ణ చక్రవాతాలు ప్రవేశిస్తాయి. వీటిని పశ్చిమ అలజడులుగా పిలుస్తారు. వీటి ప్రభావం వల్ల దేశ వాయువ్య ప్రాంతంలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయి. ఈ వర్షాలు రబీకాలంలో సాగయ్యే గోధుమ దిగుబడి పెరగటానికి దోహ దపడతాయి. ఈ కాలంలో బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడన ద్రోణులు కొన్ని బలపడి ఆయనరేఖా చక్రవాతాలుగా రూపొంది తూర్పు తీరాన్ని తాకుతాయి. వీటి ప్రభావం వల్ల తూర్పు తీరంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. మొత్తం మీద ఈ కాలంలో భారత దేశంలో వాతావరణ పరిస్థితులు అనిశ్చితంగా ఉంటాయి.

Close