-->

భారతదేశంలో పరిశ్రమల అభివృద్ధి - Development of industries in India

Also Read

భారతదేశంలో పరిశ్రమల అభివృద్ధి

గ్రూప్-2 జనరల్ స్టడీస్ పేపర్లో భౌగోళిక శాస్త్రం నుంచి సుమారు 20 నుంచి 25 ప్రశ్నలు వచ్చే అవకాశముంది. ఇందులో 10 నుంచి 15 ప్రశ్నలు భారతదేశానికి సంబంధించి ఉంటాయి. మిగిలిన ప్రశ్నలు ఆంధ్రప్రదేశ్, ప్రపంచ భౌగోళికశాస్త్ర విభాగాల నుంచి అడిగే అవకాశం ఉంది. భారతదేశానికి సంబంధించి నైసర్గిక స్వరూపం, నదీ వ్యవస్థలు, ఖనిజాలు, పరిశ్రమలు, వ్యవసాయం, రవాణా వ్యవస్థ, జనాభా, భాష, తెగలు మొదలైన అంశాల నుంచి ఎక్కువగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.

వ్యవసాయాధారిత పరిశ్రమలు:

భారతదేశంలో పారిశ్రామిక రంగానికి వ్యవసాయాధారిత పరిశ్రమలు వెన్నెముక. నూలు వస్త్ర, చక్కెర, జనపనార పరిశ్రమలు ఈ తరగతికి చెందుతాయి. మొత్తం పారిశ్రామికోత్పత్తిలో వీటి వాటా 40 శాతా నికి పైగా ఉంటుంది. చక్కెర పరిశ్రమ చెరకు పండించే ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉంటుంది.
ఉదా: ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, గుజరాత్, కర్ణాటక.
మన దేశంలో చక్కెర కర్మాగారాలు చిన్నవి. ఇవి వందల సంఖ్యలో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, బీహా లో కర్మాగారాలు బెల్లం, ఖండసారీ చక్కెరను ఎక్కువగా ఉత్పత్తి చేస్తాయి. వీటిలో కాలం చెల్లిన యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. దక్షిణ, పశ్చిమ భారతదేశంలోని కర్మాగారాలు ఆధునికమైనవి. వీటి ఉత్పాదకత ఎక్కువ. భారతదేశంలో పారిశ్రామికీకరణ నూలువస్త్ర పరిశ్రమతోనే ప్రారంభమైందని చెప్పవచ్చు. బొంబాయి, అహ్మదాబాద్, సూరత్ లలో స్థానిక పార్శీ, భటియా వ్యాపారస్తులు వీటిని స్థాపించారు. తర్వాత క్రమంగా మహారాష్ట్ర, గుజరాత్ ల్లోని అంతరాభాగా ల్లోకీ విస్తరించాయి. ఉదా: జామ్ నగర్, రాజ్ కోట్, నాసిక్, జల్ గావ్, షోలాపూర్.
స్వాతంత్ర్యానంతరం నూలువస్త్ర కర్మాగారాలు దక్షిణ, ఉత్తర భారతదేశంలోకి విస్తరించాయి. తమి ళనాడులోని కోయంబత్తూరు, మధురై, తిరుప్పూర్, చెన్నై, సేలం ఉత్తరప్రదేశ్ లోని కాన్పూరు, మురాదా బాద్, మోడీనగర్, రాజస్థాన్ లోని జైపూర్, ఉదయ్ పూర్, కోట, మధ్యప్రదేశ్ లోని ఇండోర్, గ్వాలియ లో భారీ నూలువస్త్ర కర్మాగారాలు ఏర్పాటయ్యాయి.
జనపనార పరిశ్రమ ప్రధానంగా పశ్చిమ బెంగాల్ లోని హుగ్లీ బేసిన్ ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. స్థానికంగా విస్తారంగా జనుము పండించటం, జల రవాణా, బొగ్గు లభ్యత ఇందుకు ప్రధాన కారణం. మొదటి జనపనార మిల్లు రిస్రాలో స్థాపిం చారు. కూకినార, నైహతి, లీలూ, బడ్జ్ బడ్జ్, ఫోర్ట్ బ్లాస్టర్లు ఇతర కేంద్రాలు. అస్సాంలోని ధుబ్రి, గౌహతి, బీహార్ లోని కతిహార్, ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్, ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు, నెల్లిమర్లలో కూడా జనపనార మిల్లులు ఉన్నాయి. ఉన్నివస్త్ర మిల్లులు వీటికి డిమాండ్ (మార్కెట్) ఉండే జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో స్థాపించారు. ధారీవాల్, అమృత్ సర్ (పంజాబ్) శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్, చురు, జైపూర్ (రాజస్థాన్), ముంబయిలలో పెద్ద మిల్లులు ఏర్పాటయ్యాయి.

ఖనిజాధారిత పరిశ్రమలు:

సిమెంటు, ఇనుము-ఉక్కు ముఖ్య మైన ఖనిజాధారిత పరిశ్రమలు. ఇవి ప్రధానంగా ముడిసరకులు లభించే ప్రాంతాలలోనే అభివృద్ధి చెందుతాయి. ఈ ప్రాంతాలలో కూడా జాతీయ రహదారులు, రైలు మార్గాల వెంబడే ఈ కర్మాగారాలు స్థాపించారు. 1904లో చెన్నైలో మొదటి సిమెంటు కర్మాగారాన్ని స్థాపించారు. గుజరాత్ లోని పోర్‌బందర్, మధ్యప్రదేశ్ లోని కట్ని, రాజస్థాన్ లోని లఖేరీలలో భారీ కర్మాగారాల స్థాపనతో భారతదేశంలో ఆధునిక సిమెంటు పరిశ్రమకు పునాది పడిందని చెప్పవచ్చు. మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్ లు సిమెంటును ఉత్పత్తి చేసే ముఖ్య రాష్ట్రాలు.
మధ్యప్రదేశ్ : జబల్ పూర్, కట్ని, సాత్నా, రేలా 
గుజరాత్ : పోర్బందర్, సిక్కా, ద్వారకా, భుజ్ 
తమిళనాడు : మధుకరణి, పులియార్, ఆలంగులం 
ఆంధ్రప్రదేశ్ : బసంత్ నగర్, మంచిర్యాల, యర్ర గుంట్ల, జగ్గయ్యపేట, తాడిపత్రి 
కర్ణాటక: నరసింహపూర్, వాడి, గుల్బర్గా, రాయచూర్.
స్వాతంత్ర్యం వచ్చే నాటికే జంషెడ్ పూర్, బర్న్ పూర్, భద్రావతిలలో సమీకృత ఉక్కు కర్మాగారాలు ఉన్నాయి. తర్వాత జర్మనీ, యూకే సోవియట్ యూనియన్ సాంకేతిక పరిజ్ఞానంతో రూర్కెలా, దుర్గాపూర్, బిలాయ్, బొకారోలలో ఆధునిక ఉక్కు కర్మాగారాలను స్థాపించారు. సేలం లో అల్లాయ్ స్టీల్ కర్మాగారాన్ని నిర్మించారు. చివరగా విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారం నిర్మించారు. జంషెడ్ పూర్ (TISCO) మినహా మిగిలినవన్నీ ప్రభుత్వ రంగంలోనే ఉన్నాయి. ఇటీవల ప్రభుత్వం ప్రైవేటు రంగంలో మినీ, భారీ ఉక్కు కర్మాగారాల ఏర్పాటును ప్రోత్సహిస్తోంది. ప్రపంచ మార్కెట్లో ఉక్కుకు బాగా గిరాకీ పెరిగి ధరలు పెరగటంతో ఇటీవల ప్రైవేటు ఉక్కు రంగం పెట్టుబడులను ఆకర్షిస్తోంది. టాటా, మిట్టల్ వంటి పారిశ్రామికవేత్తలు భారత్ లో భారీ ఉక్కు కర్మాగారాల స్థాపనకు ఉత్సాహం చూపిస్తున్నారు.

అటవీ ఆధార పరిశ్రమలు:

కాగితపు గుజ్జు, కాగితం తయారీ పరిశ్రమలు అటవీ ఆధారితమైనవి. ఇవి కాగితానికి డిమాండ్ ఉండే పెద్ద నగరాలు లేదా అటవీ సమీప ప్రాంతాలలో అభివృద్ధి చెందుతాయి. ధుబ్రి, నేవాగావ్ (అస్సాం), టిబాగఢ్, కలకత్తా (పశ్చిమబెంగాల్) హోషంగా బాద్, రట్లాం(మధ్యప్రదేశ్), రాజగంగానగర్ (ఒరిస్సా), కళ్యాణి, విక్రోలి, బల్లార్ పూర్, నాసిక్ (మ హారాష్ట్ర), దండేలి, బెళ గోళ, మైసూరు (కర్ణాటక), రాజమం డ్రి, భద్రాచలం, సిర్పూర్(ఆంధ్రప్రదేశ్)లలో కాగితం పరిశ్రమలు ఏర్పా టయ్యాయి. చక్కెర కర్మా గారాలకు అనుబంధంగా బాగాస్ ఆధారిత మినీ కాగితం కర్మాగారాలు మహారాష్ట్రలో పని చేయటం ప్రారంభించాయి.

Close