-->

సముద్ర లోతుల్లో ప్రవాళ భిత్తికలు - Coral reefs in the depths of the ocean

Also Read


సముద్ర లోతుల్లో ప్రవాళ భిత్తికలు

ప్రవాళ భిత్తికలను సముద్ర వర్షపాతపు అడవులుగా అభివర్ణిస్తారు. తక్కువ లోతు కలిగిన సముద్ర ప్రాంతాలలో ఒక రకమైన జీవుల నుంచి వెలువడే కాల్షియం కార్బొనేట్ స్రావాలు గట్టి పడటం ద్వారా ఈ భూ స్వరూపాలు ఏర్పడతాయి. ప్రవాళ భిత్తికలు జూప్లాంక్టాన్, ఫైటో ప్లాంక్టార్లకు ఆలవాలం కావడం వలన వీటిని ఆహారంగా తీసుకునే వివిధ రకాల చేప జాతులు ఈ ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంటాయి.
ఆయనరేఖా ప్రాంతంలోని సముద్ర భూతలాలపై కనిపించే విశేష భూస్వరూపాలే ప్రవాళ భిత్తికలు. సాధారణంగా సముద్రాల్లో తక్కువ లోతు ప్రదేశాల్లో కొన్ని ప్రవాళ జీవులు నివసిస్తుంటాయి. వీటి శరీ రాలు కాల్షియం కార్బొనేట్ పదార్థంతో నిర్మితమై ఉంటాయి. ప్రత్యేక తరగతికి చెందిన ఈ జీవులను 'పాలిప్స్' (polyps)గా వ్యవహరి స్తారు. సొమాటో పొరాయిడ్స్, మెలస్కస్ తదితర జాతుల జీవులు పాలిప్స కు చెందుతాయి. వీటి శరీర భాగాలే కాక కవచాలు, స్రావాలు కూడా కాల్షియం కార్బొనేటు తో కూడి ఉంటాయి. ఈ ప్రవాళ జీవులు అనువైన ప్రాంతాల్లో సహనివేశాలుగా ఏర్పడతాయి. ఈ ప్రాంతాల్లో ప్రవాళ జీవుల శరీర భాగాలు, స్రావాలు, కవచాలు పెద్ద దిబ్బల మాది రిగా ఉండి, ప్రవాళ బిత్తికలుగా ఏర్పడతాయి. ఈ ప్రవాళ భిత్తికలు లంబదిశలో విస్తరించి, సముద్ర మట్టంపైకి తేలినప్పుడు ప్రవాళ జీవులుగా ఏర్పడతాయి.

ప్రవాళ జీవులకు అనువైన పరిస్థితులు 

  • కనీసం 21 °C సగటు సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత 
  • తక్కువ లోతు గల సముద్ర భాగాలు భాగాలు (30 ఫాథమ్ ల కంటే తక్కువ లోతు) 
  • పారదర్శకంగా ఉండే సముద్ర భాగాలు 
  • శిథిల పదార్థం లేని సముద్ర భాగాలు 
  • సముద్ర అంతర్గత వేదికలు 
  • సాధారణ స్థాయి లవణీయత ఉన్న సముద్ర భాగాలు 
ఈ అనువైన పరిస్థితులు 30° ఉత్తర-దక్షిణ అక్షాంశ ప్రాంతాల్లోని తక్కువ లోతుగల (గాఢ) సముద్ర భాగాల్లో ఉంటాయి. అందువల్ల ప్రవాళ భిత్తికలు ప్రధానంగా ఆయన రేఖా, ఉప ఆయనరేఖా ప్రాంతా ల్లోని హిందూ మహాసముద్రం, కరేబియన్ సముద్రం, నైరుతి పసిఫిక్ సముద్ర ప్రాంతాలు, నైరుతి అట్లాంటిక్ సముద్ర ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. లక్షదీవులు, ఫిజీ, టాంగా, కరేబియన్ దీవులు, తూర్పు ఆస్ట్రేలియా తీరం, బ్రెజిల్ తీరాలలో ప్రవాళ దీవులు విస్తరించి ఉన్నాయి. నదీ ముఖద్వారాల వద్ద సముద్ర జలాలు శిలాపదార్థ నిక్షేపణం వల్ల పారదర్శకంగా ఉండవు. దీంతో అక్కడ ప్రవాళ భిత్తికలు ఏర్పడవు.

ప్రవాళ భిత్తికలు ప్రధానంగా మూడురకాలు. అవి... తీరాంచల బిత్తికలు, అవరోధ భిత్తికలు, అటాల్స్.

ఈ మూడురకాల భిత్తికలు మూడు అభివృద్ధి దశలను సూచిస్తాయ ని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ మూడు రకాలు వరుసగా వాటి పరిణామక్రమంలో ఏర్పడతాయని 'డార్విన్-డానా'లు సూత్రీక రించారు. ఈ సిద్ధాంతం ప్రకారం... ప్రవాళ బిత్తికలు ప్రాథమిక దశలో అగ్నిపర్వత దీవుల తీరాల్లో తీరాంచల భిత్తికల రూపంలో ఏర్పడ తాయి. దీవి క్రమంగా కుంగిపోవడంతో తీరానికి, ప్రవాళ భిత్తికకు మధ్య కయ్య ఏర్పడుతుంది. ఈ రకంగా తీరాంచల భిత్తిక, అవరోధ భిత్తికగా రూపొందుతుంది. అగ్నిపర్వత దీవి పూర్తిగా కుంగిపోవటం తో మధ్యభాగంలో విశాలమైన కయ్య రూపొందుతుంది. ఈ రకంగా కయ్యను పరివేష్టించి ఉన్న వృత్తాకార ప్రవాళ భిత్తికను 'అటాల్'గా పిలుస్తారు. అయితే అగ్నిపర్వత దీవుల ప్రాంతాల్లో 'భూ అభినతి' సంభవించటానికి కారణాలను డార్విన్ సిద్ధాంతం వివరించలేక పోయింది.

ప్లే స్టోసిన్ హిమనీనదాలు కరగటం వల్ల క్రమంగా తీరాంచల భిత్తి కలు అటాగా రూపొందాయని రీన్-ముర్రే సూత్రీకరించారు. ఈ సిద్ధాంతం ప్రకారం... ప్లీస్టోసిన్ హిమానీనదాలతో మూసుకుపోయిన ఖండాల తీరాలలో ప్రథమంగా తీరాంచల భిత్తికలు ఏర్పడ్డాయి. కవోష్ణ యుగంలో హిమానీనదాలు క్రమంగా కరగటంతో ప్రవాళ బిత్తికలకు, తీరానికి మధ్య కయ్య ఏర్పడుతుంది. దీంతో తీరాంచల భిత్తికలు అవరోధ భిత్తికలుగా, క్రమంగా అటాల్ గా రూపొందుతాయి. తీరాంచల భిత్తికలలోని కాల్షియం కార్బొనేటు ద్రావణీకరణం చెందటంతో క్రమక్షయం చెంది, ఆ ప్రాంతంలో కయ్య ఏర్పడుతుంది. తద్వార అవరోధ భిత్తికలు ఏర్పడతాయని ద్రవణీకరణ సిద్ధాంతం సూచిస్తుంది. అయితే ప్రవాళ భిత్తికల సమీపంలో క్రమక్షయానికి సంబంధించిన ఆధారాలు లేవు. కానీ నిక్షేపణ ప్రక్రియ జరుగుతుందన డానికి ఆధారాలున్నాయి.

అటాల్స్.. అంతటా ఒకే రీతి

అటాల్స్ లోని కయ్యల లోతు ప్రపంచవ్యాప్తంగా ఒకేరీతిలో ఉండటా న్ని హిమనీనద నియంత్రణ సిద్ధాంతం వివరిస్తుంది. ప్రపంచవ్యాప్తం గా హిమనీనదాల కరుగుదల రేటు ఒకేరకంగా ఉంటుంది. దీంతో వాటివల్ల ఏర్పడిన కయ్యల లోతు ఒకేరీతిగా ఉంటుంది. అయితే హిమనీనదాల సమీపంలో ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా ఉండటం వల్ల ప్రవాళ భిత్తికలు ఏర్పడే అవకాశం లేదు.

ప్రవాళ భిత్తికలు విస్తృత జీవ వైవిధ్యానికి నిలయాలు. అందువల్ల వీటిని సముద్రాల వర్షపాత అడవులుగా అభివర్ణిస్తారు. ప్రవాళ భిత్తి కలు... జ్యూప్లాంక్టన్, ఫైటా ప్లాంక్టన్లకు ఆలవాలంగా ఉంటాయి. దీంతో వీటిని ఆహారంగా స్వీకరించే పలు రకాల చేపల జాతులు
ప్రవాళ భిత్తికల ప్రాంతాల్లో కేంద్రీ కృతమై ఉంటాయి. సముద్ర ఆవ రణ వ్యవస్థలలోని పోషక చక్రాల నిర్వహణలో ప్రవాళ భిత్తికలు ప్రముఖపాత్ర పోషిస్తాయి. అయితే, ఇటీవల ప్రవాళ భిత్తికలు ప్రపంచ వ్యాప్తంగా క్షయం చెందుతున్నాయి. ప్రవాళ భిత్తికలతో సహజీవనం చేసే 'జ్యూక్సాంతల్' జీవులు ప్రవాళాలకు వివిధ రంగులనిస్తాయి. అయితే గ్లోబల్ వార్మింగ్ వల్ల ఈ జీవులు క్రమంగా నశించటంతో ప్రవాళ జీవులు పొడబారి (Bleaching) తెల్లగా మారుతున్నాయి. క్రమంగా నశిస్తున్నాయి.

ప్రవాళ క్షీణత

1870ల నుంచి ప్రపంచంలోని దాదాపు అన్ని ప్రవాళ భిత్తికా మండలా ల్లో... ప్రవాళ క్షీణత జరిగినట్లు ఆధారాలున్నాయి. అయితే, 1970ల నుంచి ప్రవాళ క్షీణతా తీవ్రత అధికంగా ఉన్నట్లు నివేదికలు తెలి యజేస్తున్నాయి. మొత్తం సుమారు 105 సామూహిక ప్రవాళ క్షీణతా సంఘటనలు జరిగినట్లు సమాచారం. అందులో 60 సంఘటనలు 1979-1990 మధ్యలోనే సంభవించాయి. 1980లకు పూర్వం ప్రవాళ క్షీణత ప్రధానంగా చక్రవాతాలు, వేలా తరంగాల వల్ల సంభవించింది. కానీ, 1980ల తర్వాత సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా పెరగటం వల్ల ప్రవాళ క్షీణత జరిగినట్లు శాస్త్రజ్ఞులు నిర్ధారించారు. అంతేకాక 1980ల నుంచి సంభవిస్తున్న క్షీణత కేవలం కొన్ని ప్రాంతా లకే పరిమితం కాకుండా.. ప్రపంచంలోని దాదాపు అన్ని ప్రవాళ మండలాలకు, అన్ని లోతుల సముద్ర భాగాలకు విస్తరించటం గమ నార్హం. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు, అతి నీలలోహిత కిరణాలు విడివిడిగా కానీ, లేక కలిసి గానీ ప్రవాళ క్షీణతకు ముఖ్య కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చాలా సందర్భాల్లో ప్రవాళ క్షీణత వేసవి కాలంలో అల్పపవన వేగాలు, మేఘరహిత ఆకాశంతో కూడిన ప్రశాంత సముద్ర భాగాలలో సంభవిస్తుంది. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 2°C నుంచి 3°C పెరిగితే ప్రవాళ క్షీణత ప్రారంభమవుతుందని అధ్యయనాలు తెలుపు తున్నాయి.

ప్రవాళం క్షీణించినప్పటికీ, క్షీణత చాలావరకు తాత్కాలికంగా ఉంటుంది. కానీ 1998, 2002లలో సంభవించిన ప్రవాళ క్షీణత శాశ్వ తమని శాస్త్రజ్ఞులు నిర్ధారించారు. 1998, 2002లలో ఆస్ట్రేలియా తూర్పు తీరంలోని గ్రేట్ బారియర్ రీ లో 40 శాతం క్షీణత సంభవిం చింది. లక్షదీవులు, మాల్దీవులు, శ్రీలంక, కెన్యా, టాంజానియా, సెబెల్స్ ప్రాంతాలలోని ప్రవాళ భిత్తికలలో కూడా చెప్పుకోదగ్గ స్థాయి లో క్షీణత జరిగింది. మధ్యధరా సముద్రంలో 'విబ్రియో షిలోయి' అనే సూక్ష్మజీవి... 'ఓక్యులినా పటగోనికా' తరగతికి చెందిన ప్రవాళ భిత్తిక లను క్షీణింపజేస్తున్నట్లు నిపుణు లు తెలిపారు. భారతదేశం, శ్రీలంకల మధ్య ఉన్న మన్నార్ సింధుశాఖ, పాక్ అఖాతం ప్రాంతాలలో... రామేశ్వరం దీవి నుంచి వేధాలయి వరకు 25 కిలోమీటర్ల ప్రాంతం లో... 66 జాతులకు చెందిన ప్రవాళ జీవులు నివసిస్తున్నాయి. 2002 ఏప్రిల్-జూన్ మధ్యకాలంలో.... 57 శాతం ప్రవాళాలు క్షీణించాయి. ఈ కాలంలో, ఈ ప్రాంతంలో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రత 29.5°C నుంచి 32.6°C మధ్య ఉంది. ఆక్రోపెరా జాతికి చెందిన ప్రవాళాలు బాగా ప్రభావితమయ్యాయి. పోరైట్స్ జాతికి చెందిన ప్రవాళాలలో క్షీణత కనిష్టంగా 29 శాతం ఉంది. గ్రేట్ బారియర్ రీఫ్ మెరైన్ పార్క్ అథారిటీ ప్రవాళ క్షీణతను అరికట్టడానికి ప్రత్యేక ప్రణాళికను రూపొం దించింది. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలను నిరంతరం గమనిం చటం... క్షీణతను ముందుగానే పసిగట్టడం.. క్షీణతా తీవ్రతను అంచ నా వేయటం.. క్షీణత వల్ల సంభవించే ఆవరణ సమస్యలను మదింపు చేయటం... స్థానికులను ప్రవాళ పరిరక్షణలో భాగస్వాములను చేయ టం... మొదలైనవి ఈ ప్రణాళిక ముఖ్యాంశాలు.

Close