-->

Constitution Directive Principles (భారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలు)

Also Read

ఆదేశిక సూత్రాలు

ఆర్టికల్ 46:

షెడ్యూల్డ్ కులాలు, తెగలు, బలహీన వర్గాల విద్య, ఆర్థిక ప్రయోజనా లను పెంపొందించడానికి రాజ్యం కృషి చేయాలి. సామాజిక అన్యా యాలు, అన్ని రకాల పీడనల నుంచి వారిని రక్షించాలి.
ప్రాథమిక హక్కుల్లోని నిబంధనలకు మరింత బలం చేకూర్చేలా, అణగారిన వర్గాల ప్రయోజనాల నిమిత్తం ఈ ఆర్టికలను రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగంలో చేర్చారు. 'బలహీన వర్గాలు' అనే పదం పరిధిలోకి ఎవరు వస్తారో తెలిపే విధివిధానాలను రూపొందించాలని శాంతి స్టార్ బిల్డర్స్ వర్సెస్ నారాయణ్ కిమ్ లాల్ తోతియే (1990) కేసులో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని నిర్దేశించింది.

ఆర్టికల్ 47:

ప్రజల్లో పోషకాహారం స్థాయి, జీవన ప్రమాణాలు, ప్రజారోగ్యం పెంచడాన్ని తన ప్రథమ కర్తవ్యంగా రాజ్యం భావించాలి. అదే విధం గా వైద్య అవసరాలకు తప్ప, మిగిలిన సందర్భాల్లో మత్తు పానీయా లు, మత్తు పదార్థాలు వాడటాన్ని నిషేధించాలి.

ఆర్టికల్ 48:

వ్యవసాయం, పశుపోషణలు ఆధునిక, సాంకేతిక విధానాల్లో జరగడా నికి కృషి చేయాలి. ఆవులు, దూడలు, ఇతర పాలిచ్చే పశువుల వధను నిషేధించాలి.

ఆర్టికల్ 48ఎ:

పర్యావరణ పరిరక్షణ, అడవుల వృద్ధికి, వన్య ప్రాణుల సంరక్షణకు ప్రభుత్వం కృషి చేయాలి. దీన్ని 42వ రాజ్యాంగ సవరణ చట్టం, 1976 ద్వారా రాజ్యాంగంలో చేర్చారు)
పర్యావరణ పరిరక్షణలో అత్యంత ప్రాముఖ్య మున్న ఆర్టికల్ ఇది. ఈ ఆర్టికలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ చట్టం, 1986ను చేసి లక్ష రూపాయల జరిమానా, ఏడేళ్ల వరకూ జైలుశిక్ష విధించాలని నిబంధనలు చేసింది. పర్యావరణ పరిరక్షణలో ప్రముఖ పాత్ర పోషిస్తూ కేవలం ఒక ఉత్తరాన్ని సైతం పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్ గా భావించి అనేక తీర్పులను సుప్రీంకోర్టు వెలువరించింది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ ఎన్విరో లీగల్ ఆక్షన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (1996) కేసులో 'ఎన్విరాన్మెంట్ కోర్టు'లను ఏర్పాటు చేయాలని సూచించింది.
కళాత్మకమైన లేదా చారిత్రాత్మకమై జాతీయ ప్రాముఖ్యం కలిగి, పార్ల మెంట్ చట్టం ద్వారా గుర్తించిన ప్రదేశాలు లేదా వస్తువులు కాపాడటం, ఎగుమతి కాకుండా చూసే బాధ్యత రాజ్యానిదే.

ఆర్టికల్ 50:

ప్రభుత్వ సర్వీసుల్లో న్యాయశాఖను కార్యనిర్వాహక శాఖల నుంచి వేరు చేయడానికి రాజ్యం చర్యలు తీసుకోవాలి.

ఆర్టికల్ 51:

రాజ్యం కింది అంశాల సాధనకు కృషి చేయాలి.
ఎ) అంతర్జాతీయ శాంతి, భద్రతలను పెంపొందించడం
బి) వివిధ రాజ్యాల మధ్య తగిన, గౌరవ ప్రదమైన సంబంధాలు కొనసాగించడం
సి) అంతర్జాతీయ చట్టాలు, ఒప్పందాల పట్ల గౌరవాన్ని పెంపొం దించడం
డి) అంతర్జాతీయ వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవ డాన్ని ప్రోత్సహించడం.
భారతదేశం అలీనోద్యమానికి సారథ్యం వహించడం, వివిధ అంతర్జాతీయ శాంతి పరిరక్షక దళాలకు తోడ్పడటం మొదలైన చర్యలు ఈ ఆర్టికల్ అమల్లో భాగమే. మన దేశంలో ప్రత్యేక చట్టం చేయ నంతవరకు అంతర్జాతీయ చట్టాల అమలు సాధ్యం కాదు. అంతర్జా తీయ చట్టాలను, ఒప్పందాలను అమలు చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికే ఉంది. ఒకవేళ అంతర్జాతీయ చట్టానికి మనదేశ చట్టాలు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ మన చట్టాలు మాత్రమే అమలవుతాయని సుప్రీంకోర్టు వివిధ కేసుల్లో పేర్కొంది.

Close