-->

విజయనగర సామ్రాజ్యం పతనానికి గల కారణాలు - Reasons for the downfall of the Vijayanagara Empire

Also Read

విజయనగర సామ్రాజ్య పతనానికి గల కారణాలు

    దక్షిణ భారత దేశంలోనే కాకుండా యావత్ భారత దేశ చరిత్రలో విజయనగర రాజ్యానికి ఒక ముఖ్యమైన స్థానం కలదు. భారతదేశ చరిత్రలో విలసిల్లిన గొప్ప రాజ్యాలలో విజయనగర రాజ్యమొకటి. మూడు శతాబ్దాల కాలం కొనసాగి, సువిశాల ప్రాంతంలో విలసిల్లిన రాజ్యాలు భారతదేశ చరిత్రలో చాలా తక్కువ. అందులో విజయనగర రాజ్యం ప్రముఖమైంది. భారతదేశంలోని మహమ్మదీయ దండయాత్రలు అడ్డుకోవడానికి విజయనగర రాజ్యము కంచుకోటగా నిలిచిందని చెప్పవచ్చు. హిందూ మతాన్ని, సంస్కృతిని పునరుద్ధరించిన రాజ్యము విజయనగర రాజ్యమనే అభిప్రాయం కూడా ఉంది.

    దక్షిణ భారతదేశ చరిత్రలో విజయనగర చరిత్ర ఉజ్వలమైన తుది అధ్యాయమని ఆచార్య నీలకంఠశాస్త్రి తెలియజేశారు. క్రీ.శ. 1336 లో విద్యారణ్య మహర్షి ఆశీస్సులతో తుంగభద్రా నదికి దక్షిణ తీరాన విజయనగరం ఏర్పడింది. విజయనగరంగా చరిత్రలో హరిహరరాయలు, బుక్కరాయలు అనే సోదరులు ఈ రాజ్య స్థాపకులుగా నిలిచారు. విజయనగర రాజ్యాన్ని సంగమ, సాళువ, తుళువ, అరవీటి నాలుగు రాజవంశాలు పరిపాలించారు. ఈ రాజ్యము 1565 లో తల్లికోట యుద్ధములో త్రీవంగా నష్టపోయి చివరికి 1680 నాటికి అంతరించినది. ఈ రాజ్య పతనానికి ఈ క్రింది కారణాలను మనం పేర్కొనవచ్చు. అవి

నిరంకుశ రాజరిక వ్యవస్థ

    చక్రవర్తి నిరంకుశుడు అధికారాలన్నీ తానే చలాయించే వాడు ఇతనికి సలహాలు ఇవ్వడానికి మంచి మండలి ఉన్నప్పటికీ అన్ని విషయాల్లో రాజే సర్వాధికారి. .అందువల్ల పరిపాలన వికేంద్రీకరణ జరగకపోవడం వల్ల అంత పెద్ద సామ్రాజ్యాన్ని పరిపాలించడం రాజుకు సాధ్యపడలేదు.నిర్ణయాలను వేగంగా తీసుకోవడములో జాప్యము జరిగేది.

విజయనగర రాజ్యంలో వారసత్వ సమస్య

    విజయనగర రాజ్య ఏర్పడిన తర్వాత అనగా పద్మ 136 నుండి 1680 మధ్య సంగమ, సాళువ, తుళువ, ఆరవీడు ఈ సామ్రాజ్యాన్ని స్థాపించారు ప్రతి రాజ్యంలోనూ బలహీనులైన రాజు అధికారంలో ఉన్నప్పుడు బలవంతులైన సేనాధిపతి లో లేదా ఇతర వంశస్థులు వారిని ఓడించి హతమార్చి రాజ్యాన్ని వశపరచుకోవడం సర్వసాధారణం. విజయనగర సామ్రాజ్యములో వారసత్వ సమస్యలు సామ్రాజ్య పతనానికి దారి తీసింది. సంగమ వంశం కాలంలో మల్లికార్జున రాయలకు విరూపాక్ష రాయలకు జరిగాయని తగాదా, సాళువ వంశం కాలం ఇమ్మడి నరసింహ రాయలుకు అతని ప్రధానమంత్రి తుళువ నరసనాయకునికి మధ్య ఉన్న తగాదాలు. తుళువ వంశం లో వీరనరసింహరాయలుకు శ్రీకృష్ణదేవరాయలు మధ్య ఉన్న తగాదాలు, కృష్ణదేవరాయల అచ్యుతదేవరాయలు వారసత్వ సమస్యలను ఎదుర్కొన్నాడు. కృష్ణ దేవరాయలు అల్లుడు ఆలియరామరాయలు మరణం తర్వాత అధికారాన్నంతటిని హస్తగతం చేసుకున్నాడు. రాక్షసి తంగడి యుద్ధం తర్వాత అధికారంలోకి వచ్చిన తిరుమలరాయలు అప్పటికే ఉన్న సదాశివరాయలు హత్య చేసి అధికారంలోకి రావడం జరిగింది. ఈ విధంగా విజయనగర సామ్రాజ్యంలో వారసత్వ సమస్య తీవ్రంగా ఉండటం ఇది సామ్రాజ్య పతనానికి ఒక కారణంగా మనం పేర్కొనవచ్చు.

సామంతుల తిరుగుబాట్లు

    స్థానిక పాలకులు తమను తాము పాలకులుగా భావించుకొని విజయనగర సామ్రాజ్య పతనానికి కారణం కావడం జరిగింది. ప్రధానంగా నాయక రాజ్యాలు విజయ సామ్రాజ్య పతనానికి కొంతవరకు కారణమయ్యాయి. వీరు విజయనగర రాజ్యాధిపతి బలంగా ఉన్నప్పుడు రాజ్యానికి లోబడి ఉండేవారు బలహీనమైన రాజు కాలంలో స్వతంత్రించి తిరుగుబాట్లు చేసివారు.

నిరంతర యుద్దాలు

    విజయనగర సామ్రాజ్యము ఏర్పడినప్పటినుండి నిరంతర యుద్ధాలలో మునిగి తేలింది. చుట్టూ పక్కల రాజ్యాలను ముస్లిం సుల్తానులు పరిపాలించడము. బీజాపూర్, అహ్మద్ నగర్, గోల్కొండ, బీదర్, బీరార్ రాజ్యాలు ముస్లిం పరిపాలనలో ఉండటం వల్ల యుద్ధం తప్పని సరి అయింది. ఈ నిరంతర యుద్ధాల వల్ల ధనాగారం ఖాళి అయ్యేది. ప్రజలు ఎక్కువ శిస్తు చెల్లించాల్సి వచ్చేది. హిందూ రాజ్యాలతో కూడా నిరంతర యుద్దాలు కొనసాగించారు. రెడ్డి రాజుల తోనూ, ఒరిస్సా గజపతుల తోనూ, ఉమ్మతురు, శివసముద్రం రాజులతోను యుద్దాలు చేశారు.

బహమనీ రాజ్యముతో నిరంతర యుద్దాలు

    1347 లో ఏర్పడిన బహమనీ రాజైముతో నిరంతర యుద్దాలు విజయనగర సామ్రాజ్య పతనానికి కారణము అయ్యింది. మొదటి హరిహర రాయల కాలం లోనే 1347 లోనే హసన్ గంగు విజయనగర రాజ్యముపై దండెత్తి రాయచూరు వరకు ఆక్రమించాడు. అప్పటినుండి విజయనగర, బహమనీ రాజ్యానికి రాయచూరు పై ఆధిపత్యం సాధించడానికి అనేక యుద్ధాలు జరిగాయి. బహమనీలు మొదటి బుక్కరాయలు చేతిలో ఓడిపోయారు. రెండవ హరిహర రాయలు , రెండవ దేవరాయలు తో యుద్ధాలు జరిగాయి ఈ విధముగా బహమనీ సామ్రాజ్యము 1482వరకు నిరంతర యుద్దాలు కొనసాగించింది.

బహమనీ సామ్రాజ్య విచ్చిన్నత

    బహమనీ సుల్తాన్ మూడవ మొహమ్మద్ షా మరణం తర్వాత (1482) ఈ రాజ్యము 5 ముస్లిం రాజ్యములుగా విడిపోయింది అవి, బీజాపూర్, అహమ్మద్ నగర్, గోల్కొండ, బీదర్, బీరార్. దీనితో విజయనగర సామ్రాజ్యానికి ప్రమాదం ఇంకా ఎక్కువ పెరిగింది. ఈ రాజ్యాలు ఇస్లాం మతానికి ప్రాధాన్యత ఇవ్వడం, సరిహద్దు తగాదాలు, సామ్రాజ్య కాంక్ష, యుద్ధాలకు దారి తీసి చివరకు విజయనగర పతనానికి దారి తీసింది. శత్రువులు అధికం కావడముతో ధనము మరియు కాలం యుద్ధాలకు కేటాయించడం వల్ల సామ్రాజ్యము అశాంతి గురి అయ్యింది. సమర్థులైన విజయనగర రాజులు వీరందరిని అదుపులో ఉంచగలిగారు శ్రీ కృష్ణదేవరాయలు తర్వాత వచ్చిన బలహీనులు వారిని అదుపు చేయలేక పోయారు.

బలహీనులైన రాజులు అధికారంలోకి రావడం

    విజయనగర సామ్రాజ్య పతనానికి ఘన కారణము అసమర్ధులైనా రాజులు అధికారాన్ని చేపట్టడం. శ్రీకృష్ణ దేవరాయల అనంతరం వచ్చిన అచ్యుత రాయలు, సదాశివరాయలు రామారాయలు చేతిలో కీలుబొమ్మలు. రామారాయలు మరణం తర్వాత సదాశివరాయలు తిరుమల రాయల చేతిలో కీలుబొమ్మగా పరిపాలన గావించాడు. తిరుమల రాయలు విజయనగర సామ్రాజ్యాన్ని పునరుద్దరించలేక పోయాడు. ఇతని తర్వాత ఎవరు సామ్రాజ్యాన్ని పూర్వ స్థితికి తీసుకొని వచ్చే శక్తి ఎవరి లేదు. 1680 లో మూడవ శ్రీరంగరాయలు మరణముతో ఈ రాజ్యము అంతరించింది.

తల్లికోట యుద్ధం

    రాక్షసి తంగడి యుద్ధం లేదా తల్లికోట యుద్ధం దక్షిణ భారతదేశం చరిత్ర గతిని మార్చిన యుద్ధాలలో రాక్షసి తంగడి యుద్ధం ఒకటి దీనికి బన్నీ హట్టి యుద్ధం అని పేరు కూడా ఉంది. దక్కను సుల్తానుల లోని అంతఃకలహాలు అవకాశంగా తీసుకొని రామరాయలు వారి అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చడం జరిగింది. అహమ్మద్ నగర్, గోల్కొండ ల కు సహాయంగా బీజాపూర్ పై దండెత్తుతాడు. తర్వాత బీజాపూర్ తో కలసి అహమ్మద్ నగర్ ను ధ్వంసం చేశాడు. చివరకు రామరాయలు కుట్రను గ్రహించిన సుల్తానులు విభేదాలను మర్చి ఏకమై మహా కూటమిగా ఏర్పడి క్రీస్తు శకము 1565 లో విజయనగర రాజ్యంపై దండెత్తుతారు. విజయనగరానికి పది మైళ్ల దూరంలో ఉన్న రాక్షసి - తంగడి అనే గ్రామాల మధ్య మైదానంలో ఉభయ పక్షాలు తారసిల్లాయి. యుద్ధ ప్రారంభంలో విజయం రామారాయాలకే లభించింది కానీ ముస్లిం సైన్యాలు ఇరవైమైళ్ళ వెనకకు వెళ్లి నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు విజయనగర సైన్యాలపై మెరుపు దాడి చేశాయి. రామరాయలును బంధించారు. ఆ తరువాత అహమ్మద్ నగర్ సుల్తాన్ హుస్సేన్ నిజాంషా రామరాయలను హతమార్చాడు. ముస్లిం సైన్యాలు. ముస్లిం సైన్యాలు విజయనగరంలో ప్రవేశించిక మునుపె ఆటవిక తెగలు రాజ్యము పై పడి దోచుకోవడము జరిగింది. తర్వాత సుల్తానులు విజయనగర పై దాడి చేసి ఐదు మాసాలు నగరాన్ని దోచుకొని ధ్వంసం చేశారు. విజయనగరం స్మశానముగా మారింది. 

సహజ కారణాలు

    చరిత్ర పుటలను తిరగ వేస్తే ఎంత పెద్ద సామ్రాజ్యమైన ఎదో ఒక రోజు పతనం కాక తప్పదని చరిత్ర నిరూపించింది. ప్రాచీన రోమన్ సామ్రాజ్యము నుండి ఆధునిక కాలం రవి అస్తమించని సామ్రాజ్యముగా పేరుగాంచిన జరిగిన పరిణామాలను ఇంగ్లాండ్ వరకు గమనిస్తే మనకు అర్థం అవుతుంది. భారతదేశములో మౌర్య సామ్రాజ్యము నుండి మొఘల్ ల వరకు మనం గమనించవచ్చు. ఈ విధముగా విజయనగర సామ్రాజ్యము కూడా శ్రీకృహ్నదేవరాయలు కాలంనాటి అటుంటా స్థాయిని చేరుకొని సదాశివరాయల కాలం నాటికి బలహీనపడి, అరవీటి వంశకాలము లో అంతమైంది.

ఫలితాలు

    రాక్షసి తంగడి యుద్ధ వార్త విజయనగరాన్ని దిగ్భ్రాంతిలో ముంచెత్తినది. యుద్ధములో చావు తప్పించుకొని పారిపోయిన తిరుమల రాయలు విజయనగరాన్ని రక్షించడం అసాధ్యమని భయముతో అచటి ధన రాశులను,అంతఃపుర స్త్రీలను, 500 ఏనుగులపై ఎత్తించి పెనుగొండకు పారిపోయాడు. తరువాత సుల్తానులు విజయనగరముపై దాడి చేసి ఐదు మాసాలు నగరాన్ని ధ్వసం చేసి దోపిడీ చేశారు. సుల్తానులు వెళ్ళిపోయినా తరువాత తిరుమల రాయలు, సదాశివరాయలును వెంటబెట్టుకొని విజయనగరం వచ్చి చూసాడు. ఆ విధ్వంసక నగరాన్ని పునరుద్ధరించటం సాధ్యం కాదని తిరిగి పెనుగొండ కు వెళ్లి అధికారాన్ని హస్తగతం చేసుకొని అరవీటి వంశాన్ని స్థాపించాడు. ఈ అరవీటి వంశం1570 నుండి 1680 వరకు 8 మంది పరిపాలించ్చారు. పెనుగొండ, చంద్రగిరి, రాయవెల్లూరు లను రాజధానులుగా చేసుకొని పరిపాలించారు.

Close