-->

పంచాయతీరాజ్ వ్యవస్థ - Panchayati Raj System - 73rd Constitutional Amendment Act

Also Read

పరిచయం

    74 భారత దేశంలోని క్షేత్రస్థాయి స్థానిక ప్రభుత్వ విభాగాలను బలోపేతం చేయడానికి 73, రాజ్యాంగ సవరణ చట్టాలు (1992) ఎంతో దోహద పడుతున్నాయి. 73వ రాజ్యాంగ సవరణ చట్టం గ్రామీణ స్థానిక ప్రభుత్వాల గురించి (అంటే పంచాయతీ రాజ్ సంస్థల గురించి) వివరిస్తుంది. 74వ రాజ్యాంగ సవరణ చట్టం పట్టణ స్థానిక ప్రభుత్వాల గురించి (అంటే పురపాలక, నగర పాలక సంస్థల గురించి) వివరిస్తుంది. ఈ రెండు సవరణ చట్టాలు 1993లో అమలులోకి వచ్చాయి. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఈ రెండు రాజ్యాంగ సవరణ చట్టాలను మైలురాళ్ళని చెప్పవచ్చు.
చారిత్రక నేపథ్యం : చక్కని పరిపాలనా వికేంద్రీకరణ, గ్రామ స్వరాజ్యం భారతదేశానికి ఎంతో అవసరమని గాంధీజీ ఏనాడో ఉద్భోదించారు. మహాత్మాగాంధీ గ్రామ స్వరాజ్య ఆశయాన్ని భారత రాజ్యాంగంలోని ఆదేశక సూత్రాలలో 40వ ప్రకరణలో వారు పొందు పరిచారు. ఈ ప్రకరణ ప్రకారం రాజ్యం పంచాయతీ రాజ్ సంస్థలను నిర్వహించి, అది స్వయం పాలనా సంస్థలుగా ఏర్పడటానికి తగిన అధికారాలు ఇవ్వాలి. సామాన్య ప్రజానీకానికి పరిపాలనలో భాగస్వామ్యం, ప్రాతినిధ్యం కల్పించడానికి స్థానిక ప్రభుత్వాలు ఎంతో అవసరం. ఈ సంస్థలు ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదుల్లాంటివి.
    భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత 1952లో సమాజాభివృద్ధి పథకం (Community Development Programme) అమలు కోసం తగిన చర్యలు తీసుకుంది. 1953లో కేంద్ర ప్రభుత్వం(National extension service scheme NESS) జాతీయ విస్తరణ సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.
    1957లో బల్వంత్ రారు మెహతా ఆధ్వర్యంలో ఒక పరిశీలన సంఘాన్ని నియమించింది. సమాజాభివృద్ధి పథకాల వైఫల్యానికి దారి తీసిన పరిస్థితుల గురించి విచారణ చేపట్టాల్సిందిగా ఈ సంఘాన్ని ప్రభుత్వం కోరింది.
    బల్వంత్ రారు కమిటీ అనేక సిఫార్సులు చేసింది వాటిలో ప్రధానమైనవి గ్రామ పంచాయతీ, పంచాయతీ సమితి, జిల్లా పరిషత్ వంటి మూడు అంచెల ప్రాతినిధ్య సంస్థలను ప్రవేశపెట్టింది.
  • అశోక్ మెహతా కమిటీ -1978 
  • జి.వి.కె.రావ్ కమిటీ - 1985
  • ఎల్.ఎం. సింఘ్వీ కమిటీ - 1986 లో మొదలైంది
    ఈ కమిటీలు అనేక రకాల సూచనలు ఇచ్చాయి. ఈ సూచనలు వాస్తవానికి 73, 74 రాజ్యాంగ సవరణలకు , మార్గదర్శకత్వం వహించాయి. వీటిలో ఎల్.ఎం. సింఘ్వీ కమిటీ ఎంతో ప్రధానమైనది. పంచాయతీ సంస్థలకు రాజ్యాంగ పరమైన గుర్తింపుకు ఇచ్చి వాటి ఔన్నత్యాన్ని సమగ్రతని కాపాడాలని, సింఘ్వీ కమిటీ సూచించింది.

గ్రామీణ, పంచాయతీరాజ్ సంస్థలు 73వ రాజ్యాంగ సవరణ చట్టం అంటే ఏంటి?

    1992 పరిచయం : రాజ్యాంగం (73వ సవరణ) చట్టం (The Constitution(73rd amendmeny) act 1992) ఏప్రిల్ 24 1993న అమలులోకి వచ్చింది. పంచాయతీలు The Panchaya అనే ఒక ప్రధాన శీర్షికతో (243, 243-ఎ నుంచి 243-0 అనే ప్రకరణలతో) ఈ రాజ్యాంగ సవరణ చట్టం భారత రాజ్యాంగంలో 9వ భాగాన్ని చేర్చింది.

రాజ్యాంగం (73వ సవరణ) చట్టం 1992 ప్రధానాంశాలు

    భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో 73వ రాజ్యాంగ సవరణ చట్టం ఎంతో ముఖ్యమైంది. గ్రామస్థాయిలో, మాధ్య మిక స్థాయిలో, జిల్లా స్థాయిలో ఉన్న మూడంచెల పాలనగల పంచాయతీరాజ్ సంస్థలను ఈ చట్టం వ్యవస్థీకరించింది.

చట్టం ప్రధానాంశాలు

నిర్వచనాలు (243వ ప్రకరణ)

    గ్రామసభ పంచాయతీలో జిల్లా మొదలైన అనేక పదాలను ఈ చట్టంలో వివిధ సందర్భాల్లో వాడారు. ఈ పదాల నిర్వచనాలు 243వ ప్రకరణలో ఉన్నాయి.
  • గ్రామసభ (243 - ఎ) : ఈ చట్టం ప్రకారం గ్రామ స్థాయిలో ఒక గ్రామసభ ఉంటుంది. ఇది తన అధికారా లను శాసనసభ నిర్దేశించిన విధంగా చలాయిస్తుంది.
  • పంచాయతీ వ్యవస్థ (243 - బి) : ఈ చట్టం మూడు అంచెల ఏకరూప వ్యవస్థను నిర్దేశించింది. అవి 
1.గ్రామ స్థాయి, 
2.(మాధ్యమిక) మండల స్థాయి 
3.జిల్లా స్థాయి

  • పంచాయతీ నిర్మాణం (243 - సి) : పంచాయతీల నిర్మాణం గురించి శాసనసభ తగు నిబంధ నలు రూపొందించాలని ఈ చట్టం పేర్కొంది. ప్రాదేశిక నియోజక వర్గాల ప్రాతిపదికపై పంచాయతీలకు ప్రత్యక్ష ఎన్నికలు ఉండాలని ఈ చట్టం పేర్కొంది.
  • సీట్ల రిజర్వేషన్లు (243 - డి) : షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల ప్రజాప్రతినిధులకు పంచాయతీలలో వారి జనాభాను బట్టి సీట్ల రిజర్వేషన్లు ఉండాలని ఈ చట్టం పేర్కొంటోంది. అలాగే 1/3 వంతుకు మించకుండా మహిళలకు రిజర్వేషన్లు కేటాయించాలని చట్టం పేర్కొంటోంది. 
  • పంచాయతీల కాలపరిమితి (243 ఇ) : ఈ చట్టం ప్రకారం పంచాయతీలకు కాలపరిమితి ఐదేండ్లు. కాలపరిమితికి ముందే ఒక వేళ అవి రద్దయితే వాటికి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది.
  • అర్హతలు, అనర్హతలు (243 -ఎఫ్) ; 11వ షెడ్యూల్ ద్వారా 29 అంశాలతో పంచాయతీలో కార్యకలాపాలను ఈ చట్టం నిర్ధారించింది.
  • ఆదాయ వనరులు (243 - హెచ్) : పంచాయతీ సంస్థలకు గల వివిధ ఆదాయ వనరుల గురించిమ ఈ చట్టం పేర్కొంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గ్రాంట్లు, పన్నుల ద్వారా ఆదాయం, భవనాల అద్దె మొదలైన వాటి ద్వారా ఈ సంస్థలు ఆదాయ వనరులను పొందుతాయి.
  • ఆర్థిక సంఘం (243 - ఐ) : పంచాయతీల ఆర్థిక స్థితి సమీక్షకు ఒక ఆర్థిక సంఘాన్ని చట్టం ఏర్పరిచి, తగిన విధివిధానాలను పేర్కొంటోంది.
  • లెక్కల తనిఖీ ఖాతాలు (243 - జె) : పంచాయతీల పద్దులు, వ్యయాలపై ఆడిటింగ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి తగిన అధికారం ఉంటుందని చట్టం పేర్కొంటోంది.
  • రాష్ట్ర ఎన్నికల సంఘం(243 - 3) : పంచాయతీ సంస్థల ఎన్నికల నిర్వహణ, నియంత్రణ, పర్యవేక్షణ మొదలైన అధికారాలను రాష్ట్ర ఎన్నికల సంఘం కలిగి ఉంటుందని ఈ చట్టం పేర్కొంటోంది.
  • కేంద్రపాలిత ప్రాంతాలలో పంచాయతీలు ( 243 - ఎల్) : ఈ చట్టం ప్రకారం కేంద్ర పాలిత ప్రాంతాలలో పంచా యతీల ఏర్పాటు రద్దులకు సంబంధించిన వ్యవహారాలు మొదలైనవి రాష్ట్రపతి ఆదేశాల ప్రకారం ఉంటాయి.
  • కొన్ని ప్రాంతాల మినహాయింపు (243 - ఎం) : షెడ్యూల్ ప్రాంతాల పరిపాలక మండళ్ళు ఉన్న రాష్ట్రాలలో పంచా యతీ రాజ్ సంస్థల ఏర్పాటుకు కొన్ని మినహాయింపులు ఉంటాయని ఈ చట్టంలో పొర్కొన్నారు.
  • కొన్ని చట్టాల కొనసాగింపు (243 - ఎన్) : ఈ చట్టం ప్రకారం అమలులోకి రాకముందు వాడుకలో ఉన్న చట్టాలన్నీ శాసనసభ ప్రత్యేకంగా రద్దు చేయక పోతే అవి కొనసాగుతాయని ఇందులో పేర్కొన్నారు. 
  • న్యాయస్థానాల జోక్యం లేదు (243  : ఒ) : పంచాయ తీకి సం బంధించిన శాసనాల ఔచిత్యం ఎన్నికల వ్యవ హారాలు మొదలైనవి ప్రశ్నిస్తూ ఎలాంటి దావాలను కూడా న్యాయస్థానంలో దాఖలు చేయవద్దని చట్టం పేర్కొంది.

పంచాయతీల అధికారాలు, హక్కులు, బాధ్యతలు 73వ రాజ్యాంగ సవరణ చట్టం, 1992  రాజ్యాంగంలో 243-జి ప్రకరణ ద్వారా 11వ షెడ్యూల్ ను చేర్చింది. ఇందులో పంచాయతీ సంస్థల ప్రధాన విధులు, హక్కులు, అధికారాలు 29 ఉన్నాయి. అవి..
  • - వ్యవసాయం, వ్యవసాయ విస్తరణ
  • - భూసారాన్ని పెంపొందించడానికి చర్యలు తీసుకోవడం, భూ సంస్కరణలు అమలు 
  • - చిన్ననీటి పారుదల, నీటి నిర్వహణ - జంతువుల సంరక్షణ, కోళ్ళు పెంపకం, పశు సంరక్షణ
  • - ఉపాధి కోసం చేపల పెంపకం
  • - సామాజిక అడవుల నిర్వహణ 
  • - అటవీ ఉత్పత్తులు
  • - చిన్న తరహా పరిశ్రమలు 
  • - రోడ్ల వంతెనలు, ఇతర ప్రసార మార్గాలు 
  • - గ్రామీణ విద్యుత్, విద్యుత్ పంపిణీ 
  • - సాంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి 
  • - పేదరిక నిర్మూలన పథకం 
  • - ప్రాథమిక సెకండరీ స్థాయి విద్య 
  • - సాంకేతిక శిక్షణ, వృత్తి విద్య 
  • - అనియత విద్య
  • - ఖాదీ, గ్రామీణ, కుటీర పరిశ్రమలు 
  • - గ్రామీణ ఇండ్ల నిర్మాణం 
  • - గ్రామీణ ప్రజలకు చక్కటి తాగునీటి సరఫరా 
  • - ఇంధనం, పశుగ్రాసం
  • - గ్రంధాలయాలు
  • - సాంస్కృతిక కార్యక్రమాలు
  • - మార్కెట్ సంఘాల నిర్వహణ
  • - ఆరోగ్యం, పారిశుధ్యం, వైద్యశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్వహణా బాధ్యత 
  • - కుటుంబ సంక్షేమం త స్త్రీ శిశు సంక్షేమం 
  • - సాంఘిక సంక్షేమం, వికలాంగుల సంక్షేమం 
  • - బలహీన వర్గాల సంక్షేమం, అందులోనే ముఖ్యంగా షెడ్యూల్డ్ కులాలు, తెగల వారి సంక్షేమం 
  • - ప్రజాపంపిణీ వ్యవస్థ నిర్వహణ 
  • - సామాజిక ఆస్తుల నిర్వహణ 
  • - విధంగా 73వ రాజ్యాంగ చట్టం చక్కని పరిపాలనా వికేంద్రీకరణకు ఆదర్శపరమైన మైలురాయి అని చెప్పవచ్చు. అయితే ఈ వ్యవస్థ ఏ విధంగా ఆచరణలో ఉన్నది లేనిది పరిశీలించడం అవసరం.

గ్రామీణ, పంచాయతీ రాజ్ సంస్థలు, ఒక పరిశీలన

73వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఏర్పడిన పంచాయతీరాజ్ సంస్థలలో మూడు మూడు అంచెలు ఉంటాయి. వీటి నిర్మాణా నికి, నిర్వహణకు కావాల్సిన శాసనాలను రాష్ట్ర శాసనసభ చేస్తుంది. 73వ రాజ్యాంగ సవరణ చట్టాన్ని అనుసరించి రాష్ట్రాలలో మూడంచెల ప్రభుత్వాలు ఉంటాయి.

అవి.. 
  • 1. గ్రామ పంచాయతీ
  • 2. మండల పరిషత్ (మాధ్యమిక స్థాయి వ్యవస్థ) 
  • 3. జిల్లా పరిషత్

గ్రామ పంచాయతీ : పంచాయతీ రాజ్ సంస్థలలో గ్రామ పంచాయతీ మూల స్థంభం వంటిది. సాధారణంగా ఒక గ్రామం లేదా కొన్ని చిన్న గ్రామాలు కలిసి గ్రామ పంచాయతీగా ఏర్పడతాయి. ప్రధానంగా గ్రామ పంచాయతీలో నాలుగు ప్రధానాంశాలు ఉంటాయి. అవి.. 1. పంచాయతీ 2. సర్పంచ్ 3. గ్రామసభ 4. సెక్రటరీ
పంచాయతీ అనేది గ్రామస్థాయిలో గ్రామ అనుబంధ విషయాలపై చర్చా వేదికగా వ్యవహరిస్తుంది. సర్పంచ్, వార్డు సభ్యులు, దీనిలో ఉంటారు. వీరిని గ్రామంలోని రిజిస్టర్ ఓటర్లు ప్రతి ఐదేండ్ల కొకసారి ఎన్నుకుంటారు. సర్పంచ్ గ్రామపంచాయతీ రాజకీయ కార్యనిర్వాహక అధిపతి. ఇతను పంచాయతీ ఆమోదించిన తీర్మానాలను పర్యవేక్షిస్తాడు. గ్రామ పంచాయతీలోని గ్రామ సభలో గ్రామంలోని రిజిస్టర్ ఓటర్లు సభ్యులుగా ఉం టారు. వీరు గ్రామానికి సంబంధించిన నివేదికనలను పరిశీలిస్తారు.

ప్రధాన విధులు : తాగునీరు, వ్యవసాయ విస్తరణ, నీటి పారుదల, పారిశుధ్యం వంటి ప్రజాప్రయోజన వ్యవహారాలను నిర్వహించే బాధ్యత గ్రామపంచాయ తీలకు ఉంది. రాజ్యాంగంలోని 11వ షెడ్యూల్ లో గ్రామ పంచాయతీలకు గల అధికారాలు, విధులు ప్రస్తావనలో ఉన్నాయి. సాధా రణంగా ప్రజలకు అవసరమైన అభివృద్ధి, సంక్షేమ విధులను నిర్వహించే బాధ్యత గ్రామ పంచాయతీలకు ఉంటుంది. 

మండల పరిషత్ (మాధ్యమిక స్థాయి వ్యవస్థ)

 పంచాయతీ రాజ్ వ్యవస్థలో రెండవది మండల పరిషత్. దీనికి వివిధ రాష్ట్రాలలో వివిధ రకాల పేర్లు న్నాయి. కొన్ని పంచాయతీలను కలిపి మండల పరిషత్ ని ఏర్పాటు చేస్తారు. ఈ వ్యవస్థ చిన్న రాష్ట్రాలలో ఉండక పోవచ్చు. ఈ వ్యవస్థలోని
ప్రధానాంశాలు మూడు.. 
  • 1. మండల పరిషత్ (ఇది శాసన బద్దమైన సంస్థ) 
  • 2. మండల పరిషత్ అధ్యక్షుడు (ఇతడు పరిషత్ కు రాజకీయ అధిపతి) 
  • 3. మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఇతడు పరిషత్ కు పరిపాలనా అధిపతి)
గ్రామ పంచాయతీ నిర్వహించే వివిధ కార్యకలాపాలను సమన్వయం చేసే ప్రధానమైన అధికారాలు మండల పరిషత్తు ఉంటాయి.

Close