-->

బుద్ధం శరణం గచ్ఛామి ఎందుకు అంటారు? | బుద్ధం శరణం గచ్ఛామి | Life Of Buddha | Why is the Buddha's refuge called Gachchami?

Also Read

[ యుద్ధంవల్ల కంటే శాంతి, సామరస్యాల వల్ల ఎంతో మేలు జరుగుతుందని బుద్ధ భగవానుడు నిరూపించాడు. అది ఎలా జరిగిందో బుద్ధం శరణం గచ్చామి చదివితే తెలుస్తుంది. ]

    కంబోడియా, లావోస్ అనే రెండు ఇరుగుపొరుగు దేశాలు తమలో తాము యుద్ధ ప్రయత్నాలు చేస్తూ ఉండేవి. రెండు దేశాల మధ్య పారే ఒక నదిని గురించి వచ్చిన తగాదా అది. నది పేరు 'మీకాంగ్'. అది లావోస్లో పుట్టి కంబోడియా గుండా ప్రవహిస్తూంది.
    ఆ నది రెండు దేశాలకూ చాలా ముఖ్యమైంది. మనకు గంగానది ఎంత పవిత్రమో వారికి ‘మీ కాంగ్' నది అంత పవిత్రమైంది. అసలు 'మా గంగా' (తల్లి గంగ) నుండి 'మీకాంగ్' శబ్దం ఏర్పడిందని అంటారు.
    రెండు దేశాల ప్రజలూ ఆ నదిని తల్లిలా పూజిస్తూండేవారు నది నీటివల్ల రెండు దేశాల పొలాలూ సస్యశ్యామలంగా ఉండేవి. ఎటు చూసినా పచ్చదనం కన్నుల పండువు చేసేది. రెండు దేశాలూ సుభిక్షంగా ఉండేవి. రెండు దేశాలూ 'మీకొంగు'ను తమ జీవనదాతగా భావించేవి. రెండు దేశాలూ ఆ నది పైన తమ తమ అధికారాన్ని ప్రక ఆ టిస్తూ దాన్ని పూర్తిగా కైవసం చేసుకోవాలని అనుకొన్నాయి.
    ఈ సమస్యతో ఆ దేశాల మధ్య పరిస్థితి విషమించింది. ఎంత విషమించిందందే వారు ఒకరితో ఒకరు యుద్ధానికి సిద్ధపడి సేనలతో తరలివచ్చి ఎదురెదురుగా నిలిచారు.
    ఆ సమయంలో బుద్ధ భగవానుడు అక్కడికి వచ్చాడు. ఆయన యద్ధానికి సిద్ధపడిన రెండు దేశాల సైన్యాలనూ చూశాడు. అకస్మాతుగా బుద్ధ భగవానుని రాకకు రెండు దేశాల సైన్యాలలోనూ సంచలనం బయలుదేరింది.
    బుద్ధుడు ఇరు దేశాల రాజులనూ, మంత్రులనూ ఇతర అధికారు లనూ తనవద్దకు రమ్మన్నాడు. రెండు సైన్యాల మధ్యా నిలబడి ఆయన బిగ్గరగా ప్రశ్నించాడు. “ మీరు ఎందుకు యుద్ధం చేయబోతున్నారు?"
“మా జీవనాధారమైన 'మీకాంగ్' నది నీరు కోసం.” బుద్ధ భగవానుని ప్రశ్నకు ఆ జవాబు వచ్చింది. 
'నది నీరు', 'మానవ రక్తం' ఈ రెండింటిలో ఏది విలువైనది? అని మళ్ళీ ప్రశ్నించాడు బుద్ధ భగవానుడు.
'మానవుని రక్తం నది నీరు కంటే ఎన్నో రెట్లు విలువైనది' అని ఒకేసారి ఇరు వైపులనుండి జవాబు వచ్చింది.
    అలా అయితే మరి మీరు తక్కువ విలువ గల నీటి కోసం సర్వాధిక మూల్యమైన రక్తాన్ని ఎందుకు ప్రవహింప చేయాలనుకుంటు న్నారు?" బుద్ధుడు మళ్ళీ ప్రశ్నించాడు.
“మా జీవనానికి 'మీకాంగ్' నది నీరు ఎంతయినా అవసరం" ఆని ఇరువైపుల నుంచి జవాబు వచ్చింది.
'మీరు జీవించాలనుకుంటున్నారు కదా, మరి చావు కెందుకు సిద్ధ పడుతున్నారు' బుద్ధుడు ప్రశ్నించాడు.
    ఇరుదేశాల ప్రధానమంత్రులూ ఇలా జవాబిచ్చారు: 'స్వామీ! ఇరు దేశాల మధ్యా ఉన్న ఈర్ష్యవల్ల పరిస్థితి చాలా విషమించింది. . పరిష్కారం యుద్ధమే. వేరే పరిష్కారం లేదు.”
బుద్ధుడు ఇలా ప్రశ్నించాడు. 'ఈర్ష్యను ఈర్ష్యతోనే జయించా లనుకుంటే ఈర్ష్యకు అంతం ఎక్కడుంది?”

బుద్ధుని ప్రశ్నకు ఇరువైపులా శాంతి ఆవరించింది. జవాబు ఏమివ్వాలి? ఇక ముందేం చేయాలి?" అని ఇరువైపుల వారు ఆలోచనలో పడ్డారు.
బుద్ధుని శాంతి ప్రతిపాదనను కాదనడానికి వారికేమీ తోచలేదు. ఓవరికి బుద్ధ భగవానుడు చెప్పినట్లే ఆ రెండు దేశాలు ఒక శాంతి సభను ఏర్పాటు చేశాయి.
శాంతి సభ రెండు దేశాల వాదోపవాదాలనూ శ్రద్ధతో విన్నది. ఆ సభ రెండు దేశాలకూ వెళ్ళి అక్కడి పరిస్థితులను స్వయంగా చూసి అరం చేసుకుంది.
బాగా ఆలోచించిన తర్వాత తుదకు ఆ సభ ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ నిర్ణయాన్ని రెండు దేశాలూ ఒప్పుకున్నాయి. యుద్ధం ఆగిపోయింది.
వివేకంలో ఎనలేసి బలం ఉందని అందువల్లనే అంటారు. దాని ద్వారా మానవుడు హింస వల్ల సర్వనాశనం తెచ్చి పెట్టే యుద్ధాలను కూడా ఆపగలడు. శాంతితో జీవనం గడిపేటట్లు చేయగలడు.
అందుకే అంటారు 'బలంకన్న వివేకం మిన్న' అని

Close