-->

ఆర్ధికవృద్ధి, ఆర్థికాభివృద్ధి మధ్య తేడాలు వివరించండి? - Explain the differences between economic growth and economic development?

Also Read

 


    ఒక ఆర్ధిక వ్యవస్థ సాధించిన వస్తు సేవల మొత్తం పెరుగుదలను ఆర్ధిక వృద్ధి అంటారు. ఈ రకమైన వస్తు సేవల పెరుగుదల ఏదో ఒక సంవత్సరం కాకుండా నిరంతరం దీర్ఘకాలం పాటు కొనసాగవలెను. తాత్కాలికంగా, అకస్మాత్తుగా పొందిన వస్తు సేవల పెరుగుదల ఆర్ధిక వృద్ధి అని పిలువబడదు. ఉదాహరణకు వ్యవసాయ ఉత్పత్తులు ఒక సంవత్సరం పెరిగి, తరువాత సంవత్సరాలలో పెరగకపోతే, దానిని ఆర్ధిక వృద్ధి అనలేం. కాబట్టి ఒక దేశం దీర్ఘకాలం పాటు వస్తు సేవల ఉత్పత్తిలో నిరంతరం సాధించిన పెరుగుదలను ఆర్ధిక వృద్ధి అని చెప్పవచ్చు.
    అనగా వస్తు సేవల పరిమాణంలో పెరుగుదల లేనప్పటికీ, కేవలం ధరల పెరుగుదల విలువల పెరుగుదలకు దారితీస్తున్నది. దీనిని బట్టి ఆర్ధికవృద్ధి అనగా వస్తురాశి విలువల పెరుగుదల కాదు. దీర్ఘకాలం పాటు వస్తూత్పత్తి రాశి పరిమాణంలో గోచరించే పెరుగుదల అని గ్రహించాలి.

Close