-->

అర్థశాస్త్రానికి గల కొరత నిర్వచనాన్ని వివరింపుము. దానికి గల లోపాలను వ్రాయుము? - Explain the definition of scarcity in economics. Write down the flaws in it?

Also Read


    లయోనల్ రాబిన్స్ 1932 ప్రచురించిన తన గ్రంధం “Nature and significance of economic science” అర్థశాస్త్రానికి కొరత నిర్వచనాన్ని ఇచ్చాడు. రాబిన్స్ ప్రకారం "మానవుని అపరిమితమైన కోరికలకు ప్రత్యామ్నాయ ప్రయోజనాలున్న పరిమిత సాధనాలకు ఉండే సంబంధం పట్ల మానవ ప్రవర్తన అధ్యయనమే అర్థశాస్త్రం.”
ఈ నిర్వచనం మూడు అంశాలపై ఆధారపడి ఉంది. అవి
  1. అపరిమితమైన కోరికలు
  2. పరిమితమైన వనరులు
  3. ప్రత్నామ్నాయ ప్రయోజనాలున్న వనరులు
రాబిన్స్ నిర్వచనం ప్రకారం " కొరత ఉన్న పరిస్థితులలో మానవ ప్రవర్తనను పరిశీలించేదే అర్థశాస్త్రం”గా పేర్కొన్నాడు.
విమర్శ :
  1. రాబిన్స్ నిర్వచనం మారుతున్న సమాజానికి వర్తించదు. కాలం మారేకొద్దీ, సంభవించే మార్పుల వల్ల వనరుల కొరత అనే సమస్యను అధిగమించే వీలు ఉంటుంది.
  2. ఆధునిక అర్థశాస్త్రానికి సంబంధించిన ఆర్థిక వృద్ధి, ఆర్థికాభివృద్ధి అనే ముఖ్యాంశాలను కొరత నిర్వచనంలో చర్చించలేదు.
  3. రాబిన్స్ అర్థశాస్త్రాన్ని ఒక విజ్ఞాన శాస్త్రంగా పరిగణించటాన్ని విమర్శకులు అంగీకరించలేదు.
  4. అర్ధశాస్త్రం మానవ సంక్షేమానికి తోడ్పడేదిగా ఉండాలని విమర్శకుల అభిప్రాయం.

Close