-->

అర్థశాస్త్రానికి గల శ్రేయస్సు నిర్వచనాన్ని వివరింపుము. దీని లోపాలేవి? - Explain the definition of prosperity in economics. What are its shortcomings?

Also Read


    Alfred Marshall 1890 లో ప్రచురించబడిన తన "ప్రిన్సిపుల్స్ ఆఫ్ ఎకనామిక్స్” అనే గ్రంధంలో అర్థశాస్త్రాన్ని “మానవుడు, అతని శ్రేయస్సు గురించి చర్చించే శాస్త్రం” గా నిర్వచించాడు. మార్షల్ సంపదకు బదులు శ్రేయస్సుకు అధిక ప్రాధాన్యత ఇచ్చాడు. మార్షల్ తో పాటు బెవరిడ్జ్, కానన్ మరియు పిగోలు కూడా అర్థశాస్త్ర నిర్వచనంలో "శ్రేయస్సు” అనే భావానికి ప్రాధాన్యత ఇచ్చారు.

శ్రేయస్సు నిర్వచనంలోని ముఖ్యాంశాలు :

  1. సంపదకన్నా మానవ శ్రేయస్సుకు ఈ నిర్వచనం అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఆర్థిక కార్యక్రమాలు.
  2. భౌతిక వస్తువులు మాత్రమే శ్రేయస్సును పెంచుతాయి.
  3. మార్షల్, పిగోల ప్రకారం, భౌతిక శ్రేయస్సును పెంపొందించే కార్యక్రమాలే
విమర్శ : శ్రేయస్సు నిర్వచనం కొంత కాలం పాటు మెరుగైనదిగా భావించబడినప్పటికీ, ఆధునిక ఆర్థిక వేత్తలు దీనిని విమర్శించారు. 
అవి:
  1. మార్షల్ నిర్వచనంలో ముఖ్యంగా భౌతిక వస్తురాశి నుండి పొందే శ్రేయస్సుకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వటాన్ని రాబిన్స్ ఖండించాడు.
  2. మార్షల్, సంఘటిత సమాజంలోని మానవులను మాత్రమే లెక్కలోనికి తీసుకుని, ఇతరులను పట్టించుకోలేదు.
  3. మౌలిక సమస్య అయిన 'వనరుల కొరత' ను ఈ నిర్వచనం పరిగణలోకి తీసుకోలేదనేది మరొక విమర్శ. 
  4. శ్రేయస్సు అనే దానిని పరిమాణాత్మకంగా కొలవలేమనేది మరో విమర్శ.

Close