-->

AP MPTC ZPTC Election Results 2021 || ZPTC, MPTC ఎన్నికల ఫలితాలు సెప్టెంబర్ 19 న ||

Also Read

 

Andhra Pradesh :రాష్ట్రంలో ఏప్రిల్ 8 న జరిగిన MPTC మరియు ZPTC ఎన్నికల ఫలితాలను ప్రకటించడానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో, రాష్ట్ర ఎన్నికల సంఘం సెప్టెంబర్ 19 న ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలను అదే రోజు ప్రకటిస్తుంది.

100 మీ పరిధిలో 144 సెక్షన్

AP: రేపు జరిగే ZPTC, MPTC ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేందుకు పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేయాలని CS ఆదిత్యనాథ్.. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించారు కౌంటింగ్ కేంద్రాలకు 100 మీ పరిధిలో 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించి.. పోలీసు బలగాలను మోహరించాలని సూచించారు. భద్రతా పర్యవేక్షణకు జిల్లా అధికారిని ఇన్ ఛార్జ్ గా నియమించాలని తెలిపారు. అటు శాంతిభద్రతల పరిరక్షణకు అదనపు బలగాలు వినియోగించనున్నారు.

'విధులకు డుమ్మా కొట్టారో.. అంతే'

కర్నూలు: కర్నూలు జిల్లాలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్ నకు కేటాయించిన సిబ్బంది తప్పనిసరిగా విధులకు హాజరు కావాలని శుక్రవారం కర్నూలు నగరంలోని కలెక్టరేట్లో కలెక్టర్ పి కోటేశ్వరరావు అధికారులను ఆదేశించారు. ఎన్నికల విధులకు హాజరు కాని వారిపై ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.

Close