-->

What are Navarasaalu? నవరసాలనగా ఏవి ?

Also Read

What are Navarasaalu?,నవరసాలనగా ఏవి ?


        రసం ఒక భావోద్వేగ స్థాయి (emotional state). ప్రాచీన భారత దేశపు భరతముని తన నాట్య శాస్త్రం లో ఎనిమిది రసాలను నిర్వచించారు. ఈ రసాలను సాధించే కళాకారుడు ఒక్కో రసం ద్వారా (వలన) ఒక్కో భావాన్ని ప్రేక్షకులలో సృష్టించగలుగుతాడు. తరువాత అవసరాన్ని బట్టి వాడుకోటానికి అనుగుణంగా ఈ ఎనిమిదింటికీ శాంత రసాన్ని ఉపగుప్తుడు జోడించాడు. నటనకూ నాట్యానికీ సమానంగా ఉపయోగ పడే ఈ రసాలు ఈనాటికీ మన భారతీయ కళలకు మూలాధారం. ప్రతీ కళాకారుడూ ఈ రసాలను ఎరిగి ఉండటం ఎంతైనా అవసరం. ఈ రసాలను సాదించటాన్ని రసాభినయం అంటారు. ఈ రసాలు సాహిత్యము లోనే కాదు .. మనస్సులోనూ ఉంటాయి . ఏదైనా ఆపద కలిగితే మనము దు:ఖిస్తాము. మంచివిషయము సంభవించినపుడు సంతోషిస్తాము . . మన ముఖాలు నవ్వుతూ ఉంటాయి. ఒకపామో , మరేదైనా క్రూరమృగమో కనబడితే భయము తో వణికిపోతాం. ఏదైనా అన్యాయము గానీ , అత్యాచారము గానీ మనకళ్ళ ఎదుట జరిగితే కోపగ్రస్తులమవుతాం. ఏదైనా విచిత్రమైన అకటవికటపు దృశ్యము చూస్తే విరగబడి నవ్వుతాం . భగవంతుని దర్శించినపుడు శాంతంగా కదలక మెదలక నిలుచుంటాం . జీవతములో రసాలన్నీ అనుభవంలో ఉన్నవే .

నవరసాలు :

1. శృంగారం 2.హాస్యం 3.కరుణ 4.రౌద్రం 5.వీరం 6.భయానకం 7.భీభత్సం 8.అద్భుతం 9.శాంతం.

1.        శృంగారం: ఇది రతి అనే స్థాయీభావం నుండి పుడుతుంది.సౌందర్యం శృంగారంలో ప్రధానమైన అంశం.అందంగా ఉన్న వాటికి మనసు హత్తుకుపోతుంది. ఇవి రెండు రకాలుగా ఉత్పన్నమవుతుంది

a). సంయోగం - సంయోగం అంటే కలయిక

b). వియోగం - వియోగం అంటే ఎడబాటు…

2.      హాస్యం : ఇది హాసం అనే స్థాయీభావం నుండి పుడుతుంది.ఇది రెండు రకాలు

a). ఆత్మస్థ = తాను నవ్వటం

b). పరస్థ = ఇతరులను నవ్వించటం

నవ్వు ఆరు రకాలుగా ఉంటుంది. అవి

A). స్మితము (Gentle Smile) : చెక్కిళ్లు లేతగా వికసించి పలువరుస కనబడకుండా గంభీరంగా ఉండే నవ్వు.

B). హసితము (Smile) : చెక్కిళ్లు వికసించి, పలువరుస కొంచెంగా కనిపిస్తుండే నవ్వు.

C). విహసితము (Laughter) : సమయోచితమైన నవ్వు.ముఖం ఎరుపెక్కి పలువరుస కనిపిస్తూ శిరస్సు ముడుకుని ఉంటుంది.

D). ఉపహసితము (Laughter with ridicule) : ముక్కుపుటాలు విప్పారి.చూపులు వక్రంగా ఉండే నవ్వు.

E). అపహసితము (Uprorious Laughter) : ఏడుపు వస్తున్నప్పుడు వచ్చే నవ్వు.

F). అతిహసితము (Convulsive Laughter) : నవ్వు పెద్దదయినపుడు వచ్చే ఆనందబాష్పాలు.స్వరం మారటం,చేతులు కదలడం దీనిలో గమనించవచ్చు.

 

3.      కరుణ : ఇది శోకం అనే స్థాయీభావం నుండి పుడుతుంది.ఇవి మూడు రకాలు.

A). ధర్మోపగతము : కరుణ దండన నుండి పుడుతుంది

B). అర్ధోపచేయము : ధననష్టం వల్ల కలుగుతుంది.

C). శోకం : ఇష్టజనుల వియోగం వల్ల కలుతుంది.

4.      రౌద్రం : క్రోధం అనే స్థాయీభావం నుండి పుడుతుంది.రాక్షస ప్రకృతులకు సంబంధించినది.సంగ్రామం వల్ల పుడుతుంది.చేయిదాటిపోయిన వికారస్థితి ఇది.

A). క్రోధం,ఆధర్షణము(ఇతరుల భార్యలను చెరచటం వల్ల కలిగేది),

B). అధిక్షేపం (దేవ,జాతి,అభిజన,,విద్య,కర్మలను నిందించటం వల్ల కలిగేది)

C). అవమానం,అసత్యవచనం,ఉపఘాతం ,పనివారిని బాధించడం వల్ల కలిగేది),

D). వాక్పారుష్యం,e.అభిద్రోహం (హత్యాప్రయత్నం),

E). అసూయ. వీటి వల్ల కలుతుంది.

5.      వీరం : ఉత్సాహం అనే స్థాయీభావం నుండి పుడుతుంది.ఇది మూడు రకములు.ఆలోచన ఆధిపత్యం కలిగివున్న ఉన్నత ప్రకృతికి చెందిన స్థితి ఇది.

》దాన వీరము

》దయా వీరము

》యుద్ధ వీరం.

》అసంమోహం (కలత చెందకుండటం).

》అధ్యవసాయం ( పట్టుదల).

》నయము (సంధి,విగ్రహాల ప్రయోగం).

》వినయం (ఇంద్రియ జయం),

》బలం (చతురంగ బలం కలిగివుండటం).

》పరాక్రమం (శతృవుల జయించటం).

》శక్తి ( యుద్ధాదులయందు సామర్ధ్యం).

》ప్రతాపం (శతృవులకు సంతాపం కలిగించే ప్రసిద్ధి).

》ప్రభావం (అభిజన,ధన,మంత్రి సంపద) వల్ల ఉత్సాహం కలుగుతుంది.

6.      భయానకం : ఇది భయం అనే స్థాయీభావం వల్ల కలుగుతుంది.అపరాధం వల్ల,మోసం వల్ల,హింస వల్ల కలుగుతుంది.ఇవి రెండు రకములు

A). స్వభావసిద్ధమైనది

B). కృత్రిమమైనది

7.      భీభత్సం : జుగుప్స అనే స్థాయీభావం నుండి పుడుతుంది. కోపంఅయిష్టంవిసుగుఅసహ్యం వల్ల జుగుప్స కలుగుతుంది.

8.      అద్భుతం : ఇది విస్మయం అనే స్థాయీభావం నుండి పుడుతుంది.దైవ సంబంధిత విషయాలు,మహాత్ముల దర్శనం,ఇంద్రజాల,మహేంద్రజాలాదులను ప్రత్యక్షంగా డటంవల్ల…మనోవాంఛలు తీరటం వల్ల ఈ రసానుభవం కలుగుతుంది.

9.      శాంతం : ఇది శమము అనే స్థాయీభావం వల్ల కలుగుతుంది.తత్వఙ్ఞానం,వైరాగ్యం,ఆశయ శుద్ధి వల్ల ఇది జన్మిస్తుంది.మోక్షము పట్ల ఆసక్తి కలిగిస్తుంది.

Close