-->

ఎటువంటి జీవులు లైంగిక & అలైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకుంటాయి?

Also Read

ప్రత్యుత్పత్తి - పునరుత్పాదక వ్యవస్థ

ఈ భూగోళంపై ఒక జాతియొక్క లక్షణాలు శాశ్వతంగా, స్థిరంగా కొనసాగడానికి కారణమవడానికి ఉపయోగపడే ప్రక్రియ ప్రత్యుత్పత్తి, 'ఒకజీవి తన జీవితకాలంలో తనను పోలిన మరోతరం పిల్లజీవులను ఉత్పత్తి చేయడాన్ని 'ప్రత్యుత్పత్తి' అంటారు.
ఇది రెండు రకాలు...
1. లైంగిక ప్రత్యుత్పత్తి 2. అలైంగిక ప్రత్యుత్పత్తి

లైంగిక ప్రత్యుత్పత్తి : అభివృద్ధి చెందిన జీవులైన వానపాములు, చేపలు, కప్పలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలలో జరుగుతుంది. బీజకణాల కలయిక వల్ల, అనగా అండం, శుక్రకణాల కలయిక  వల్ల ఈ ప్రక్రియ జరుగుతుంది. తద్వార జన్యుపదార్థం మార్పిడి జరిగి, కొత్త జీవులు ఏర్పడతాయి. ఇందులో జరిగే విభజన క్షయీకరణ విభజన. లైంగిక ప్రత్యుత్పత్తి వల్ల పర్యావరణంలో జీవవైవిధ్యం సాధ్యమవుతుంది. జీవపరిణామం జరుగుతుంది.
అలైంగిక ప్రత్యుత్పత్తి : ఇది ప్రోటోజోవా, పొరిఫెరా, సీలెంటిరేటా వంటి నిమ్నజాతి జీవుల్లో జరుగుతుంది. బీజకణాల కలయిక లేకుండానే ఒకే తల్లి నుంచి పిల్లజీవులు ఏర్పడతాయి. ఇందులో జన్యుపదార్థం మార్పిడి జరగదు. కావున ఏర్పడిన పిల్లజీవులు పూర్తిగా తల్లిజీవులను పోలి ఉంటాయి. అంటే జన్యుసమాన ప్రతిరూపాలు ఏర్పడతాయి. వీటిని 'క్లోన్స్' అంటారు. ఇందులో జరిగే విభజన సమవిభజన. అలైంగిక ప్రత్యుత్పత్తి మూడు రకాలుగా విభజించవచ్చు. అని

1) ద్విదావిచ్ఛిత్తి
2) కోరకీభవనం
3) బహుదా విచ్ఛిత్తి
ద్విదావిచ్ఛిత్తి : ఒక జీవి సమానంగా విచ్ఛిత్తిని పొంది రెండు సమరూప పిల్లజీవులను ఏర్పరుస్తుంది. దీనిని ద్విదావిచ్ఛిత్తి అంటారు.
ఉదా : అమీబా, పారామీషియం, యూగ్లీనా, బ్యాక్టీరియా,
కోరకీభవనం : జీవి శరీరంలో కింది పార్శ్వభాగం నుంచి చిన్న బుడిపె ఏర్పడి అది పెరిగి పిల్లజీవిగా మారి, స్వతంత్రంగా జీవిస్తుంది. దీనిని కోరకీభవనం అంటారు.
ఉదా : ఈస్ట్, హైడ్రా.
బహుదావిచ్చిత్తి : ఒక తల్లిజీవి అనేక ముక్కలుగా విచ్ఛిత్తి చెంది, అనేక పిల్లజీవులను ఏర్పరుస్తుంది.
ఉదా : అమీబా
క్షీరదాల ప్రత్యుత్పత్తి వ్యవస్థ : ఇందులో స్త్రీ, పురుష ప్రత్యుత్పత్తి నిర్మాణాలు ఉంటాయి.
స్త్రీ ప్రత్యుత్పత్తి నిర్మాణాలు : ఒక జత స్త్రీ బీజకోశాలు, ఒక జత ఫాలోపియన్ నాళాలు, గర్భాశయం ఉంటుంది. వీటి అధ్యయనాన్ని 'గైనకాలజీ' అంటారు. కౌమారదశ చేరేసరికి స్త్రీలో ఈస్ట్రోజన్, ఎల్ హెచ్, ఎస్ఎస్పీచ్ అనే హార్మోన్ల స్రావం వల్ల ప్రతినెలా స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో అనేక మార్పులు జరుగుతాయి. దీనివల్ల 'ఋతుచక్రం' ప్రారంభమవుతుంది. యుక్తవయస్సులో ఋతుచక్రం ప్రారంభం కావడాన్ని 'మోనార్క్' అనీ, 45-55 సంవత్సరాల కాలంలో ఋతుచక్రం శాశ్వతంగా ఆగిపోవడాన్ని 'మెనోపాజ్' అనీ అంటారు. బీజకోశాలలో ఉండే ప్రత్యేక నిర్మాణాలు 'గ్రాఫియన్ పుటికలు' ఋతుచక్రం జరిగిన తర్వాత 14వ రోజున గ్రాఫియన్ పుటికలు పగిలి, ఒక అండం విడుదల కావడాన్ని 'అండోత్సర్గం' అంటారు. పగిలిన గ్రాఫియన్ పుట్టికలను 'కార్పస్ ల్యుటియం' అంటారు. సాధారణంగా స్త్రీలలో ప్రతి 28 రోజులకూ ఒకసారి 'ఋతుచక్రం' జరుగుతుంది. అండం కేంద్రకాన్ని కలిగి ఉండి, 23 క్రోమోజోములతో మాత్రమే ఉంటుంది. ఇలా ఉండటాన్ని ఏకస్థితి అంటారు.

పురుష ప్రత్యుత్పత్తి నిర్మాణాలు : ఒక జత ముష్కాలు వాటికి అనుబంధంగా పౌరుష గ్రంధులు ఒక సంచివంటి నిర్మాణంలో అమరి ఉంటాయి. వీటి అధ్యయనాన్ని 'అండ్రాలజీ' అంటారు. పిల్లల్లో కొంతమందిలో ముష్కాలు సంచి వంటి నిర్మాణంలో కాకుండా ఉదర కుహరంలో ఉండిపోవడాన్ని 'క్రిష్టార్కిడిజం' అంటారు. ప్రతి ముష్కంలోనూ మెలితిరిగిన శుక్రకణాలు పరిపక్వం చెందే ఎపిడైడిమెస్' అనే నిర్మాణం ఉంటుంది. ముష్కాలు ఉండే సంచివంటి నిర్మాణాన్ని 'ప్రోటమ్' అని అంటారు. ముష్కాలు శుక్రకణాలను, టెస్టోస్టిరాన్ అనే హార్మోనను విడుదలచేస్తాయి.

శుక్రకణం : ముష్కాల నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణం శుక్రకణం. ఇది తోకకప్ప (టాడ పోల్) ఆకారంలో ఉంటుంది. జంతురాజ్యంలో ఇది అతి సూక్ష్మకణం. దీని జీవితకాలం 72 గంటలు. అంటే మూడు రోజులు మాత్రమే. దీనిలో తల, మెడ, తోక భాగాలు ఉంటాయి. తలలో కేంద్రకం ఉంటుంది. ఇది 23 జతల క్రోమోజోములును కలిగి ఉంటుంది. అంటే ఇది ఏకస్థితికం. తల ముందు భాగాన్ని 'అక్రోసోమ్' అనే తొడుగు కప్పుతూ ఉండి అండంలోకి వెళ్లడానికి సహాయపడుతుంది. శుక్రకణం చలనానికి తోక తోడ్పడుతుంది. శుక్రకణ చలనానికి కావాల్సిన ద్రవస్థితిని ఆహారాన్ని ప్రోస్టేట్ గ్రంధుల స్రావం ఉపకరిస్తుంది. వివిధ కారణాల ద్వారా ముష్కాలను తొలగించడాన్ని 'కాస్టేషన్ లేక ఆర్కిడియ్కాటమీ' అని అంటారు. పురుషుల్లో హార్మోన్ల అసమతుల్యం వల్ల క్షీర గ్రంధులు అభివృద్ధి చెందడాన్ని 'గైనకోమాస్టియా' అంటారు.

ఫలదీకరణ : ఏకృతిక శుక్రకణం, ఏకస్థితిక అండంతో సంయోగం చెంది, ద్వయ స్థితిక సంయుక్త బీజాన్ని ఏర్పరచడాన్నే 'ఫలదీకరణ' అంటారు. జీవి ఏర్పడటానికి ప్రాథమిక కణం లేదా మూలకణం 'సంయోగబీజం'. ఈ ఫలదీకరణ జీవి వెలుపల జరిగితే, దానిని బాహ్యఫలదీకరణ అంటారు.
ఉదా : కప్పలు, చేపలు.
జీవి లోపల జరిగితే దాన్ని అంతఃఫలదీకరణం అనీ అంటారు.

ఉదా: ఏనుగు, మానవుడు, సీలలో ఫలదీకరణ జరిగే ప్రదేశం 'ఫాలోపియన్ నాళం'. పిండం ఫాలోపియన్ నాళం నుంచి గర్భాశయంలోకి ప్రవేశించి దాని గోడకు ఆధారం చేసుకొని, తొమ్మిది నెలలు పెరగడాన్ని 'పిండ ప్రతిస్థాపన' అంటారు. సంయుక్త బీజం పిండంగానూ తర్వాత భ్రూణంగానూ, అనంతరం శిశువుగానూ మారుతుంది. పిండాభివృద్ధిని అధ్యయనం చేసే శాస్త్రాన్ని 'పిండోత్పత్తి శాస్త్రం' అంటారు. పిండోత్పత్తి శాస్త్ర పితామహుడు (ఫాదర్ ఆఫ్ ఎంబ్రియాలజీ)గా 'అరిస్టాటిల్'ను పిలుస్తారు. మానవ పిండోత్పత్తి శాస్త్ర పితామహుడుగా 'వాన్ఫోర్' ను, మొక్కల పిండోత్పత్తి శాస్త్ర పితామహునిగా ' స్టాక్సర్'ను, భారత మొక్కల పిండోత్పత్తి శాస్త్ర పితామహునిగా' పి.మహేశ్వరి' ని పిలుస్తారు. మానవ పిండంలోని బాహ్యత్వచం నుంచి మెదడు, నాడులు, చర్మం, మధ్యత్వచం నుంచి హృదయం, రక్తనాళాలు, అంతస్త్వచం నుంచి జీర్ణవ్యవస్థ, శ్వాసవ్యవస్థ ఏర్పడతాయి. పిండం చుట్టూ ఉండే ఉల్బము, పరాయువు అనే రెండు పొరలుంటాయి. పిండము, ఉల్బముల మధ్య ద్రవపదార్థాన్ని 'ఉల్ఫద్రవం' అంటారు. పిండం యొక్క ఆహారనాళం నుంచి అలింధము ఏర్పడుతుంది. పిండం, గర్భాశయ కణజాలాల కలయిక వల్ల 'జరాయువు ఏర్పడుతుంది. జరాయువు తల్లి గర్భాశయ గోడ నుంచి, పెరుగుతున్న పిండానికి ఆహారాన్ని, ఆక్సిజన్‌ను అందిస్తుంది. శిశువులో ఏర్పడిన వ్యర్థ పదార్థాలను బయటకు పంపిస్తుంది. పిండాభివృద్ధి సమయంలో జన్యులోపాల వల్ల వివిధ వైకల్యాలు గల శిశువులు జన్మిస్తారు. దీనికి కారణమయ్యే కారకాలను 'థెరటోజన్స్' అని అంటారు. దీని అధ్యయనాన్ని 'థెరటాలజీ' అంటారు. పిండాభివృద్ధిలో ఆరోవారంలో నాడీవ్యవస్థ, బ్లడ్ గ్రూప్, ఏడోవారంలో హృదయం, ముష్కాలు, ఎనిమిదో వారంలో హృదయస్పందన ప్రారంభమవుతాయి, చేతులూ కాళ్లూ అభివృద్ధి ప్రారంభమవుతుంది. 11వ వారంలో బొడ్డుతాడు ఏర్పడుతుంది. 16వ వారంలో కనుబొమలు, కనురెప్పలు, 17వ వారంలో వినడం, 19వ వారంలో పాలదంతాల ఉత్పత్తి, 22వ వారంలో జననాంగాల అభివృద్ధి జరుగుతుంది.

        నవజాత శిశువుల అధ్యయనాన్ని 'నియోనేటాలజీ' అంటారు. పుట్టే శిశువు లింగ నిర్ధారణ చేయడానికి చేసే పరీక్ష 'అమ్నియో సెంటసిస్' అంటారు. దీనిని 'రిచర్డ్ డెడ్ రిక్' కనుగొన్నాడు. పిండం వయస్సు 16-22 వారాలు ఉన్నప్పుడు ఈ పరీక్ష ద్వారా లింగ నిర్ధారణ చేయవచ్చు. దీనివల్ల భ్రూణ హత్యలు జరుగుతున్నాయని భారత భారత ప్రభుత్వ దీనిని నిషేధించింది. లింగనిర్ధారణ ద్వారా పుట్టే శిశువు ఆడ లేక మగ అనే విషయం తెలుసుకోవచ్చు. క్రోమోజోముల స్థితి, వైపరీత్యాలను గుర్తించి, శిశువులో ఏదైనా వైకల్యాలు ఉన్నయేమో అన్న విషయాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్యంగా ' డాన్స్ సిండ్రోమ్'ను గుర్తించవచ్చు. ఈ పరీక్షల్లో ఉల్భద్రవాన్ని పరీక్షిస్తారు. దీనిలో ముఖ్యపాత్ర వహించేది 'వై' క్రోమోజోమ్.

పురుషుల్లో శుక్రనాళాలు కత్తిరించి, వ్యతిరేక దిశలో ముడతగా చుట్టడం ద్వారా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తారు. దీనిని 'వేసక్టమీ' అంటారు. ఆడవారిలో ఫాలోపియన్ నాళాలను కత్తిరించి ముడి వేయడం ద్వారా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తారు. దీనిని 'ట్యూబెక్టమీ' ఆపరేషన్ అంటారు.

Close