-->

అంతర్జాతీయ పార్లమెంటరి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ( When is International Parliamentary Day celebrated? )

Also Read

 


            జాతీయ ప్రణాళికలు మరియు వ్యూహాలలో పార్లమెంట్ ల యొక్క ప్రాముఖ్యతను గుర్తించడానికి ఐక్యరాజ్యసమితి  అంతర్జాతీయ పార్లమెంటరి దినోత్సవం జూన్ -౩౦ న ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు.

        జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పార్లమెంట్ ల యొక్క పారదర్శకత మరియు జవాబుదారి తనం యొక్క ప్రాముఖ్యతను ఈ రోజు హైలేట్ చేస్తుంది.

 

జూన్ – ౩౦ నే ఎందుకు?

ఈ రోజు 1889-June-30 ఇంటర్ పార్లమెంటరి యూనియన్ స్థాపనను సూచిస్తుంది .

  • ప్రస్తుతం 193 దేశాల్లో
  • 79 దేశాల్లో పార్లమెంట్ రెండు సభలు కల్గివుంది
  • 114 దేశాల్లో ఒక సభ కల్గివుంది

ఇలా పార్లమెంట్ ఒకే సభతో ఉంటే దాన్ని యుని కమేరాల్ (UNI CAMERAL ) అని అంటారు.

    16 వ సుస్థిరాభివృద్ధి లక్ష్యమైన ( న్యాయం, శాంతియుత మరియు సమగ్ర సమాజాలను ప్రోత్సహించడం ) దానిని సాధించడానికి పార్లమెంట్ లు కృషి చేస్తున్నాయి.

Close