-->

భారత రాజ్యాంగ ప్రవేశిక అంటే ఏమిటి? || రాజ్యాంగ ప్రవేశిక ఎవరి నుంచి తీసుకున్నారు (What is a constitutional preamble? The constitutional preamble was taken from whom)

Also Read

 

  • ప్రపంచంలో ప్రవేశిక తయారు చేసిన మొదటి దేశం- అమెరికా.
  • రాజ్యాంగ ప్రవేశిక అనే భావనను అమెరికా రాజ్యాంగం నుండి స్వీకరించారు.
  • ప్రవేశిక మరొక పేర్లు – పీఠిక, అవతారిక.
  • భారత రాజ్యాంగంలోని ప్రవేశికను తయారు చేసిన వారు- జవహర్ నెహ్రూ.
  • భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పుడు ప్రవేశికలో సార్వభౌమ, ప్రజాస్వామ్య, గణతంత్ర అనే పదాల మాత్రమే ఉండేది. అయితే స్వరణ్ సింగ్ కమిటీ సిఫారసు ప్రకారం ప్రవేశికలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే పదాలు కొత్తగా చేర్చారు.
  • ప్రవేశికను ఇప్పటివరకు ఒక్క సారి మాత్రమే 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సవరిiంచారు.
  • ” ప్రవేశిక భారత రాజ్యాంగంలో అంతర్భాగమే” అని సుప్రీం కోర్టు కేశవానంద భారతి కేసులో తీర్పునిచ్చింది.
  • రాజ్యాంగాన్ని సవరించే అధికారం పార్లమెంట్ కి ఉంది.
  • 1946 డిసెంబర్ 13 న రాజ్యాంగ పరిషత్ నెహ్రు ప్రవేశపెట్టిన ఆశయాల తీర్మానమే ప్రవేశిక కు ఆధారం.
  • ” భారత దేశ ప్రజలమైన మేము” అనే భావన రాజ్యాంగాన్ని ప్రజలే ఆధారమని తెలుపుతుంది.
  • రాజ్యాంగ ప్రవేశిక భారతదేశాన్ని సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా ప్రకటించింది.
  • ప్రవేశికలో స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనే భావాలను ఫ్రెంచి విప్లవం నుండి గ్రహించారు.
  • ప్రవేశిక ప్రజలందరికీ ఆర్థిక రాజకీయ సామాజిక న్యాయాన్ని కల్పిస్తానని హామీ ఇచ్చింది.
  • రాజ్యాంగ ప్రవేశిక కు న్యాయస్థానాల రక్షణ లేదు.
  • రాజ్యాంగ ప్రవేశిక, పీఠిక, ప్రియంబుల్ తో ప్రారంభమవుతుంది.
  • రాజ్యాంగాన్ని ఉపోద్ఘాతం లాంటిది ప్రవేశిక.
  • రాజ్యాంగ నిర్మాతల ఆశయాలు లక్ష్యాలను తెలిపేది ప్రవేశిక.
  • రాజ్యాంగ ప్రవేశిక

    భారత దేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని

    సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి;

    పౌరులందరికీ సాంఘిక ఆర్ధిక రాజకీయ న్యాయాన్ని ;

    ఆలోచన, భావప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలలో స్వతంత్రాన్ని;

    అంతస్తులలోను, అవకాశాలలోను సమానత్వాన్ని చేకూర్చుటకు;

    వారందరిలో వ్యక్తి గౌరవాన్ని జాతీయ సమైక్యతను, సమగ్రతను సంరక్షించు సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి;

    1949, నవంబరు 26న

    మన రాజ్యాంగ పరిషత్ లో ఎంపిక చేసుకుని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే సమర్పించుకుంటున్నాను.

     

     

    సర్వసత్తాక రాజ్యం

    • అంతరంగిక బాహ్య విషయాలు విదేశీ శక్తులను లోనుగాక స్వతంత్రంగా వ్యవహరించే దేశం.
    • భారతదేశం కామన్వెల్త్ ఐక్యరాజ్యసమితిలో సభ్యదేశమైనప్పటికీ ఆ సభ్యత్వం ఐచ్చికమైనది.

    ప్రజాస్వామ్య రాజ్యం

    • భారతదేశం ప్రజాస్వామ్యం రాజ్యమని తెలిపేది ప్రవేశిక.
    • ప్రజల కొరకు, ప్రజలచేత, ప్రజల యొక్క ప్రభుత్వం ప్రజాస్వామ్యం.
    • రాజ్యాంగం ప్రజలందరికీ తారతమ్యం లేకుండా 18 సంవత్సరాలు నిండిన వయోజనులకు ఓటు హక్కు కల్పించింది.
    • కార్యనిర్వాహక వర్గం శాసనసభలకు బాధ్యత వహించాలి.
    • అధికార వికేంద్రీకరణ పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటు చేయడంలో గ్రామ స్థాయిలో కనిపిస్తుంది.

    గణతంత్ర రాజ్యం

    • ప్రజాస్వామ్య రాజ్యంలో రాజ్యాధినేత వంశపారంపర్యంగా వచ్చే రాజు/ రాణి ప్రజాప్రతినిధి ఉంటే ఆ రాజ్యం గణతంత్ర రాజ్యం అవుతుంది.
    • ఈ పదవి ఎంపికకు కుల, మత, ప్రాంతీయ, లింగ వివక్షతలుండవు.
    • ఇంగ్లాండ్ గణతంత్ర రాజ్యం కాదు.

    లౌకిక రాజ్యం

    • మత ప్రమేయం లేని రాజ్యం.
    • కొన్ని దేశాలకు రాజ్యం మతం కలదు. ఉదా : ఇస్లాం మతం – పాకిస్తాన్, రోమన్ క్యాథలిక్ మతం – ఐర్లాండ్.
    • లౌకిక అనే పదాన్ని ప్రవేశికలో 42వ రాజ్యాంగ సవరణ లో పొందుపరిచారు. (1976లో), భారతదేశం లౌకిక రాజ్యం ఎందువల్లనంటే – అధికార మతం లేదు

    సామ్యవాద రాజ్యం.

    • దేశ ప్రజలలోన ఆర్థిక అసమానతలను తగ్గించి వారి ఆర్థిక పురోభివృద్ధికే పాటుపడేది సామ్యవాద రాజ్యం.
    • సామ్యవాద రాజ్యాంగ రూపొందాలని నిర్దేశించేది ప్రవేశిక.
    • రాజ్యాంగ ప్రవేశికలో ” సామ్యవాదం” అనే పదాన్ని 42వ సవరణ లో పొందుపరిచారు. (1976)

    సౌభ్రాతృత్వం

    • అనగా సోదరభావం, పౌరుల మధ్య సంఘీభావం, వ్యక్తి గౌరవం ఉండాలి, ఈ పదాన్ని రాజ్యాంగ ప్రవేశికలో చేర్చాలని – ” బి ఆర్ అంబేద్కర్”.
    • ఏకత & సమగ్రత అనగా భారత ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించుటకు ఉద్దేశించినది.
    • 1976 సంవత్సరంలో చేసిన 42 వ రాజ్యాంగ సవరణ ద్వారా సమగ్రత అనే పదం ప్రవేశికలో చేర్చారు.
    • ప్రవేశిక కు సంబంధించిన సుప్రీం కోర్టు తీర్పులు :
    1. బెరుబారి కేసు (1960) • ప్రవేశిక రాజ్యాంగంలోని అంతర్భాగం కాదు.
    • బెరుబారి అనేది పాకిస్తాన్, భారతదేశం మధ్య గల ఒక ప్రాంతం.
    • ఈ ప్రాంతం పాకిస్తాన్ – భారత్ ల మధ్య మార్పిడి వలన ఏర్పడిన కేసు బెరుబారి కేసు.
    2. కేశవానంద భారతి కేసు (1973) • ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం.
    • ఈ కేసులో తీర్పు వెలువరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సిక్రీ.
    • ఇదే విధమైన అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు మినర్వా మిల్స్ (1990) కేసు, ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసు (1995)లో ప్రకటించింది.
    3. S.R బొంబాయి కేస్ (1994). • ప్రవేశిక రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం.
    • ప్రవేశిక భారత ప్రజాస్వామ్యం గణతంత్రానికి రాజకీయ జాతక చక్రం – M మున్షి.
    • ప్రవేశిక రాజ్యాంగ ఆత్మ, రాజ్యాంగాన్ని తాళంచెవి రాజ్యాంగము హృదయం, ఆభరణం – ఠాగూర్ దాస్ భార్గవ.
    • ప్రవేశిక మన కలలకు ఆలోచనలకు రాజ్యాంగంలో వ్యక్తీకరించు నా అభిమతం – అల్లాడి కృష్ణస్వామి.
    • ప్రవేశిక రాజ్యాంగంలో నిర్మాతల ఆశయాలు, లక్ష్యాలను తెలుసుకోవడానికి తాళంచెవి లాంటిది – డయ్యర్.

     

    Close