-->

ప్రాథమిక హక్కులు ఎన్ని అవి ఏవి? || ప్రాథమిక హక్కులు || What are the fundamental rights?

Also Read

ప్రాథమిక హక్కులు

  • రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు 3 భాగంలో ఉన్నాయి.
  • ప్రాథమిక హక్కుల గురించి ఆర్టికల్ 12 నుండి 35 వరకు పొందుపరిచారు.
  • ప్రాథమిక హక్కులను అమెరికా రాజ్యాంగం నుండి గ్రహించారు.
  • భారతీయులకు సమాన హక్కులు కావాలని డిమాండ్ చేసిన వ్యక్తి- బాలగంగాధర్ తిలక్.
  • 1911లో కలకత్తాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశంలో తీర్మానం ఆమోదించారు.
  • ప్రాథమిక హక్కులను న్యాయస్థానాలు కాపాడతాయి.
  • జాతీయ అత్యవసర పరిస్థితుల్లో 20, 21 ప్రకరణలు తప్ప మిగిలిన ప్రాథమిక హక్కులన్నింటిని రద్దు చేయవచ్చు.
  • అధికారంపార్లమెంటుకు ఉంది కానీ వాటి స్ఫూర్తికి భంగం కలిగించరాదు.
  • రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 7 ప్రాథమిక హక్కులు ఉండగా 1978లో 44వ సవరణ ద్వారా “ఆస్తి హక్కు” తొలగించారు.
  • ఆస్తి హక్కును 300 (ఏ) అధికారంలో చేర్చారు.
  • “ఆస్తి హక్కు” ప్రస్తుతం కేవలం ‘చట్టబద్ధ హక్కు’ మాత్రమే.

 

ప్రస్తుతం ప్రాథమిక హక్కుల సంఖ్య 6 :

  1. సమానత్వపు హక్కు -(14-18 ప్రకరణలు)
  2. స్వాతంత్రపు హక్కు -(19-22 ప్రకరణలు)
  3. పీడన నిరోధక హక్కు-(23-24 ప్రకరణలు)
  4. మత స్వాతంత్రపు హక్కు -(25-28 ప్రకరణలు)
  5. విద్యా సాంస్కృతిక హక్కు -(29-30 ప్రకరణలు)
  6. రాజ్యాంగ పరిహారపు హక్కు -(32 వ ప్రకరణ)

 

ప్రాథమిక హక్కులు- సంక్షిప్త వివరణ :

12వ అధికరణ : రాజ్యం అనే పదానికి నిర్వచనం ఇవ్వబడింది.

13వ అధికరణం : రాజ్యాంగం లోకి రాక ముందు ఉన్న చట్టాలు, ప్రస్తుతం చట్టాల్లోని ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉంటే అవి చెల్లవు.

  1. సమానత్వపు హక్కు :

14వ అధికరణ : చట్టం ముందు అందరూ సమానులే.

  • ఈ నియమం బ్రిటన్ నుండి గ్రహించారు.
  • అయితే ఇది రాష్ట్రపతి, గవర్నర్, విదేశీరాయబారులు, దౌత్యవేత్తలకు వర్తించదు.

15వ అధికరణ : పౌరులను జాతి, కుల, మమత లింగ, పుట్టక ఆధారంగా వివక్ష చూపరాదు.

16వ అధికరణ : ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు.

  • 16(4) ప్రకారం ఉద్యోగాలలో కొన్నింటిని కొన్ని వర్గాలకు రిజర్వ్ చేయవచ్చు.

17వ అధికరణ : అంటరానితనాన్ని నిషేధిస్తుంది.

  • అంటరానితనం నిషేధించే చట్టం 1955 లో చేయబడింది. దీన్ని 1976లో పౌరహక్కుల రక్షణ చట్టంగా మార్చారు.

18వ అధికరణ : బిరుదులు కీర్తి, చిహ్నాలను నిషేధిస్తుంది.

2. స్వాతంత్రపు హక్కు :

 

19వ అధికరణ : స్వేచ్ఛ హక్కు ఆరు రకాల స్వేచ్ఛలను భారత పౌరులకు కల్పిస్తుంది.

  • వాక్ స్వేచ్ఛ, సమావేశాలు ఏర్పాటు, దేశంలో సంచరించే స్వేచ్ఛ, ఎక్కడైనా స్థిరపడే స్వేచ్ఛ, సంఘాలుగా ఏర్పడి స్వేచ్ఛ, నచ్చిన వృత్తిని చేపట్టే స్వేచ్ఛ ప్రజలకు కల్పించబడింది.

20వ అధికరణ : నేరానికి మించి శిక్ష విధించరాదు.

  • అక్రమంగా ప్రజలను శిక్షించే అధికారం ప్రభుత్వాలకు లేదనీ 20వ ప్రకరణ పేర్కొంటుంది.

21వ అధికరణ : జీవించే హక్కు. ( జపాన్ నుండి గ్రహించారు)

  • ఏ ఒక్క వ్యక్తిని చట్టం నిర్దేశించిన పద్ధతి ప్రకారం తప్ప మరే విధంగానూ అతడి జీవితానికి, స్వాతంత్య్రానికి భంగం కలిగించే విధంగా వ్యవహరించారు రాదు.
  • ఈ ప్రకరణ “వ్యక్తి ప్రాణరక్షణకు – అంతరంగిక స్వేచ్ఛ రక్షణకు” అండగా నిలుస్తుంది.

21-ఏ అధికరణ : విద్య హక్కు జీవించే హక్కు లో ఒక భాగమని సుప్రీంకోర్టు కొన్ని కేసుల్లో పేర్కొంది.

  • ఉదా : ఉన్నికృష్ణన్ vs ఆంధ్ర ప్రదేశ్ కేసులో ప్రాథమిక “విద్య హక్కును” ఒక ప్రాథమిక హక్కుగా సుప్రీం కోర్ట్ పరిగణించింది.
  • 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యహక్కును ప్రకరణ 21-ఏ లో చేర్చారు.
  • 6 నుండి 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు “నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను” అందించాలని పేర్కొన్నారు.
  • దేశవ్యాప్తంగా విద్యా హక్కు చట్టం ‘2010 ఏప్రిల్ 1’ నుండి అమల్లోకి వచ్చింది.

22వ అధికరణ :

  • అక్రమ అరెస్టులకు, కు నిర్బంధాలకు వ్యతిరేకంగా రక్షణ.
  • ఏ ఒక్కరిని కారణం లేకుండా నిర్బంధంలోకి తీసుకోరాదు.
  • అరెస్టు చేసిన వ్యక్తిని 24 గంటల లోపు దగ్గర్లో ఉన్న కోర్టు ముందుగానీ, న్యాయమూర్తి ముందుగానీ హాజరు పరచాలి.

 

  1. పీడనాన్ని నిరోధించే హక్కు :

 

23వ అధికరణ :

  • మనుషుల అమ్మకం, కొనుగోళ్లు, వెట్టిచాకిరి వంటి అమానుష చర్యలను నిషేధించింది.

24వ అధికరణ :

  • బాలకార్మిక వ్యవస్థ నిషేధం.
  • 14 సంవత్సరాలలోపు పిల్లలను గనులు, ఫ్యాక్టరీలో, ఇతర ప్రమాదకర పనుల్లో నిర్మించరాదు.

 

  1. మత స్వాతంత్రపు హక్కు :

 

25వ అధికరణ :

  • మత విశ్వాసాలను కలిగి ఉండే హక్కు, మత ప్రచారం చేసుకోనే హక్కు.

26వ అధికరణ :

  • శాంతిభద్రతలకు, నైతికతకు, ఆరోగ్యానికి భంగం కలిగించకుండా వ్యక్తులు మత సంస్థలను ఏర్పాటుచేసి నిర్వహించుకోవచ్చు.

27వ అధికరణ :

  • మత కార్యకలాపాలపై పన్నులు విధించిరాదు.

28వ అధికరణ :

  • ప్రభుత్వం మరియు ప్రభుత్వ ఆర్థిక సాయంతో నడిచే ప్రైవేట్ విద్యాసంస్థలలో ప్రత్యేక మతబోధ నిషేధం.

 

  1. విద్యా సాంస్కృతిక హక్కు:

 

29వ అధికరణ :

  • అల్ప సంఖ్యాకుల ప్రయోజనాలను పరిరక్షించడం.

30వ అధికరణ :

  • విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోవడంలో, నిర్వహించుకోవడం లో గల మైనార్టీలక గల హక్కు.

 

ఆస్తి హక్కు :

 

31వ అధికరణ :

  • ఆస్తి హక్కును 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించారు.

 

  1. రాజ్యాంగ పరిహార హక్కు :

 

32వ అధికరణ :

  • ఈ అధికరణ రాజ్యాంగ పరిహారపు హక్కు గురించి వివరిస్తుంది
  • హృదయం మరియు ఆత్మ వంటిది అని B.R అంబేద్కర్ అభిప్రాయ పడ్డాడు.
  • ప్రాథమిక హక్కులపై పరిరక్షణకు రిట్లు జారీ చేయడం గురించి ఈ అధికారం వివరిస్తుంది.

33వ అధికరణ :

  • ప్రాథమిక హక్కుల పై పరిమితులు విధించే అధికారం పార్లమెంటుకు ఉంది.

34వ అధికరణ : సైనిక శాసనం( మార్షల్ లా) ఉన్నప్పుడు ప్రాథమిక హక్కుల పై పరిమితులు.

35వ అధికరణ :

  • కొన్ని ప్రాథమిక హక్కులకు సంబంధించి శాసనాలు చేయు అధికారం.

Close