-->

స్టార్టప్ ఇండియా మరియు స్టాండ్ అప్ ఇండియా అంటే ఏమిటి? (Central Government Schemes | Schemes | Ministry of Finance | Government of India )

Also Read

 


దేశంలో పరిశ్రమల వ్యవన్థాపనను ప్రోత్సహించడానికి ఉద్యోగాల కల్పనకు స్టార్టప్‌ ఇండియాvస్టాండప్‌ ఇండియా అనే నినాదంతో పథకాన్ని ప్రధాని మోదీ 2015, ఆగష్టు 15 ప్రకటించారు. వినూత్న వాయపార ఆలోచనలు, పరిశ్రమలు నెలకొల్లే ఆలోచనలున్న వారికి చేయూతనివ్వడం కోసం ఈ కార్యక్రమ ప్రణాళికను 2016, జనవరి 16న ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో విడుదల చేశారు. మేక్‌ఇన్‌ ఇంఇయా అంటే ఇండియాలో తయారీ మాత్రమే కాదు, దేశంకోసం ఉత్పత్తి చేయడం (మేక్‌ ఫర్‌ ఇండియా). 35 లక్షల మంది యువకులకు ఉపాధి కల్పిస్తారు. ఇప్పటికే 4200 స్టార్టప్‌ల వ్యవస్థాపనతో అమెరికా, బ్రిటన్‌ల తరువాత భారత్‌ మూడో స్థానంలో ఉంది.

 

స్టార్దవ ఇండియా ప్రధానాంశాలు

  • స్టార్టప్‌ పరిశ్రమలకు మూడేండ్ల పాటు ఆదాయపన్ను మినహాయింపు.
  • స్టార్టప్‌లకు నిధులందించేందుకు మొదట రూ. 2500 కోట్ల నిధిని ఏర్పాటు చేస్తారు. దీన్ని వచ్చే నాలుగేళ్లలో రూ. 10,000 కోట్లకు పెంచుతారు.
  • మూలధన లాభాలపై పన్ను మినహాయింపు.
  • స్టార్టప్‌లకు మద్దతుగా రూ.10 వేల కోట్లతో ప్రభుత్వ నిధి.
  • స్టార్టప్‌ పరిశ్రమ వ్యవస్థకు సంబంధించి ప్రభుత్వంతో సంప్రదింపులకు సింగిల్‌ విండో కేంద్రం ఏర్పాటు.
  • తక్కువ ఖర్చుతో న్యాయ సహాయం, సత్వర మేధో వాక్కుల పరిశీలన
  • దివాలా బిల్లు-2015 సత్వర ఆమోదంతో స్టార్టప్‌ పరిశ్రమలు సులభంగా మూసివేసే అవకాశం.
  • రంగాల వారీగా కొత్త పరిశ్రమలకు సదుపాయాల కల్పనల కేంద్రాలు.

Close