-->

చరిత్రలో ఈ రోజు జులై / - 04 || This day in history in July / - 04

Also Read

 🌳🌎చరిత్రలో ఈ రోజు  జులై  / - 04🌎🌳

🔎సంఘటనలు🔍


🌸1892: పశ్చిమ సమోవా, అంతర్జాతీయ డేట్ లైన్ మారే చోట ఉంది. అందుకని, 1892 సంవత్సరంలోని రోజులు 367, జూలై 4 తేది సోమవారం, రెండుసార్లు, పశ్చిమ సమోవా దేశంలో వచ్చింది.


🌸1946: ఫిలిప్పైన్స్ కు అమెరికా నుండి స్వతంత్రం.


🌸1947: భారతదేశాన్ని ఇండియా - పాకిస్థాన్ గా విభజించాలని బిల్లు ప్రతిపాదన.


🌸1976: పాలస్తీనా ఉగ్రవాదులు ఎయిర్ ఫ్రాన్స్ జెట్ లైనర్ విమానాన్ని, ఉగాండా లోని ఎంటెబ్బె విమానాశ్రయంలో బంధించగా, ఇజ్రాయెల్ కమాండోలు మెరుపు దాడిచేసి, ఆ విమానంలో వున్న ప్రయాణీకులను (నలుగురు ప్రయాణీకులు మరణించారు), విమాన సిబ్బందిని రక్షించారు. ఈ బందీల విడుదల కార్యక్రమానికి ఆపరేషన్ థండర్ బోల్ట్ అనే రహస్యమైన పేరు పెట్టారు.


🌼జననాలు🌼


💖1790: జార్జి ఎవరెస్టు, భారత సర్వేయర్ జనరల్. (మ.1866)


💖1807: గిసేప్పి గరిబాల్ది, ఇటాలియన్ జనరల్, రాజకీయ నాయకుడు. (మ.1882)


💖1882: జనమంచి శేషాద్రి శర్మ, తెలుగు కవి, పండితుడు. (మ.1950)


💖1897: అల్లూరి సీతారామ రాజు, విప్లవ వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1924)


💖1898: గుర్జారీలాల్ నందా, భారత జాతీయ రాజకీయనాయకుడు, రెండుసార్లు భారతదేశ తాత్కాలిక ప్రధానమంత్రిగా వ్యవహరించాడు. (మ.1998)


💖1904: నేదునూరి గంగాధరం, తెలుగు రచయిత. (మ.1970)


💖1918: చల్లా కొండయ్య, న్యాయవాది, ప్రధాన న్యాయమూర్తి.


💖1921: గెరాల్డ్ డిబ్రూ, ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత


💖1927: ఉత్పల సత్యనారాయణాచార్య, తెలుగు కవి, రచయిత, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. (మ.2007)


💖1927: అంగర సూర్యారావు, నాటక రచయిత, చరిత్రకారుడు. (మ.2017)


💖1933: కొణిజేటి రోశయ్య, రాజకీయ నాయకుడు, తమిళనాడు రాష్ట్ర గవర్నరు.


💖1936: గరిమెళ్ళ రామమూర్తి, నటులు, నాటకసంస్థ నిర్వాహకులు. (మ.2004)


💖1938: ఉమా రామారావు, కూచిపూడి నర్తకి, నృత్య దర్శకురాలు, పరిశోధకులు, ఆచార్యులు, రచయిత్రి.


💖1941: ఇందారపు కిషన్ రావు అవధాని, కవి, బహుభాషా కోవిదుడు. (మ.2017)


💖1961: ఎం. ఎం. కీరవాణి, తెలుగు చలనచిత్ర సంగీతదర్శకుడు, గాయకుడు.


💖1961: జోగు రామన్న, తెలంగాణ శాసనసభ్యుడు, మాజీ మంత్రి.


💐మరణాలు💐


🍁1826: జాన్ ఆడమ్స్, అమెరికా మాజీ అధ్యక్షుడు.


🍁1826: థామస్ జెఫర్సన్, అమెరికా మాజీ అధ్యక్షుడు. (జ.1743)


🍁1831: జేమ్స్ మన్రో, అమెరికా మాజీ అధ్యక్షుడు.


🍁1902: స్వామి వివేకానంద, భారతీయ తత్వవేత్త, రామకృష్ణ మిషన్ స్థాపకుడు. (జ.1863)


🍁1910: జియోవాన్ని షాపరెల్లీ, ఇటాలియన్ ఖగోళ శాస్త్రవేత్త, విజ్ఞాన చరిత్రకారుడు.


🍁1934: మేరీ క్యూరీ, భౌతిక, రసాయనిక శాస్త్రవేత్త. రెండు నోబెల్ బహుమతులు (భౌతిక, రసాయన శాస్త్రాలలో) గ్రహీత. (జ.1867)


🍁1936: తాడూరి లక్ష్మీనరసింహ రాయకవి, తెలుగు కవి, 19 గ్రంథాలు రచించారు. (జ.1856)


🍁1946: దొడ్డి కొమరయ్య, తెలంగాణ సాయుధ పోరాట రైతాంగ వీరుడు, తొలి అమరుడు. (జ.1927)


🍁1963: పింగళి వెంకయ్య, భారతదేశ జాతీయ పతాక నిర్మాత.


🍁1969: కవికొండల వెంకటరావు, తెలుగు కవి, జానపద, నాటక రచయిత. (జ.1892)


🍁1986: దత్తాత్రేయ రామచంద్ర కప్రేకర్, భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు.


🍁2013: గంటి ప్రసాదం, నక్సలైటు నాయకుడుగా మారిన కవి.

Close